కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్రను వాయిదా వేశారు. మళ్లీ యాత్ర ఎప్పుడు చేసేది తర్వాత ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 48 గంటలు హౌస్ అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారని తెలిపారు. సత్యాగ్రహ యాత్రకు పోలీసుల అనుమతి అవసరంలేదని ముద్రగడ చెప్పారు.