ముద్రగడ గృహనిర్బంధం
- కాపు సత్యాగ్రహ యాత్రకు బ్రేక్
- కాపునేతలపై రాష్ట్రప్రభుత్వ ఉక్కుపాదం
సాక్షి, కాకినాడ/అమరావతి/ఏలూరు: బీసీ రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగ డ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం నుంచి తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’కు బ్రేక్ పడింది. ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు పాద యాత్ర ప్రయత్నాన్ని భగ్నం చేశారు. కోనసీ మలో కాపు జేఏసీ నేతలు, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరికొం దరు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, సాధనా ల శ్రీనివాస్, ఈవై దాసు, నల్లా విష్ణు, కలవ కొలను తాతాజీ, పవన్ తదితరులను పోలీసు లు రావులపాలెంలో అరెస్ట్ చేసి కాకినాడ 3వ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. కాపు నేతలపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో కోనసీమ నివురుగప్పిన నిప్పులా ఉంది.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్ర గడ ఈ నెల 16 (బుధవారం) రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్రకు పిలుపునిచ్చారు. పాదయాత్ర అంతర్వేది వరకు ఐదురోజులపాటు నిర్వహిం చాలని నిర్ణరుుంచారు. రావుల పాలెంలో బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించేం దుకు మంగళవారం సాయం త్రం ముద్రగడ కిర్లంపూడిలోని స్వగృహం నుంచి కారులో బయలుదేరగా గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు. పాద యాత్రకు అనుమతి లేదని, శాంతి భద్రతల సమస్య ఉండ టంతో గృహనిర్భంధం చేస్తున్న ట్టు పోలీసులు ప్రకటించారు.
తాను సంఘ విద్రోహినా, గృహ నిర్బంధం ఎంతకాలమో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. పోలీసులు గంట సమయం అడిగి ఉన్నతాధి కారులతో సంప్రదించి చెబుతామనడంతో ఆయన వెనుతిరిగారు. శాంతిభద్రతల సమ స్య ఉత్పన్నమవుతాయని, ముద్రగడ పాద యాత్ర నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాజమహేంద్రవరానికి చెందిన మేడా శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లగా పాదయాత్రను నిలువరించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ముందు నుంచి అనుకున్నట్టే.. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేశారు. పాదయాత్ర తాత్కాలికంగా వారుుదా పడిందని, త్వరలో తేదీలు ప్రకటిస్తామని ముద్రగడ వెల్లడించారు.
సర్కారు ముందస్తు వ్యూహం..
కోనసీమలో ప్రత్యేకించి అమలాపురం, రాజో లు తదితర ప్రాంతాలలో అరెస్ట్‌ల పర్వం ప్రారంభం కానుందని పోలీసులే వదంతులు వ్యాపింపజేసి భయోత్పాతం సృష్టించారు. పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లేలా చేశారు. వేలాది మంది పోలీసుల్ని కోనసీమకు రప్పిం చిన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివే స్తామని బెదిరింపులకు దిగింది. ఎట్టిపరిస్థితు ల్లోనూ ముద్రగడ పాదయాత్రను జరగనీ యకుండా చేస్తామని పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చిన రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళ వారం ఉదయం నుంచే పోలీసు ఉన్న తాధికారులతో మాట్లాడుతూ.. బయటకు వచ్చిన వాళ్లను వచ్చినట్టు అరెస్ట్ చేయాల్సిందిగా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే బలిజ చైతన్య యాత్రకు దిగిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయను ముందుకు సాగనీయకుండా చేసి ఆ తర్వాత ముద్రగడను నిర్బంధించారు.
రాష్ట్రంలో రావణాసురుడు అన్నయ్య పాలన
‘‘రాష్ట్రంలో రావణాసురుడు అన్నయ్య పాలనను చూస్తున్నాం. మా హక్కుల కోసం పోరాడుతూ కోల్పోరుున రిజర్వేష న్లు మాత్రమే కోరుతున్నాం. ఇతర కులా లకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు కల్పిం చాలని కోరుతున్నాం. ప్రభుత్వం మాత్రం ఇతర కులాలను రెచ్చగొడుతోం ది. బాబు పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీని పాదయాత్ర ద్వారానే గుర్తు చేయాలని జేఏసీ నిర్ణరుుంచింది. పాదయాత్రలపై టీడీపీకి ఒక చట్టం మాకొక చట్టమా? చంద్రబాబు పాదయాత్రకు పర్మిషన్ తీసుకున్నారా? రిజర్వేషన్లు సాధించే వరకు నిరసనలు కొనసాగిస్తాం..’’
- కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం