ఉక్కుపాదం మోపినా ఉద్యమం తప్పదు
చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు జాతికి బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ చేపడుతున్న ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు సీఎం చంద్రబాబు చూస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. అరుునప్పటికీ ఉద్యమ పథం నుంచి వెనక్కు మళ్లేది లేదన్నారు. ఈ నెల 15న రావులపాలెం బయలుదేరిన తనను పోలీసులు అడ్డగించి గృహ నిర్బంధం చేయడం బాధాకరమని అన్నారు.3రోజుల గృహ నిర్బంధం అనంతరం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబును తమ జాతే కాదు.. ఏ జాతీ క్షమించదని, అబద్ధాలు చెప్పి పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెల 2న కాకినాడలో 13 జిల్లాలకు చెందిన పెద్దలతో జేఏసీ సమావేశం జరిపి కార్యాచరణను నిర్ణరుుంచుకుంటామని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు.