అనంతపురం: వేగంగా వెళుతున్న ఓ బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం అంచనహాల్ గ్రామం వద్ద 63 వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. కర్నూలు జిల్లా అగ్రహారానికి చెందిన నగేష్(32), డేగులపాడుకు చెందిన సోమశేఖర్(30) అనంతపురం జిల్లా గుంతకల్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నగేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సోమశేఖర్‌ను సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
(విడపనకల్)
ప్రాణం తీసిన వేగం
Published Mon, Mar 9 2015 8:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement