తాళ్లూరు: ప్రకాశం జిల్లా తాండూరు మండలం పరిధిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దర్శి మండలానికి చెందిన యువకుడు టీవీఎస్ విక్టర్ వాహనంపై చింతలపాలెం గ్రామం నుంచి దర్శి వైపునకు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ డీకొంది. తీవ్ర గాయాలైన యువకుడిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.