ప్రాణం తీసిన క్రికెట్‌ బాల్‌ వివాదం | A young man with a knife attacked in krishna | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన క్రికెట్‌ బాల్‌ వివాదం

Published Wed, Apr 19 2017 10:52 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

ప్రాణం తీసిన క్రికెట్‌ బాల్‌ వివాదం

ప్రాణం తీసిన క్రికెట్‌ బాల్‌ వివాదం

► తల్లికి బాల్‌ తగిలిందని యువకుడిపై కత్తితో దాడి..
► ఆస్పత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి

కృష్ణలంక(విజయవాడ ఈస్ట్‌): క్రికెట్‌ బాల్‌ తగలడంతో రేగిన వివాదం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఘటన నగరంలోని బందరు రోడ్డులోని పీఅండ్‌టీ కాలనీ మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాలు.. బీఎస్‌ఎన్‌లో ఉద్యోగం చేసే వైజయంతి క్వార్టర్స్‌లో ఉంటోంది. కుమారుడు తిమ్మశెట్టి కిరణ్‌కుమార్‌ (22) దూర విద్య డిగ్రీ చేస్తు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తోటి స్నేహితులతో కలిసి కిరణ్‌కుమార్‌ క్రికెట్‌ ఆడుతుండగా బంతి దగ్గరలో ఉన్న ఓ మహిళకు తగిలింది. దీంతో ఆమె క్రికెట్‌ ఆడుతున్న యువకులను తీవ్రంగా మందలించింది. తప్పు జరిగిందని యువకులు చెప్పి వెళ్లిపోయారు.

విషయం తెలుసుకున్న ఆమె కొడుకు ఇంజినీరింగ్‌ చదువుతున్న శ్రీకాంత్‌చౌదరి మా అమ్మనే బాల్‌తో కొడతారా అంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. చుట్టుపక్కలవారు నచ్చచెప్పి అతడిని పంపించి వేయడంతో గొడవ సర్దుమనిగిందిలే అనుకున్నారు. అయితే హఠాత్తుగా శ్రీకాంత్‌చౌదరి కత్తి తీసుకుని పరుగున కిరణ్‌కుమార్‌ వద్దకు వచ్చి గుండెల్లో పొడిచి అక్కడ నుంచి పరారయ్యాడు.  తీవ్ర రక్తస్రావంతో కిరణ్‌కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు 108లో  కిరణ్‌కుమార్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కృష్ణలంక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement