knife attacked
-
ప్రేమించలేదని ప్రాణం తీసాడు...
-
పెళ్లికి నో చెప్పిందని.. మరదలిపై కత్తితో దాడి
నస్పూర్ (మంచిర్యాల): తనతో పెళ్లికి నిరాకరించిందని వరుసకు మరదలైన యువతి(21)పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి వెళ్తున్న ఆమెపై పట్టపగలు హత్యకు ప్రయత్నించాడు. సోమవారం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. యువతి బంధువులు, స్థానిక ఎస్సై శ్రీనివాస్ ఈ ఘటన వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన యువతి సోమవారం నస్పూర్ గ్రామంలోని తమ బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైంది. కార్యక్రమం ముగిశాక తిరిగి ఇంటికి బయలుదేరింది. ఆమె ఆటో ఎక్కుతున్న సమయంలో వరుసకు బావ అయిన గడ్డం సాయికిరణ్ అక్కడికి వచ్చాడు. కల్లు గీసే కత్తి పట్టుకుని ఒక్కసారిగా ఆమెపై దాడికి ప్రయత్నించాడు. దీనితో ఆమె మెడపై గాయాలయ్యాయి. అది గమనించిన యువతి బంధువులు.. ఆమెను రక్షించి, మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని, కత్తిని సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. -
తమిళనాడులో జడ్జిపై హత్యాయత్నం
సాక్షి, చెన్నై: కోర్టు విధుల నుంచి బదిలీ చేశారనే ఆగ్రహంతో ఓ ఆఫీస్ అసిస్టెంట్ న్యాయమూర్తిపై ఏకంగా హత్యకు యత్నించిన ఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది. సేలం జిల్లా అస్థంపట్టిలో 24 కోర్టుల సముదాయం ఉంది. నాలుగో నేరవిభాగం కోర్టులో పొన్ పాండి న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసుల విచారణ నిమిత్తం మంగళవారం ఉదయం 11 గంటలకు కోర్టుకు చేరుకోగా అక్కడే పొంచి ఉన్న ప్రకాష్ అనే ఆఫీస్ అసిస్టెంట్ అకస్మాత్తుగా ఆయన్ను కత్తితో పొడవబోయాడు. అప్రమత్తమైన న్యాయమూర్తి కత్తిని అడ్డుకోగా చేతికి బలమైన గాయమైంది. అక్కడే ఉన్న వారు ప్రకాష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓమలూరు అనే ప్రాంతంలోని కోర్టుకు ప్రకాష్ ఇటీవల బదిలీ అయ్యాడు. దీనిపై అతడు జడ్జితో గొడవపడినట్లు సమాచారం. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యం’
సాక్షి, పిట్టలవానిపాలెం(గుంటూరు): ‘నన్ను చూసి నవ్వుతావంట్రాఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో గొంతు కోసిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు మండే వారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో యువకులు అందరూ కలిసి ప్రత్యేక దృశ్య రూపకం వద్ద ఉన్నారు. గ్రామానికి చెందిన జాలాది శివ (20) యువకుడు సమీపంలో మరో వ్యక్తితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వారికి ఎదురుగా ఉన్న దోనెపాటి శోభన్ నన్ను చూసి నవ్వుతావంట్రా నీకు ఎంత ధైర్యం అంటూ అతనిపై కలబడ్డాడు. సమీపంలో ఉన్నవారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. అయితే శివాజీ ఇంటికి వెళ్లిపోయాడు. అతనితో పాటే శోభన్ కూడా ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని శివాజీని కడుపులో పొడిచేందుకు ప్రయత్నించగా దగ్గరలో ఉన్నవారు అతన్ని పక్కకు లాగడంతో చేతిపై కత్తిగాయం అయింది. (చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య) సమీపంలోని వారు గాయం అయిన చోట పసుపు రాస్తుండగా మరోసారి కత్తితో వచ్చి ఒక్కసారిగా గొంతుకోసి వెళ్లిపోయాడు. రక్తస్రావం అధికం కావడంతో స్థానిక యువకులు శివాజీని చందోలు పోలీసు సేష్టన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పొన్నూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. జాలాది శివాజీ 10 ఏళ్ల వయస్సులో తండ్రిని, 15 ఏళ్ల వయస్సులో తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి గ్రామస్తులు, బం«ధువులతో సన్నిహితంగా ఉంటూ ఆటోను అద్దెకు తీసుకుని బాడుగలు లేని సమయంలో కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. దిక్కూ మొక్కూలేని వాడని ఈ విధంగా చేస్తారా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై శివాజీ ఆరోగ్యంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. -
భూవివాదం: ఇద్దరిపై కత్తిపోట్లు
భూవివాదం ఇద్దరి ప్రాణం మీదకు తెచ్చింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఎక్కువ ధర రావడంతో విక్రయదారురాలు వేరొకరికి అమ్మకానికి చూపడంతో వివాదం మొదలైంది. చివరకు కత్తితో పొడిచి ప్రాణాపాయానికి తెచ్చేంత పరిస్థితి నెలకొంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. భోగాపురం: పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన అరుణ, విజయనగరం కాణిపాక గ్రామానికి చెందిన పతివాడ ప్రవీణ్‌కుమార్‌పై కోనాడకు చెందిన బసవ ఉపేంద్ర కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోవడంతో సంచలనం రేగింది. దీనికి సంబంధించి భోగాపురం సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలు.. కోనాడ గ్రామానికి చెందిన రామగురువులు అనే మహిళ తనకున్న 1.90 ఎకరాల భూమిని వారి బంధువులైన బసవ అచ్చిబాబుకు గతంలో విక్రయించేందుకు సిద్ధపడి వారి నుంచి కొంత మొత్తం నగదు తీసుకుంది. ఇటీవల కాలంలో ఆ భూముల ధరలకు రెక్కలు రావడంతో డబ్బులకు ఆశపడి రామగురువులు అదే భూమిని అచ్చిబాబుకు తెలియకుండా విజయవాడలో ఉంటున్న శ్రీనివాసరెడ్డికి అమ్మేందుకు తన కూతురు అరుణతో కలిసి రామగురువులు శుక్రవారం భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న అచ్చిబాబు తన కుమారులు ఉపేంద్ర, వెంకటేష్, కె.అప్పలరెడ్డితో కలిసి భోగాపురం రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. రామగురువులును ప్రశ్నించాడు. గతంలో ఈ భూమిని తనకు విక్రయించేందుకు అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు తనకు తెలియకుండా వేరొకరికి ఎలా విక్రయిస్తావని ఇది ఎంత వరకు సమంజసమని అచ్చిబాబు రామగురువులును నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో అచ్చిబాబుతో వచ్చిన కుమారుల్లో ఒకరైన బసవ ఉపేంద్ర కొపోద్రిక్తుడై తమ్ముడు వెంకటేష్, స్నేహితుడు అప్పలరెడ్డితో కలిసి రామగురువులు కుమార్తె అరుణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇంతలో కొనుగోలుదారులు తరఫున వచ్చిన కాణిపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్ ఈ సంఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించడంతో గమనించి ఉపేంద్ర ఆయనపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో చేరుకున్నాడు. అప్పటికే రక్తం మడుగులో ఉన్న అరుణ, ప్రవీణ్‌కుమార్‌ను వెంటనే విజయనగరంలోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉపేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జనం మధ్య జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న భయాందోళనకు గురయ్యారు. -
గొంతు కోసి.. అడవిలో వదిలేసి
తలకొండపల్లి: గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. మండల పరిధిలోని నల్లమెట్టు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ బీఎస్ఎస్ వరప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఫరూక్నగర్ మండలం వెంకన్నగూడ పంచాయతీకి చెందిన కొడావత్ రాజు రెండేళ్ల క్రితం బదుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో పని చేసుకుంటూ భార్యాపిల్లలతో జీవనం సాగించాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఫంక్షన్ హాల్ తెరుచుకోకపోవడంతో మూడు నెలలుగా మేస్త్రీ పనికి వెళ్తున్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం 9 గంటలకు నల్లమెట్టు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై పడిఉన్నాడు. గొంతుపై గాయంతో అవస్థ పడుతున్న రాజును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని, రాజుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న బాధితుడు చేతులతో సైగల ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేశాడు. రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మైరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టుతున్నట్లు స్పష్టంచేశారు. -
దంపతుల పై కత్తితో దాడి
-
బంధాలను కాలరాసి.. కత్తులతో దాడిచేసి..
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : పొలం తగాదా నేపథ్యంలో ఒక కుటుంబంలోని సభ్యులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా రెండు ద్విచక్రవాహనాలు బుగ్గయ్యాయి. మండలంలోని రామన్నగూడెం పంచాయతీ నాగేశ్వరరావుమెట్ట వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రెల లక్ష్మణస్వామి ముగ్గురు కుమారులు శ్రీను, సత్యనారాయణ, పల్లయ్య పదేళ్ల క్రితం దుబాయి వెళ్లి అక్కడ సంపాదించిన సొమ్మును తండ్రికి పంపారు. ఈ మొత్తంతో లక్ష్మణస్వామి ఇక్కడ మూడున్నర ఎకరాల భూమిని తన పేరున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దుబాయి నుంచి కుమారులు వచ్చిన తర్వాత ఆ భూమిని అందరూ పంచుకుని సాగు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర క్రితం తండ్రి లక్ష్మణస్వామిని బ్యాంకు రుణం నిమిత్తం సంతకం పెట్టాలని శ్రీను అత్తిలి తీసుకెళ్లి మొత్తం భూమిని తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. దీనిపై పోలీస్టేషన్లో కేసులు, ఆర్డీఓ కోర్టులో వ్యాజ్యం నడవగా దస్తావేజు రద్దుకు ఆర్డీఓ సిఫార్సు చేశారు. అనంతరం ఎవరి వాటాల్లో వారు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఆదివారం లక్ష్మణస్వామి, పల్లయ్య వారి భూమి లో వ్యవసాయ పనులు చేస్తుండగా శ్రీను, అతడికి సంబంధించిన వ్యక్తు లు వీరి ద్విచక్రవాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. లక్ష్మణస్వామిపై కత్తులతో దాడికి దిగారు. విషయం తెలిసి సత్యనారాయణ, మిగిలిన కుటుంబసభ్యులు కూడా పొలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడిచేసుకోవడంతో శ్రీను, అతని భార్య సుజా త, సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తమ్ముడిపై కొడవలితో దాడి
అత్తాపూర్: పాత కక్ష్యలను మనసులో పెట్టుకొని తమ్ముడిపై అన్న కొడవలితో దాడిచేసిన సంఘటన రాజేంద్రనరగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో అన్నదమ్ములు సామ సుభాష్‌రెడ్డి, చంద్రశేఖర్రెడ్డిలు నివసిస్తున్నారు. సుభాష్‌రెడ్డి వ్యాపారం చేస్తుండగా, చంద్రశేఖర్‌రెడ్డి లాయర్‌గా పనిచేస్తున్నాడు. తగ కొంత కాలంగా ఇద్దరికి ఆస్తుల లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో గొడవలు పడి ఒకరిపై ఒకరు రాజేంద్రనగర్ పీఎస్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం మధ్యాహ్నం వాంబేకాలనీ సమీపంలో నీటి సరఫరా జరిగే పైపులైన్ మరమ్మతుల విషయమై సామ సుభాష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో సుభాస్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న గడ్డి కోసే కొడవలితో తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు తీవ్ర గాయాలకు గురైన చంద్రశేఖర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తనపై సుభాష్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకు దాడి చేశారని చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుభాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ప్రాణం తీసిన క్రికెట్ బాల్ వివాదం
► తల్లికి బాల్ తగిలిందని యువకుడిపై కత్తితో దాడి.. ► ఆస్పత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి కృష్ణలంక(విజయవాడ ఈస్ట్): క్రికెట్ బాల్ తగలడంతో రేగిన వివాదం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఘటన నగరంలోని బందరు రోడ్డులోని పీఅండ్‌టీ కాలనీ మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. బీఎస్ఎన్లో ఉద్యోగం చేసే వైజయంతి క్వార్టర్స్‌లో ఉంటోంది. కుమారుడు తిమ్మశెట్టి కిరణ్‌కుమార్ (22) దూర విద్య డిగ్రీ చేస్తు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తోటి స్నేహితులతో కలిసి కిరణ్‌కుమార్ క్రికెట్ ఆడుతుండగా బంతి దగ్గరలో ఉన్న ఓ మహిళకు తగిలింది. దీంతో ఆమె క్రికెట్ ఆడుతున్న యువకులను తీవ్రంగా మందలించింది. తప్పు జరిగిందని యువకులు చెప్పి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఆమె కొడుకు ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీకాంత్‌చౌదరి మా అమ్మనే బాల్‌తో కొడతారా అంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. చుట్టుపక్కలవారు నచ్చచెప్పి అతడిని పంపించి వేయడంతో గొడవ సర్దుమనిగిందిలే అనుకున్నారు. అయితే హఠాత్తుగా శ్రీకాంత్‌చౌదరి కత్తి తీసుకుని పరుగున కిరణ్‌కుమార్ వద్దకు వచ్చి గుండెల్లో పొడిచి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో కిరణ్‌కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు 108లో కిరణ్‌కుమార్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కృష్ణలంక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.