ఆరోగ్యశ్రీ నిధుల ఖర్చుకు మార్గదర్శకాలు | Aarogyasri funding guidelines | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ నిధుల ఖర్చుకు మార్గదర్శకాలు

Published Sat, Jan 10 2015 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

Aarogyasri funding guidelines

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రివాల్వింగ్ ఫండ్ వినియోగానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు ఖరారు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 20 శాతం రివాల్వింగ్ ఫండ్‌ను ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వీటిని ప్రభుత్వ నెట్‌వర్క్ ఆసుపత్రులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేయాలనేది ఈ మార్గదర్శకాల ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిగిలిన 80 శాతం సొమ్ములో 45 శాతాన్ని రోగికి మెరుగైన సేవలు అందించడానికి, 35 శాతం నిధులను డాక్టర్లు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తారు. రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేసేందుకు అవసరమైన అంశాలనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement