guides
-
భయధైర్యాలు
చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం. మాధవ్ శింగరాజు మనుషులు ఎవరి పని వారు చేసుకుపోతే, చట్టానికి తన పని తాను చేసుకుపోయే అవసరం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతోందంటేనే.. ‘ఓరి దేవుడా’ అనుకోవాలి.. మనుషులెవరో తాము చేయవలసిన పని చేయకుండా ఉండడమో, చేయ తగని పనిని చేసి ఉండడమో జరిగిందని! బిహార్‌లోని బుద్ధగయలో ఒక కేసు విషయంలో చట్టం ఇప్పుడు తన పని తను చేసుకుపోతోంది. బుద్ధగయలోని మహాబోధి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేతం. ఆలయ దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చివెళుతుంటారు. ఇటీవల 32 ఏళ్ల చైనా మహిళ ఒకరు షాంఘై నుంచి ఒంటరిగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు గైడ్‌నని చెప్పుకున్న పాతికేళ్ల యువకుడు ఆమెతో అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించాడు. ‘‘మీరిక్కడ చూడవలసినవి, చాలామందికి తెలియనివి అనేకం ఉన్నాయి’’ అని తీసుకెళ్లి సీసీ కెమెరాల లేని ప్రదేశంలో ఆ మహిళ చెయ్యి పట్టుకున్నాడు. ఆమె నిర్ఘాంతపోయారు. పవిత్ర బుద్ధ భగవానుని సన్నిధిలోనూ ఇలా చేసేవాళ్లుంటారా అని నిశ్చేష్టులయ్యారు. ఆలయ నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎన్.దోర్జే వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె చేత కంప్లయింట్ రాయించుకుని, కేస్ ఫైల్ చేశారు. బుద్ధగయలో అధికారిక గైడ్లు ఉంటారు. కానీ ఎలాగో ఆమె ఆ నకిలీ గైడ్ ట్రాప్‌లో పడిపోయారు. బహుశా అధికారిక గైడ్ నిర్లక్ష్యానికి భిన్నంగా అతడు ఎంతో మర్యాద ఇచ్చి, ఆమెకు నమ్మకాన్ని కలిగించి ఉంటాడు. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న గైడ్లు ఉద్యోగానికి అలవాటు పడిపోయి, టూరిస్టులతో.. ‘వస్తే వచ్చారు... పోతే పోయారు’ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రైవేటు గైడ్లు అలా కాదు. శ్రద్ధ తీసుకుంటారు. దగ్గరుండి అన్నీ చూపిస్తారు. డబ్బెంత తీసుకుంటారన్నది ముఖ్యంగా కనిపించదు. విధేయంగా ఉన్నాడా లేదా అన్నదే భాష తెలియనివారికి ముఖ్యం అవుతుంది. షాంఘై మహిళ నుంచి కంప్లయింట్ తీసుకున్నాక బుద్ధగయ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో పెట్టారు. ఇక అతడికి శిక్ష వేస్తారు అనుకుంటుండగా.. షాంఘై వెళ్లిపోయిన ఆ మహిళ నుంచి ఇక్కడి పోలీసులకు ఒక లెటర్ వచ్చింది. యువకుడిని శిక్షించవద్దని, అతడిలో పరివర్తన తెచ్చే ప్రయత్నాలు చేయమని ఆమె అభ్యర్థన! ‘‘నేను బౌద్ధమతాన్ని విశ్వసిస్తాను. అందుకే అంతదూరం వచ్చాను. కానీ ఒక చేదు అనుభవం ఎదురైంది. అపరాధిని క్షమించమని బౌద్ధం చెబుతోంది. మీరు ఇప్పుడు అతడిని శిక్షిస్తే సంస్కరణ అతడితో ఆగిపోతుంది. శిక్షించకుండా సత్ప్రవర్తనపై శిక్షణ ఇప్పిస్తే అతడు మారడమే కాదు, మరికొందరిలో మార్పునకు కారణం అవుతాడు. అధికారులను నేను ఒకటే కోరుతున్నాను. అతడికి మంచి చదువును అందించండి. జీవితంలో మంచి పనులు చేసేలా అతడిలో ఆలోచన కలిగించండి. ఆ విధంగా బుద్ధగయను దర్శించుకునే ఒంటరి మహిళలకు, ఒంటరిగా ప్రయాణించి వచ్చే మహిళలకు భద్రతను, భరోసాను కలుగజేయండి’’ అని రాశారు షాంఘై మహిళ. అయితే ఆమె కోరినట్లు ఇప్పుడేమీ జరగబోవడం లేదు. డిస్ట్రిక్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.ఎస్.పి) రాజీవ్ మిశ్రా.. చట్టం తన పని తను చేసుకుపోయే యంత్రాంగంలో ఉద్యోగధర్మగ్రస్తుడైన ఒక నిమిత్త మాత్రపు చోదకశక్తిగానే ఉండబోతున్నారు. ‘‘భావోద్వేగాలకు చట్టంలో చోటు ఉండదు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడి తీరవలసిందే. బాధితురాలు క్షమాభిక్ష ప్రసాదించినప్పటికీ, బాధితురాలి తరఫున క్షమాభిక్ష ప్రసాదించడానికి చట్టానికి హక్కు లేదు’’ అని ఆయన నిక్కచ్చిగా చెప్పేశారు. నేడో రేపో ఆ యువకుడిపై చార్జిషీటు వేయబోతున్నారు. దానిని కోర్టుకు సమర్పించగానే శిక్ష ఖరారవుతుంది. ఉరిశిక్షేం వెయ్యరు కానీ.. శిక్షయితే వేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోవడానికి ఒక కంప్లయింట్ అయితే అవసరమే కానీ, కంప్లయింట్‌ని వెనక్కు తీసుకుని చట్టం చేత ఆ పనిని ఆపించడం తేలిక కాదు. పోలీసులు నిందితుడి పట్టుకుని, కోర్టులో నిందితుడిని హాజరు పరిచి, కోర్టు రెండు వైపుల వాదనలు వినీ.. ఇన్ని జరగడానికి ఎంతో విలువైన వివిధ శాఖల సమయం ఖర్చవుతుంది. తీరా శిక్ష విధిస్తున్నప్పుడు.. ‘స్టాప్.. ఆపండి’ అని వస్తే ఆ శాఖలు మందలిస్తాయి. ఒక్కోసారి ఆగ్రహిస్తాయి. షాంగ్ మహిళ రాసిన లెటర్లో ఒక పాయింట్ ‘అవున్నిజమే’ అనిపించేలా ఉంది. ‘అపరాధిని శిక్షిస్తే అతడొక్కడే మారతాడు. అపరాధిని సంస్కరిస్తే ఎందరినో మారుస్తాడు’ అని ఆమె రాశారు. చట్టానికి కావలసిందీ అదే. నేరం జరగకుండా ఉండడం. అయితే ఇదే విషయాన్ని చట్టం మరోలా చెబుతుంది. ‘అపరాధిని శిక్షిస్తే భయంతో సమాజం మారుతుంది. అపరాధిని సంస్కరించి వదిలేస్తే శిక్ష ఉండదన్న ధైర్యంతో మారాల్సి అవసరం లేదనుకుంటుంది’ అని! ఎవరి పాయింట్ కరెక్ట్? రెండు పాయింట్లూ కరెక్టే. అయితే చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం. ఆ సంస్కరణను శిక్షే తెచ్చినా, శిక్షణే తెచ్చినా. -
ఘనంగా స్కార్ఫ్ డే
భారత్ స్కౌట్స్, గైడ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్కార్ఫ్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్‌కు భారత్ స్కౌట్స్, గైడ్స్ జిల్లా కార్యదర్శి ఎ.శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి.సంధ్య స్కార్ఫ్ అందజేశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గైడ్ కెప్టెన్ అనుపమ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. – హన్మకొండ -
స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్
వర్ధన్నపేట : మండలంలోని బండౌతపురం శివారు అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆరెల్లి శ్రీనివాసులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్(బీఎస్అండ్జీ) జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎ.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన బీఎస్అండ్జీ ఎన్నికల్లో జిల్లా కార్యదర్శిగా శ్రీనివాసులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఐదేళ్ళ బాలికే ఆధారం!
'కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు' అన్న సామెత ఆ బాలిక విషయంలో సరిగ్గా సరిపోతుంది. అంధుడైన తన తండ్రి.. కొబ్బరి తోటల్లో పనికి వెళ్ళేందుకు ప్రతిరోజూ దారి చూపించే ఆ చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకమౌతోంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫిలిప్పీన్స్ కు చెందిన ఐదేళ్ళ బాలిక జెన్నీ, కాలికి చెప్పుల్లేకుండా తన అంధ తండ్రి పెపె నెల్సన్ కు పనిలో సహాయపడటం ఇప్పుడు ఫేస్ బుక్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. ఆ చిన్న ప్రాణానికి తండ్రిపై ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తోంది. కొబ్బరి తోటల్లో తండ్రి పనికి సాయ పడటమే కాదు... ఆప్యాయంగా ఆహారం తినిపించడం, నీళ్ళు అందించడం ప్రతి మనసునూ కదిలింపజేస్తోంది. కూతురి సహకారంతో నెల్సన్ ప్రతిరోజూ సుమారు 60 కొబ్బరి చెట్లు ఎక్కగల్గుతున్నాడు. అందుకుగాను అతడికి అందే 6 డాలర్ల వేతనం.. ఇప్పుడా కుటుంబానికి తిండికి లోటు లేకుండా చేస్తోంది. ప్రతి గుండెనూ కదిలిస్తున్న ఆ వీడియోను ఫేస్ బుక్ లోని తన పేజీలో రూబీ కెప్యూన్స్ పబ్బిలాన్.. జూన్ 10వ తేదీన పోస్ట్ చేసింది. అప్పట్నుంచీ లక్షలమంది తిలకించడమే కాదు.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనంగా మారింది. మనసును కదిలించే వీడియోను తిలకించిన ఎంతోమంది వినియోగదారులు సహాయక సంస్థల ద్వారా వారికి తగిన సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీఎస్ సీబీఎన్ ఫౌండేషన్ ఆ తండ్రీ కూతుళ్ళను కలిసింది. రెటినల్ డిటాచ్ మెంట్, రెటినిటిస్ పిగ్మెంటోసా తో బాధపడుతున్న నెల్సన్ కు తగిన ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో నెల్సన్, జెన్నీలు మంచి వాతావరణంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
బీసీల ‘కల్యాణలక్ష్మి’ మార్గదర్శకాలు సిద్ధం
♦ సీఎం వద్దకు ఫైలు.. ♦ సంతకం కాగానే ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గా ల కల్యాణలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యా యి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆమోదముద్ర వేసిన ఫైలును ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ సీఎంకు పంపారు. సీఎం సంతకం చేయగానే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేస్తుంది. నిర్ణీత తేదీ (ఏప్రిల్ 1,2016) తర్వాత వివాహాలు చేసుకునేవారికే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద 2016-17 బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీని కింద బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన దాదాపు 60 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఆర్థికసాయం కోసం వచ్చే దరఖాస్తులను బట్టి అదనపు బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించే అవకాశముంది. పేదింటి వధువు బ్యాంక్ అకౌంట్లో రూ.51 వేలు నేరుగా జమ చేసేలా ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణలక్ష్మి, మైనారిటీల కోసం షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల మార్గదర్శకాలనే కొంచెం అటుఇటుగా అమలు చేయనున్నారు. ఈ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తులు అందిన తర్వాత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయా వివరాలు, సమాచారాన్ని పరిశీలించి డబ్బును మంజూరు చేస్తారు. అనంతరం పెళ్లి కుమార్తె బ్యాంక్ అకౌంట్లో రూ.51 వేలు జమ అవుతాయి. కావాల్సిన అర్హతలు ♦ తెలంగాణకు చెందిన బీసీ, ఈబీసీ అవివాహిత అమ్మాయిలై ఉండాలి. ♦ వధూవరులిద్దరికీ 18 ఏళ్ల వయస్సు నిండాలి ♦ కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. ళీ ఏప్రిల్ 1, 2016 తర్వాత పెళ్లిళ్లు చేసుకునేవారికే వర్తింపు ళీ మొదటిసారి వివాహం చేసుకున్నవారే అర్హులు. జత చేయాల్సిన పత్రాలు ♦ పుట్టిన తేదీ సర్టిఫికెట్, ళీ కుల,కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ♦ వధూవరుల ఆధార్‌కార్డులు ళీ పెళ్లికూతురు ఫొటోతో ఆమె పేరిట బ్యాంక్ ఖాతా వివరాలు ళీ గ్రామ పంచాయతీ/ఎమ్మార్వో/మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన పెళ్లి ధ్రువీకరణపత్రం ళీ ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి -
ఎట్టకేలకు పీఆర్సీ సమగ్ర జీవో
జీవో నం.25కు 470 పేజీలు జతచేస్తూ విడుదల విభాగాల వారీగా ఉద్యోగుల పేస్కేళ్ల వివరాలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ప్రధాన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సమగ్రంగా విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు.. ఉత్తర్వుల జారీలో మీనమేషాలు లెక్కించింది. పీఆర్సీపై సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5నే ప్రకటన చేసినా.. సంబంధిత జీవోలు జారీ చేయడంలో ఆర్థికశాఖ జాప్యం చేసింది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవ్వాల్సిన కొత్త వేతనాలు ఇప్పటికీ ఉద్యోగుల చేతికి అందలేదు. పీఆర్సీకి సంబంధించి మార్చి 18న ఆర్థిక శాఖ ప్రధాన ఉత్తర్వులు (జీవో నం.25) విడుదల చేసింది. 16 పేజీలతో సంక్షిప్త వివరాలను మాత్రమే అందులో పొందుపరిచింది. శాఖల వారీగా ఉద్యోగుల పేస్కేళ్లు లేకపోవటంతో ఉద్యోగులు తమ వేతనాలను స్థిరీకరించుకోలేకపోయారు. దీంతో గందరగోళం తలెత్తింది. ఆ జీవో అసంపూర్ణంగా ఉందంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈలోగా ప్రభుత్వం పీఆర్సీకి సంబంధించిన మార్గదర్శకాలు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ వివరాలతో జీవో విడుదల చేసింది. ఇదే క్రమంలో మార్చి 18న జారీ చేసిన ప్రధాన జీవో నం.25ను సవరించి, అదనంగా 470 పేజీలు జతచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 36 శాఖలు, రాజ్‌భవన్, ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉద్యోగుల పేస్కేళ్లను విడివిడిగా తాజా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ప్రధాన జీవోలో రెండో షెడ్యూలుగా వీటిని జతచేశారు. ఇప్పటికిప్పుడు లాభం లేనట్లే..? ప్రభుత్వం పూర్తిస్థాయి జీవోను విడుదల చేసినా ఇప్పటికిప్పుడు వేతన స్థిరీకరణ చేసుకునే వీలు లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ప్రతి నెలా 12లోగా ఉద్యోగులు ట్రెజరీలో బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు దినాలు కావటంతో 10నే అంటే ఒకరోజులోనే బిల్లులు సమర్పించాల్సి ఉం టుంది. ఇంత హడావుడిగా బిల్లులు సమర్పించడం అయ్యే పనికాదని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే తిరిగి 20వ తేదీ తర్వాత సప్లిమెంటరీ బిల్లులు సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో రెగ్యులర్ బిల్లులు కూడా పంపించా ల్సి ఉండడంతో గందరగోళం తలెత్తనుంది. మరోవైపు ఇప్పటికీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేళ్ల జీవో, ప్రత్యేక అలవెన్సులకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ విడుదల చేయలేదు. పీఆర్సీ జీవోలు, మార్గదర్శకాలు ఇప్పటివరకు ట్రెజ రీలకు చేరలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తయితే తప్ప వేతన స్థిరీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యేలా లేదంటున్నా రు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని, పీఆర్సీ జీవోతో పాటు అనుబంధ ఉత్తర్వులు, మార్గదర్శకాలన్నీ ఏకకాలంలో విడుదలయ్యేవని ఉద్యోగులు చెబుతున్నారు. -
బీసీ రెసిడెన్షియల్స్ ఎంట్రెన్స్ మార్గదర్శకాలు
సాక్షి,హైదరాబాద్: వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5-8 తరగతుల (మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ) మధ్య ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సోమవారం ఇందుకు సంబంధించి బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి డా.టి.రాధ రెండు సర్క్యులర్లను విడివిడిగా విడుదల చేశారు. 2015లో నిర్వహించే ప్రవేశపరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా విద్యార్థులను జూనియర్ కాలేజీల్లో ప్రవే శానికి ఎంపిక చేస్తారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పద వ తరగతి పరీక్ష రాసినవారే ప్రవేశపరీక్ష రాసేందుకు అర్హులు. సప్లిమెంటరీలో పరీక్ష పాసైన వారు, అంతకు ముందు సంవత్సరాలు పదవ తరగతి పాసైన వారు ప్రవేశపరీక్ష రాసేందుకు అనర్హులు. ఒకవేళ ఎంట్రెన్స్‌లో ఇద్దరు విద్యార్థులకు సమానమైన మార్కులు వస్తే మ్యాథ్స్ తదితర సబ్జెక్టుల్లో వచ్చే మార్కులను బట్టి ర్యాంకు నిర్ణయిస్తారు. ఇంటర్మీడియట్లో ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్లను బీసీ-ఏ 20 శాతం, బీసీ-బీ 28 శాతం, బీసీ-సీ3 శాతం, బీసీ-డీ 19 శాతం, బీసీ-ఈ 4 శాతం, ఎస్సీ 15 శాతం, ఎస్టీ6 శాతం, ఓఆర్పీహెచ్ 3 శాతం, ఓసీ/ఈబీసీలకు 2 శాతం రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాకపోతే బీసీ విద్యార్థులతో వాటిని భర్తీ చేస్తారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు 75 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. మిగిలిన 25 శాతం సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హాస్టళ్లు, జేడ్పీ స్కూళ్లు, ప్రైవేట్స్కూళ్లలోని వారికి కేటాయిస్తారు. -
వేతన సవరణ సశేషం!
మార్గదర్శకాలపై సాగదీస్తున్న సర్కారు వేతన స్థిరీకరణకు విధివిధానాలతో తాజాగా ఉత్తర్వులు మరిన్ని జీవోల కోసం ఉద్యోగుల ఎదురుచూపు బకాయిల చెల్లింపుపై ఇంకా నిర్ణయించని వైనం పెన్షనర్ల వేతన సవరణపైనా స్పష్టత కరువు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసింది. గత నెల 18న పదో పీఆర్సీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటి ప్రకారం పెరిగిన జీతాలను మార్చి నుంచే చెల్లించాల్సి ఉంది. అంటే ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ర్ట ప్రభుత్వోద్యోగులు కొత్త వేతనాలు అందుకోవాల్సి ఉంది. కానీ మార్గదర్శకాల జారీలో జాప్యం వల్ల ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎట్టకేలకు పీఆర్సీ మార్గదర్శకాలను సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. వేతన స్థిరీకరణకు సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్లు(డీడీవో) పాటించాల్సిన నిబంధనలను అందులో పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, బకాయిల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక నమూనాలను పొందుపరిచారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. వేతన స్థిరీకరణ కోసం డీడీవోలు మూడు భాగాలుగా ప్రొసీడింగ్స్ రూపొందించాలి. 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1వరకు వేతన స్థిరీకరణ బకాయిలను నోషనల్‌గా చూపాలి. ఆ తర్వాతి నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు బకాయిలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాకే వీటిని పంపించాలి. మార్చి నుంచి నగదు బిల్లులు తయారు చేయాలి. ఈ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు సెలవుపై, సస్పెన్షన్‌పై, శిక్షణకు, డిప్యుటేషన్‌పై, ఫారిన్ సర్వీస్‌లో వెళ్లిన వారు, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారు, విధుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వారి జాబితాలను కూడా పొందుపరచాలి. టీ ఇంక్రిమెంట్ యథాతథం గత ఏడాది ఆగస్టులో ఉద్యోగులకు ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్‌ను యథాతథంగా కొనసాగించాలని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 2015 పీఆర్సీ స్కేళ్లకు అనుగుణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ మొత్తాన్ని సవరించకూడదని డీడీవోలు, వెరిఫికేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2013 జూలై నుంచి పీఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ 2014 జూన్ నుంచి నగదు ప్రయోజనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ తర్వాత ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్.. కొత్త ఉత్తర్వుల ప్రకారం దాదాపు రెండింతలు అవుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. తాజా నిబంధనతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మూల వేతనంలోనే కలిపి ఇస్తారని ఉద్యోగులు భావించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ అసమగ్రమే కాగా, గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులతోపాటు, తాజా మార్గదర్శకాలు కూడా అసమగ్రంగా ఉండటం గందరగోళానికి దారి తీస్తోంది. ఇప్పటికీ పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయలేదు. శాఖల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే సమగ్ర స్కేళ్ల వివరాల జీవో కూడా జారీ కాలేదు. ప్రధానమైన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్స్ జీవో, ప్రత్యేక అలవెన్సులకు సంబంధించిన ఉత్తర్వులూ విడుదలకాలేదు. వీటితో పాటు బకాయిల జీవోతో ఇంక్రిమెంట్లు ముడిపడి ఉంటాయని... ఇవన్నీ విడుదలైతే తప్ప వేతన స్థిరీకరణ ప్రక్రియ ప్రారంభంకాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజా మార్గదర్శకాల్లోని తొమ్మిదో పేజీలో 12 (సి) కాలమ్‌లో ‘ఆంధ్రప్రదేశ్ రివె జ్డ్ స్కేల్స్ ఆఫ్ పే’ అని తప్పు దొర్లింది. దీన్ని ‘తెలంగాణ రాష్ట్ర రివైజ్డ్ స్కేల్స్ ఆఫ్ పే’ అని సవరించాల్సి ఉంది. బకాయిలపై మళ్లీ దాటవేత ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను చెల్లించే విధానంపై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిలకు సంబంధించి తదుపరి ప్రత్యేక ఉత్తర్వులు విడుదలవుతాయని మరోసారి దాటవేసింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం దాదాపు రూ. 5 వేల కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీటిని బాండ్ల రూపంలో ఇవ్వడమా లేక జీపీఎఫ్‌లో జమ చేయాలా లేదంటే విడతలవారీగా నగదు రూపంలో ఇవ్వాలా అనేది ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆర్థికంగా చిక్కుల్లేకుండా బాండ్లు జారీ చేయడమే శ్రేయస్కరమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నివేదించారు. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ బాండ్ల జారీని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో ఆర్థిక శాఖ తలపట్టుకుంది. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పరిధిలోకి రాకుండా జీపీఎఫ్‌లో జమ చేసే మార్గాలేమైనా ఉన్నాయా.. ప్రజా పద్దులను ఎక్కువ చూపించి రుణ పరిమితి ఆంక్షలు తప్పించుకునే అవకాశాలేమైనా ఉన్నాయా అని అధికారులు ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తున్నారు. -
అర్హులెందరున్నా.. ఒక్కరికే పింఛన్!
బీడీ కార్మికుల‘ఆసరా’కు మార్గదర్శకాలు సిద్ధం రాష్ట్రంలో 4 లక్షలమంది బీడీ కార్మికులున్నట్లు గుర్తింపు రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఒక కుటుం బంలో బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులకు కూడా వర్తింప చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే రూపొం దించిన సర్కారు రెండ్రోజుల్లో ఉత్తర్వులను కూడా జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4,74,438 మంది బీడీ కార్మికులున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వీరిలో 46,578మంది ఇప్పటికే ‘ఆసరా’ పింఛన్ పొందుతున్నారని, ఎటువంటి పింఛన్ పొందని వారు 4,27,860 మంది ఉన్నారని సమాచారం. మార్గదర్శకాలు ఇలా..! తాజా మార్గ్గదర్శకాల మేరకు ఒక కుటుంబంలో బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కరికే పింఛన్ అందించాలని నిర్ణయించారు. సదరు కార్మికుడు/కార్మికురాలికి ఇప్పటికే ఏదేని పింఛన్ (వృద్ధాప్య, వితంతు, వికలాంగ..తదితర) అందుతున్నట్లైతే అతను/ఆమెకు కొత్తగా మరో పింఛన్ ఇవ్వరు. అయితే.. బీడీ కార్మిక కుటుంబంలో కార్మికులు కానివారు ఆసరా పింఛన్ (వృద్ధాప్య, వితంతు, వికలాంగ..తదితర) పొందుతున్నప్పటికీ బీడీ కార్మికుడు/కార్మికురాలికి కొత్తగా పింఛన్‌ను మంజూరు చేస్తారు. 18ఏళ్లు నిండిన బీడీ కార్మికులు పింఛన్ పొందేందుకు అర్హులు. వారి కుటుంబ వార్షికాదాయం రూ.రెండు లక్షలకు మించకూడదు. కార్మికుడు / కార్మికురాలు బీడీల తయారీకి అవసరమైన ముడిసరకును లెసైన్స్డ్ కాంట్రాక్టరు వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న వారై ఉండాలి. -
అర్హులకే ‘ఫీజు’ అందేలా చర్యలు!
రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం అనర్హులను గుర్తించే విధానంపైనే కసరత్తు బయోమెట్రిక్, ఆధార్‌ను తప్పనిసరి చేయాలని యోచన 11వ తేదీన మరోసారి భేటీ.. తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పక్కదారి పట్టకుండా.. బోగస్ కాలేజీలు ప్రయోజనం పొందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అర్హులైన విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడాలని అభిప్రాయపడింది. అక్రమాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం తొలి సమావేశం బుధవారం సచివాలయంలో జరి గింది. ఈ భేటీకి విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకాగా.. కమిటీలోని మరో మంత్రి జగదీశ్‌రెడ్డి రాలేదు. 371డీ ప్రకారమే స్థానికత.. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం రద్దయిన నేపథ్యంలో... ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి పద్ధతులను అవలంబించాలనే దానిపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో చర్చించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విద్యార్థుల స్థానికతను గుర్తించేందుకు 371డీకి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని... అయితే 371డీలో ఏయే అంశాల ప్రాతిపదికన దీనిని నిర్ధారించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొన్ని కాలేజీల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయని, విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా చూపి ఫీజులను పొందాయని అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా వృత్తి విద్యా కాలేజీల్లో తక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థుల కోసమే 80 శాతం నిధులు ఖర్చవుతున్నాయని వారు వివరించారు. ఈ మార్గదర్శకాలను రూపొందించడంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నెల 11న మరోసారి భేటీ కావాలని.. అదే భేటీలో 371డీపైనా చర్చించాలని నిర్ణయించారు. ఇక కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల ఎంపికకు సంబంధించి ఆధార్ కార్డులను తప్పనిసరి చేయాలని సంబంధిత అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. అన్ని కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. కాగా.. ప్రభుత్వ రంగంలోని కాలేజీలను మరింత పటిష్టం చేయాలని.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సూచించినట్లు సమాచారం. అర్హులకు న్యాయం: కడియం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని, అర్హులైన పేద విద్యార్థులకు అన్యాయం జరగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రి వర్గ ఉప సం ఘం భేటీ అనంతరం పేర్కొన్నారు. పథకం మార్గదర్శకాలు, ఇతర అంశాలకు సంబంధిం చి ప్రాథమికచర్చలే జరిగాయని చెప్పారు. 11న మరోసారి భేటీ అవుతామని, అప్పటికల్లా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. 11న జరిగే భేటీలో చర్చించిన విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని కడియం పేర్కొన్నారు. -
కమలనాథన్ మార్గదర్శకాలు ఒప్పుకోం
టీఆర్టీసీ ఉద్యోగుల కమిటీ సొంతంగా మార్గదర్శకాలు నేడు ఆర్టీసీ ఎండీకి నివేదిక సమర్పణ ఆప్షన్లు ఉండొద్దని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల విభజనకోసం జారీ అయిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను యథాతథంగా ఆర్టీసీలో కూడా వర్తింపజేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు సొంతంగా మార్గదర్శకాలను రూపొందిం చాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారుల సంఘం, సూపర్వైజర్ల సంఘం, మజ్దూర్ యూనియన్‌తో కూడిన ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ నివేదికను మంగళవారం సంస్థ ఎండీకి అందజేయనున్నారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించనందున సంస్థ సొం తంగా మార్గదర్శకాలను రూపొందించాలని గతంలోనే రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఉమ్మడిగా ఆదేశాలను జారీ చేశారు. అయినా వాటిని పక్కనపెట్టి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల పేరు మార్చి యథాతథంగా అమలు చేయాలని సంస్థ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల హైలెవల్ కమిటీ పేరుతో సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల్లోంచి తాము విభేదించే అంశాలను తొలగించాలని, తమ నివేదికలోని అంశాలను అందులో చేర్చాలని ఉద్యోగుల కమిటీ గట్టిగా కోరుతోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుంటే ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమని హెచ్చరించింది. ఉద్యోగ సంఘాల కమిటీ నివేదికలో కొన్ని ప్రధానాంశాలు ఆర్టీసీ ఉద్యోగుల పంపిణీలో ‘ఆప్షన్లు’ వద్దు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను కేటాయించాలి. నాలుగు నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న ప్రాంతమే ప్రామాణికం ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారిని ఏపీకి కేటాయించాలి. ఏపీఎస్ ఆర్టీసీ పేరుతో వారు సంస్థలో చేరినందున వారు ఆ రాష్ట్రానికే చెందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో కేసును పరిశీలించి అవసరమైతే వారి కేటాయింపులో మార్పుచేర్పులు చేసుకోవాలి. రెండు ప్రాంతాల్లో వికలాంగులు ఉన్నందున ఎక్కడివారు అక్కడే పనిచేయాలి. వైకల్యం ఆధారంగా ఆప్షన్లు కోరుకోవటం సరికాదు. స్పౌజ్, తీవ్ర అనారోగ్య సమస్యలు, ఇతర ప్రత్యేక కారణాలు చూపి హైదరాబాద్‌లో పనిచేసేందుకు మొగ్గు చూపే ఏపీ వారికి నేరుగా అవకాశం ఇవ్వొద్దు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నం దున, హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పోస్టుల్లో వారిని కేటాయించాలి. -
బీజేపీకే పుట్టగతుల్లేవ్: కేసీఆర్
ఐటీ, టెక్స్టైల్ హబ్‌గా వరంగల్.. ‘డీఎస్సీ’ బాధితులకు ఉద్యోగాలు.. త్వరలోనే ఫాస్ట్ పథకం మార్గదర్శకాలు సాక్షి, హన్మకొండ: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ‘తెలంగాణలో టీఆర్ఎస్కు పునాదులు లేవన్నరు కదా? వాళ్లకసలు ఇక్కడ పుట్టగతులు లేవు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలుస్తుందో, బీజేపీ గెలుస్తుందో తెలియదా? ఎందుకనాలె.. ఎందుకు పడాలె’ అని మండిపడ్డారు. వివిధ కారణాల వల్ల 1998 నుంచి ఇప్పటివరకు వివిధ డీఎస్సీలలో ఎంపికై ఉద్యోగాలు రాని వారు దాదాపు 1200 మంది ఉన్నారని.. మానవతా దృక్పథంతో ప్రత్యేక సందర్భంగా పరిగణించి వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే వరంగల్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, పలు ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరునూ సీఎం వివరించారు. వరంగల్ అభివృద్ధికి ప్రణాళికలు రాష్ర్టంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ రంగాలకు మరో హబ్‌గా మార్చుతామని సీఎం తెలిపారు. ‘సూరత్, సోలాపూర్, తిర్పూర్‌లను కలగలిపే స్థాయిలో వరంగల్‌లో టెక్స్టైల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొన్ని ఐటీ కంపెనీలను వరంగల్‌లో నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. భవిష్యత్తులో వరంగల్ నగర జనాభా 20 లక్షలుకానుంది. అందుకు తగ్గట్టుగా నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. హైదరాబాద్ నగరం ఇష్టారీతిగా అభివృద్ధి చెందడంతో ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం’ అని ఆయన చెప్పారు. ఇక ఫాస్ట్ పథకానికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని, బకాయిలు కూడా చెల్లిస్తామని, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మోసాలతో ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును స్వాహా చేస్తున్న కాలేజీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో మరిన్ని రిజర్వాయర్లు అవసరమన్నారు. ‘కంతనపల్లి, దేవాదుల నీటిని నిల్వ చేసేందుకు జిల్లాలో మూడు నాలుగు చోట్ల రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరముంది. ఇందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించా. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. కృష్ణా ట్రిబ్యునల్‌లో వివాదం ముగియగానే జూరాల-పాకాల ప్రాజెక్టు పనులపై దృష్టి పెడతాం’ అని సీఎం వివరించారు. ముస్లింల కోసం రూ. 3 కోట్ల చొప్పున వ్యయంతో వరంగల్, హన్మకొండల్లో రెండు షాదీఖానాలు నిర్మిస్తామని కూడా వెల్లడించారు. కాగా, గుడుంబా వల్ల నగరంలో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో చాలా చోట్ల గుడుంబా సమస్య ఉంది. నేను గరీబ్‌నగర్‌కు పోతే అక్కడి మహిళలు మళ్లీ ప్రభుత్వ సారా తేవాలని అడిగారు. తెలంగాణ సమాజం ఈ సమస్యను అధిగమించాలి. దీనిపై చర్చ జరగాలే. తొందర్లోనే దీనిపై ఓ విధానం రూపొందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లోగా నిజామాబాద్, కరీంనగర్లోనూ పర్యటించనున్నట్లు చెప్పారు. పది రోజుల్లో మళ్లీ వరంగల్‌కు వస్తానని, ఆలోగా నగర సమగ్రాభివృద్ధికి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రణాళికలు రూపొందిస్తారని కేసీఆర్ తెలిపారు. ఫిలింసిటీని దున్నిస్తానని నేనెప్పుడన్న?: కేసీఆర్ రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని గతంలో చెప్పిన మీరు తర్వాత మాట తప్పారంటూ ఓ విలేకరి(‘సాక్షి’ కాదు) అడిగిన ప్రశ్నతో ఈ విషయం సదరు విలేకరికి, కేసీఆర్‌కు మధ్య చర్చకు దారి తీసింది. విలేకరి ప్రశ్న అడగ్గానే సీఎం ఘాటుగా స్పందించారు. ‘ఎవడు చెప్పిండయ్యా నీకివన్ని, నీకెవలు చెప్పిళ్లయ్యా. నాకర్థం కాదు.. చెప్పేది ఇనవయ్యా, నీకేదో కిరాకు ఉన్నట్టుంది, నేను అన్నానయా.. నేను చెప్పినట్లు స్టేట్మెంట్ చూపిస్తవా? ఇంత అబద్ధాలు ఎందుకు చెబుతన్నవ్? నేను ఏ బహిరంగ సభల చెప్పలేదు. మీరు కల్పించుకున్న స్టోరీలవి, ఏ పత్రిక నీది? నీ మాటనుబట్టి నీది ఏ పత్రికో నాకు అర్థమైతంది. (విలేకరి ఎదో మాట్లాడబోతుండగా కేసీఆర్ అడ్డుపడుతూ) చెప్పేది ఇనవయ్యా, నువ్వొక్కనివే ఉన్నావయ్యా ప్రపంచంల? మేం అననిదాన్ని అన్నట్లు రాసి.. మీ ఇష్టం వచ్చినట్లు డ్రామాలు కొట్టి. ఇదేం దందానండి? జర్నలిజంల స్టాండర్డ్స్ ఉండాలె. దేర్ ఈజ్ ఎ లిమిట్. కేసీఆర్ అన్నాడా ఎప్పుడైనా.. రామోజీ ఫిలింసిటీని దున్నుతానని? రామోజీ ఫిలింసిటీని కబ్జా పెట్టిన్రని నేనన్నానా? రాజశేఖరరెడ్డి దుర్మార్గంగా రామోజీ ఫిలింసిటీ మీద ముఖ్యమంత్రి హోదాలో దాడి చేస్తే.. ఇది తప్పు, అన్యాయమని వ్యతిరేకించిన. ఐయామ్ ఆన్ రికార్డ్. నువ్వు ఏం తెల్వకుండ అడ్డం పొడుగు ప్రశ్నలు అడిగితే ఎట్లనయ్య? వాట్ ఈజ్ దిస్. నేను అంటున్ననయ్య నిజంగనే అద్భుతం అది. డెఫినెట్‌గా.. విలేకరి: కబ్జా లేదా సార్? కేసీఆర్: ఒక గుంట కూడా లేదు. గుంట కూడా లేదు. (రెట్టింపు స్వరంతో)ఎందుకు నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నవ్? తెలుసుకోవాల... నీకేం తెలుసయ్యా? నువ్వెప్పుడైన రామోజీ ఫిలింసిటీ చూసినవా? వట్టిగనే స్టోరీలె చెప్తవా? ఎట్ల నాకర్థం కాదు. ఆయన(రామోజీ)కు గ వర్నమెంటు అక్వైర్ చేసి ఇయ్యలేదు తెల్సా. ఎవ్రీ ఇంచ్ హిహ్యాజ్ పర్చేజ్డ్. ఓ సమయంలో రాజశేఖరరెడ్డి అన్నడని పోతే ఆయన చూపించిండు నాకు. అసైన్డ్ ల్యాండ్ ఏమైనా ఉందా అని అడిగిన. అతను నాకు కాంపౌండ్ వాల్ చూపించి.. ‘అక్వైర్ చేసేటప్పుడు తెల్వకుండ పదమూడున్నర ఎకరాలు దళితుల అసైన్డ్ భూమిని కొన్నరు. అది తెలిసి వాళ్లది వాళ్లకు ఇచ్చిన. డబ్బులు కూడా వెనక్కి తీసుకోలేదని చెప్పిండు. ఇప్పుడక్కడ కాంపౌండ్ వాల్ వంకరగా ఉంటది. హి డిడ్ నాట్ ఎంక్రోచ్ ఎనీబడీ. ఫాక్ట్ తెల్వకుండా.. రామోజీరావు ఇయ్యాల దాదాపు నాలుగు వేల కోట్లతో ‘ఓం’ ఆధ్యాత్మిక సిటీని కడుతున్నరు. హైదరాబాద్‌కు ఓ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం కట్టబోతున్నరు. అది పూర్తయితే రోజుకు లక్ష మంది వస్తరని అంచనా. గొప్ప సంస్థను రాష్ట్రానికి యాడ్ చేస్తున్నప్పుడు వాళ్లు ఎవలైతే ఏంటండి? పెట్టుబడి పెట్టడానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తం. మలేసియాకు, సింగపూర్‌కు బోయి గడ్డాలు పట్టుకుంటున్నం. తెలంగాణ గవర్నమెంట్ ఈ పిచ్చికతలు పెట్టదల్చుకోలేదు. ఎవలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతమని చెప్పినం. వారిది మహరాష్ట్రనా, తమిళనాడా, ఆంధ్రప్రదేశా అనేదేమీ లేదు. -
ఆరోగ్యశ్రీ నిధుల ఖర్చుకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రివాల్వింగ్ ఫండ్ వినియోగానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు ఖరారు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 20 శాతం రివాల్వింగ్ ఫండ్‌ను ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వీటిని ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేయాలనేది ఈ మార్గదర్శకాల ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిగిలిన 80 శాతం సొమ్ములో 45 శాతాన్ని రోగికి మెరుగైన సేవలు అందించడానికి, 35 శాతం నిధులను డాక్టర్లు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తారు. రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేసేందుకు అవసరమైన అంశాలనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
తెల్లకార్డుంటేనే సీఎం రిలీఫ్‌ఫండ్
కఠిన నిబంధనలతో మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ షరతు ‘ఆరోగ్యశ్రీ’లో పేర్కొనని రోగాలకే సీఎంఆర్ఎఫ్ సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ కార్డు ఉండడంతోపాటు, ఆరోగ్యశ్రీలో పేర్కొనని రోగాలకే ఇక మీదట ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి సాయం అందుతుంది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పొందే సాయం చాలావరకు దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నవారు రూ.2 లక్షల వరకూ ఉచితంగా వైద్యం చేయించుకుంటున్నారు. ఈ రెండు లక్షల రూపాయలకు మించితే అదనపు సాయానికి ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా వచ్చిన మార్గదర్శకాల ప్రకారం అలాంటి సాయం ఇకపై అందదు. దీనికి సంబంధించి అత్యంత కఠిన నిబంధనలకు ప్రభుత్వం రూపొందించింది. సీఎంఆర్ఎఫ్ నుంచి అర్హులకే సాయం అందేలా ప్రభుత్వం వివిధ రకాలుగా విచారణ జరిపించింది. థర్డ్‌పార్టీ ద్వారా తటస్థ విచారణ నిర్వహించింది. వీటన్నింటి అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్‌పై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ఆ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్య చికిత్సకు ముందుగా అనుమతి తీసుకోవడం, చికిత్స అనంతరం బిల్లులు సమర్పించడం, ఆర్థిక సాయం కోరడం వంటివి వాటిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. మార్గదర్శకాలు ఇవీ... తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. లబ్ధిదారుడికి ఆధార్ కార్డు ఉండాలి. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు ఫారంతోపాటు తాజా ఫొటో, ఫోన్ నంబర్, రోగి సంతకం ఉండాలి. దాంతోపాటు దరఖాస్తులో అన్ని వివరాలు నింపాలి. మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, జిల్లా కలెక్టర్లలో ఎవరైనా ఒకరి సిఫారసు లెటర్ ఉండాలి. రోగి ఒరిజినల్ తుది బిల్లు వివరాలు సమగ్రంగా ఉండాలి. ముందస్తు, తుది నగదు చెల్లింపు ఒరిజినల్ రశీదు ఉండాలి. ఒరిజినల్ మందుల బిల్లులు ఉండాలి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఉండే ఒరిజినల్ కాపీ, చికిత్స వివరాలు, పొడిగింపు వివరాలు ఉండాలి. చికిత్సకు ముందు, తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు, రికార్డులు సమర్పించాలి. ఒరిజినల్ బిల్లులపై మెడికల్ సూపరింటెండెంట్, డెరైక్టర్, సంబంధిత డాక్టర్ స్టాంప్, సంతకం, రిజిస్ట్రేషన్లలో ఏదో ఒకటి సమర్పించాలి. గరిష్టంగా ఆరు నెలల కాలపరిమితి ఉన్న బిల్లులనే అనుమతిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల బిల్లులనే పరిగణలోకి తీసుకుంటారు. ఔట్‌పేషెంట్ బిల్లులను పరిగణించరు. చనిపోయిన రోగికి సంబంధించి పూర్తి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి. మెడికల్ సూపరింటెండెంట్ లేదా సంబం ధిత అధికారి సంతకంతో పత్రం ఇవ్వాలి. ఏదైనా పథకం కింద ఆర్థిక సాయం పొందినట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకోరు. -
ఆర్టీసీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ
కమలనాథన్ కమిటీ సిఫారసులే అమలు ఈ నెల 7 వరకు అభ్యంతరాల స్వీకరణ.. తర్వాత తుది జాబితా సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న ఆర్టీసీ విభజన దిశగా ఎట్టకేలకు ముందడుగు పడింది. తెలంగాణ, ఏపీలకు ఆర్టీసీ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలనే ఆర్టీసీ కూడా అనుసరించనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శుల సూచన మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల జాబితాకే పేరు మార్చి ఆర్టీసీ మార్గదర్శకాలుగా పేర్కొంటూ తాజాగా విడుదల చేసింది. తెలంగాణకు చెందిన జేఎండీ రమణారావు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈడీ(అడ్మిన్) వెంకటేశ్వరరావు సంతకాలతో ఇవి జారీ అయ్యాయి. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల 7వ తేదీలోగా తెలపాల్సిందిగా ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సంస్థ పాలకమండలి భేటీలో తుది జాబితాను ఆమోదించి ఇరు రాష్ట్రాలకు పంపనుంది. అక్కడి నుంచి షీలా భిడే కమిటీ ద్వారా కేంద్రానికి చేరుతుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ఉంటుంది. 6 నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తిస్తారు. భార్యాభర్తలు(స్పౌస్ కేసు), ఆరోగ్య సమస్యలు, ఏపీలో కలిపిన పోలవరం ముంపు ప్రాంతాల వారు ఆప్షన్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రంలో పోస్టుల కంటే సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు సిబ్బందిని మరో రాష్ట్రానికి బదిలీ చేస్తారు. ఏపీలో పోస్టుల సంఖ్యకన్నా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నందున అదనంగా ఉన్నవారు తెలంగాణకు రానున్నారు. దీంతో తాము నష్టపోతామంటూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే అభ్యంతరం చెబుతున్నారు. -
కబ్జాలపై ఉక్కుపాదం
భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలకు కేసీఆర్ ఆదేశం రాజకీయాలతో సంబంధం లేకుండా చర్య తీసుకోవాలన్న సీఎం ముందుగా టీఆర్ఎస్ వారిపైనే కేసులు పెట్టండి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించాలి.. ఇదివరకే నిర్మాణం చేసుకుంటే చివరి అవకాశంగా క్రమబద్ధీకరించండి గడువులోగా ముందుకురాకపోతే స్థలాలు స్వాధీనం చేసుకోవాలి వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాల పంపిణీకి నిర్ణయం శ్రీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికీ భయపడేది లేదు. ప్రభుత్వ భూములు ప్రజలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి. - కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా కబ్జాదారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన వారినైనా వదిలిపెట్టకూడదని చెప్పారు. కబ్జాలకు పాల్పడే వారిలో ముందుగా టీఆర్ఎస్కు చెందిన వారిపైనే కేసులు నమోదు చేసి ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భూము ల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగి ఉంటే ఆ స్థలాలను, భవనాలను క్రమబద్ధీకరించాలని, అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు వెంటనే మార్గదర్శకాలను రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించి, విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకు నిర్ణీత గడువు విధించాలని, ఇదే చివరి అవకాశంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకోని వారి నుంచి స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాపై గురువారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ముఖేష్‌కుమార్ మీనా, శ్రీధర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓపక్క ప్రభుత్వ అవసరాల కోసం స్థలాలు కరువైపోగా.. మరోపక్క వేలాది ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి పోతున్నాయంటూ విస్మయం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అధికారులకు నొక్కిచెప్పారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవని, కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన గతంలో ఏర్పాటైన కార్యదర్శుల స్థాయి కమిటీకే ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు చెప్పారు. సర్కారు భూముల పరిరక్షణ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు, లీజుదారులు, అసైన్డ్ భూముల వ్యవహరాల్లో అనుసరించాల్సిన విధి విధానాలను కమిటీ రూపొందించాలని సూచించారు. దీనిపై ఈ నెల 9న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. కార్యదర్శుల కమిటీ రూపొందించే చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. ఇక మురికివాడల్లో నివసించే పేదలకు గౌరవప్రదమైన నివాసాలు కట్టించాలని, ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరానికి వలస వచ్చి గుడిసెలు వేసుకున్న వారిపట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గుడిసెల్లో నివాసముంటున్న రెండు లక్షల మందికి నీడ కల్పిస్తామన్నారు. అభాగ్యుల కోసం 50 నైట్ షెల్టర్లు నిర్మించాలని, నాలాలకు అడ్డంగా ఉన్న నివాసాలను తొలగించి వారికి మరోచోట స్థలం కేటాయించాలని అధికారులకు సూచించారు. కొందరికి గిట్టదు.. అయినా భయపడను పేదలు వేసుకునే గుడిసెలను వెంటనే తొలగిస్తున్న అధికారులు.. అక్రమంగా వెలసిన భవనాలను మాత్రం పట్టించుకోవడం లేదని సీఎం అన్నారు. ప్రభుత్వం, అధికారులు పేదల పక్షపాతిగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేసుకుని ఉంటే వాటిని క్రమబద్ధీకరించాలని, అందుకోసం ముందుకు రాని వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజోపయోగం పేరిట భూములను తీసుకుని వ్యాపారం చేసుకుంటున్న వారిపైనా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల సంగతి కూడా తేల్చాలని ఉన్నతాధికారులకు నిర్దేశించారు. నకిలీ పత్రాలను సృష్టించి స్థలాలు కాజేస్తున్న వారి కేసుల విషయంలో అధికారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారి విషయంలో గత ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయని, కులం, ప్రాంతం, రాజకీయాల ఆధారంగా ప్రేమ చూపించాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. తప్పు చేసిన వారెవరైనా శిక్షపడాల్సిందేనని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికి భయపడేది లేదు. నాకు స్వప్రయోజనాలు లేవు. కచ్చితంగా ఉంటా. వెనక్కి తగ్గను. నన్నెవరూ ఒత్తిడికి గురిచేయలేరు. ప్రభుత్వ భూములు ప్రజోపయోగాలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. అదే నా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి’ అని అధికారులతో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
రైతుల సొమ్ము ప్రభుత్వ పరం!
రూ.102 కోట్లు సర్కారు ఖాతాలో జమ రుణమాఫీకి.. వేరుశెనగ వాతావరణ బీమా పరిహారానికి లంకె పరిహారాన్ని ఖజానాలో జమ చేస్తామన్న సర్కారు ప్రభుత్వ వింతపోకడపై కోర్టును ఆశ్రయించనున్న రైతు సంఘాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : పంట రుణాల మాఫీ ఎప్పుడు చేస్తామన్నది తేల్చని సర్కారు.. వేరుశెనగ రైతుకు మంజూరయ్యే పరిహారాన్ని మాత్రం ఖజానాలో జమ చేసుకోవడానికి ఉబలాటపడుతోంది. రుణమాఫీకి బీమా పరిహారానికి లంకె పెట్టిన సర్కారు వింతపోకడపై న్యాయపోరాటం చేసేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పంట, డ్వాక్రా రుణాల మాఫీకి గురువారం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన విషయం విదితమే. ఈ మార్గదర్శకాల్లో పంట రుణాలను ఎప్పటిలోగా మాఫీ చేసేది.. ఎప్పటి నుంచి కొత్త పంట రుణాలు పంపిణీ చేసేది ప్రభుత్వం తేల్చిచెప్పలేదు. కేవలం బకాయిదారుల జాబితాను సిద్ధం చేయడానికి మాత్రమే మార్గదర్శకాలు జారీచేశారని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. అయితే, ఆ మార్గదర్శకాల్లో రైతులకు దక్కాల్సిన బీమా పరిహారాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకోవాలని పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. గతేడాది ఖరీఫ్‌లో 1,36,400 హెక్టార్లలో వేరుశెనగ సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పంట రుణాలు తీసుకునే సమయంలోనే వేరుశెనగ రైతులు వాతావరణ బీమా ప్రీమియం కింద హెక్టారుకు రూ.550 చొప్పున రూ.7.5 కోట్లను బ్యాంకర్లకు చెల్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.7.5 కోట్లను వేరుశెనగ రైతుల ప్రీమియం కింద చెల్లించాయి. ఈ రూ.15 కోట్ల ప్రీమియంను జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు బ్యాంకర్లు చెల్లించారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 1.18 లక్షల హెక్టార్లలో మాత్రమే వేరుశెనగ సాగుచేశారు. వేరుశెనగ పంట రైతులకు దుర్భిక్షం తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రూ.వెయ్యి కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి జిల్లా అధికారయంత్రాగం అప్పట్లో నివేదిక పంపింది. పంట నష్టపోయిన వేరుశెనగ రైతులకు వాతావరణ బీమా పరిహారం కింద కనిష్టంగా రూ.102 కోట్ల మేర పరిహారం మంజూరవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. వేరుశెనగ రైతుకు బీమా పరిహారం సెప్టెంబర్‌లో మంజూరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌లోనూ వర్షాభావమే రాజ్యమేలుతోంది. కరవుతో తల్లడిల్లుతోన్న రైతుకు వాతావరణ బీమా పరిహారం కాసింత ఊరటనిస్తుందని రైతు సంఘాలు భావించాయి. కానీ.. గురువారం ప్రభుత్వం జారీచేసిన పంట రుణమాఫీ మార్గదర్శకాల్లో బీమా పరిహారాన్ని రైతులకు కాకుండా సర్కారు ఖజానాలో జమా చేసుకుంటామని పేర్కొనడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. సెప్టెంబర్‌లో మంజూరయ్యే రూ.102 కోట్ల బీమా పరిహారం ప్రభుత్వ ఖజానాలో చేరనుందన్న మాట. చట్టప్రకారం ఇది విరుద్ధం. ప్రీమియం చెల్లించి.. పంట నష్టపోయిన రైతుకే బీమా పరిహారం చేరాలన్నది వాతావరణ బీమా పథకంలో నిబంధన. ఇదే నిబంధన ఆధారంగా ప్రభుత్వ వింతపోకడపై న్యాయపోరాటం చేసేందుకు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. రుణమాఫీతో సంబంధం లేకుండా నష్టపోయిన రైతులకు బీమా పరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. -
బదిలీల టెన్షన్
మంత్రివర్గ నిర్ణయంతో నిషేధం ఎత్తివేత ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు ఆందోళనలో ఉద్యోగులు విజయవాడ : ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్ మొదలైంది. మూడు రోజుల కిందట జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నెల రోజుల పాటు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదికిక బదిలీలు ఉండవని భావిస్తున్న తరుణంలో పిడుగులాంటి ఈ నిర్ణయంతో అంతా కలవరపడుతున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై పిల్లల్ని పాఠశాలలు, కళాశాలల్లో చేర్చిన సమయంలో బదిలీలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. బదిలీలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. బదిలీలు రిక్వెస్ట్ చేసిన వారికి మాత్రమే చేస్తారా.. లేదా సీనియారిటీ ఆధారంగా అందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది. ఒకవేళ సీనియారిటీ ఆధారంగా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఏటా జూన్‌లో ఒకే ప్రాంతంలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్నవారిని కౌన్సెలింగ్‌కు పిలిచి బదిలీలు నిర్వహించేవారు. అలా ఒక కార్యాలయం, సంస్థలో పనిచేస్తున్న వారిని 20 శాతానికి మించకుండా బదిలీ చేసేవారు. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం కాకుండా రిక్వెస్ట్, మ్యూచువల్, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్పరంగా చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టులో బదిలీలా.. ఈ ఏడాదికి బదిలీలు ఉండవ నే ఉద్దేశంతో ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోని విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్చినట్లు చెబుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు కూడా చెల్లించారు. ఇప్పుడు అకస్మికంగా బదిలీలు చేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జోనల్ కేడర్ ఉద్యోగులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాంటివారికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమవారిని నియమించుకునేందుకేనా.. తమకు అనువైన ఉద్యోగులను నియమించుకునేందుకే ప్రభుత్వం బదిలీలపై నిపేధం ఎత్తివేసినట్లు ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. పలు కార్యాలయాల్లో కీలక పోస్టుల కోసం ఉద్యోగులు పాలకులు చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. తమవారిని సీటులో కూర్చోపెట్టేందుకు ఎవరిపై బదిలీవేటు వేస్తారోనని ఉద్యోగులు భయపడుతున్నారు. బదిలీల విషయంలో వివిధ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కీలక పోస్టుల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలతో తమ జేబులు కూడా నింపుకోవచ్చని మరికొందరు ఉత్సాహపడుతున్నారు. దీంతో బదిలీలు నిలుపుకొనేందుకు కొందరు, కోరుకున్న పోస్టుకోసం మరికొందరు బేరసారాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.