
సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం’ నిరుపేదలకు ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్తుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి నరేంద్రరెడ్డి పేర్కొన్నారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. తమకు ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతాం’ అని పేర్కొన్నారు.