- రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
- 2 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
సాక్షి, అమరావతి/హైదరాబాద్/విశాఖ: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె. లక్ష్మణ భాస్కర్‌కి ఏసీబీ పంచ్ పడింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా అతని బంధువుల, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో 14 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ. 2 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. విజయవాడ న్యూపోస్టల్ కాలనీలో అద్దెకు ఉంటున్న భాస్కర్ నివాసంలో జరిపిన సోదాల్లో రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. అందులో రూ. 3.20 కోట్లకు కొత్త రెండు వేల నోట్లే ఉన్నాయి. విజయవాడ ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో భాస్కర్‌కు చెందిన చాంబర్‌లో ఉన్న కంప్యూటర్‌లోని వివరాలు, పెన్‌డ్రైవ్, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన సహాయకుడు సిద్ధార్థకు చెందిన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ కొనసాగుతుందని ఏసీబీ ఆం్ర«ధా రీజియన్ జాయింట్ డైరెక్టర్(జేడీ) మోహన్‌రావు చెప్పారు.
విశాఖ, హైదరాబాద్‌ల్లో కూడా..: గతంలో భాస్కర్ విశాఖ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా, డిప్యూటీ కమిషనర్‌గా, కమిషనర్‌గా విధులు నిర్వహించా రు అక్కడ కూడా దాడులు నిర్వహించారు. అప్పట్లో ఆయ నకు అనుకూలంగా వ్యవహరించిన ఎస్‌ఐ వినయ్‌కుమా ర్, కానిస్టేబుల్ పల్లా బాబ్జీల ఇళ్లలో కూడా సోదాలు జరి పారు. విశాఖలో ఆయనకున్న ఆస్తుల విలువ రూ. కోటి ఉంటుందని అంచనా వేశారు. సికింద్రాబాద్‌లో నివసిసు ్తన్న లక్ష్మణభాస్కర్ దగ్గర బంధువు ఉస్మానియా వర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నర్సింగరావు ఇంటిలో అధికారు లు శనివారం ఉదయం సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. ల్యాప్‌ట్యాప్‌ల్లోని డేటాను విశ్లేషిస్తున్నారు.
ఆ ఇంటికి ప్రక్కనే ఉన్న శాంతశ్రీరాం అపార్ట్‌మెంట్ డైమండ్ బ్లాక్‌లోని 207 ఫ్లాట్ లక్ష్మణభాస్కర్‌కు చెందినదిగా అధికారులు భావిస్తున్నా రు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో విజయవాడ నుంచి ఇంటి తాళాలు తెప్పించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌లో లక్ష్మణభాస్కర్ బంధువులు, సన్నిహితులకు చెందినవిగా భావిస్తున్న మొత్తం నాలుగు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోట, మొగల్తూరులోనూ ఏసీబీ సోదాలు జరిగాయి.
ఎక్సైజ్ కమిషనర్‌పై ఏసీబీ పంజా
Published Sun, Dec 18 2016 1:53 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement