నరహరిపేట చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు | ACB Attacks On RTO Checkpost Chittoor Naraharipeta | Sakshi
Sakshi News home page

నరహరిపేట చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు

Published Wed, Nov 14 2018 11:29 AM | Last Updated on Wed, Nov 14 2018 11:29 AM

ACB Attacks On RTO Checkpost Chittoor Naraharipeta - Sakshi

సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

చిత్తూరు ,గుడిపాల: మండలంలోని నరహరిపేట ఆర్‌టీఓ చెక్‌పోస్ట్‌పై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తెల్లవారుజామున 1.30 నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో చూపని 41580 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు కొనసాగుతున్న సమయంలోనే  కొంతమంది లారీడ్రైవర్లు చెక్‌పోస్ట్‌కు వచ్చి మామూళ్లు ఇచ్చి వెళ్లడం గమనార్హం! ఇందులో మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ రవిశంకర్‌నాయక్‌ తన కారు డ్రైవర్‌ అంజి వద్ద చెక్‌పోస్ట్‌లో వసూలు చేసిన నగదును ఇచ్చి ఉండడంతో స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

మొత్తంగా  మామూళ్ల రూపంలో రూ.41580 రూపాయలు అందుకున్నట్టు గుర్తించారు, ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు వారు తెలిపారు. ఏసీబీ దాడుల్లో ఏఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ నంజుండప్ప, సీఐలు గిరిధర్, ప్రసాద్, ఎస్‌ఐ విష్ణు, సిబ్బంది పాల్గొన్నారు.చెక్‌పోస్ట్‌లో బయట వ్యక్తుల హవా: నరహరిపేట ఆర్‌టిఓ చెక్‌పోస్ట్‌లో బయట వ్యక్తుల హవా కొనసాగుతుంది. బయటి ప్రాంతాల నుంచి ప్రైవేట్‌ వ్యక్తులను పిలిపించుకొని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. నరహరిపేట చెక్‌పోస్ట్‌లో ముగ్గురు ఎంవీఐలు పనిచేసేవా రు. ప్రస్తుతం ఒకరికి ప్రమోషన్‌ రావడంతో ఇద్దరు మా త్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరి డ్యూటీలలో ఉన్నప్పుడు బయటినుంచి ప్రైవేట్‌ వ్యక్తులను పిలిపించుకొని మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రైవేట్‌ వ్యక్తులు చెప్పిందే హవా
ప్రైవేట్‌ వ్యక్తులు చెప్పిందే ఈ చెక్‌పోస్ట్‌లో వేదం. లారీలు, బస్సుల నుంచి వీరు ఎంతచెబితే అంత ఇవ్వాల్సిందే. వీరి  ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఏసీబీ అధికారుల దాడితో  వీరంతా అక్కడి నుంచి ఉడాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement