RTO Checkpost
-
నరహరిపేట చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు
చిత్తూరు ,గుడిపాల: మండలంలోని నరహరిపేట ఆర్టీఓ చెక్‌పోస్ట్‌పై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తెల్లవారుజామున 1.30 నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో చూపని 41580 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు కొనసాగుతున్న సమయంలోనే కొంతమంది లారీడ్రైవర్లు చెక్‌పోస్ట్‌కు వచ్చి మామూళ్లు ఇచ్చి వెళ్లడం గమనార్హం! ఇందులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్‌నాయక్ తన కారు డ్రైవర్ అంజి వద్ద చెక్‌పోస్ట్‌లో వసూలు చేసిన నగదును ఇచ్చి ఉండడంతో స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా మామూళ్ల రూపంలో రూ.41580 రూపాయలు అందుకున్నట్టు గుర్తించారు, ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు వారు తెలిపారు. ఏసీబీ దాడుల్లో ఏఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ నంజుండప్ప, సీఐలు గిరిధర్, ప్రసాద్, ఎస్ఐ విష్ణు, సిబ్బంది పాల్గొన్నారు.చెక్‌పోస్ట్‌లో బయట వ్యక్తుల హవా: నరహరిపేట ఆర్టిఓ చెక్‌పోస్ట్‌లో బయట వ్యక్తుల హవా కొనసాగుతుంది. బయటి ప్రాంతాల నుంచి ప్రైవేట్ వ్యక్తులను పిలిపించుకొని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. నరహరిపేట చెక్‌పోస్ట్‌లో ముగ్గురు ఎంవీఐలు పనిచేసేవా రు. ప్రస్తుతం ఒకరికి ప్రమోషన్ రావడంతో ఇద్దరు మా త్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరి డ్యూటీలలో ఉన్నప్పుడు బయటినుంచి ప్రైవేట్ వ్యక్తులను పిలిపించుకొని మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు చెప్పిందే హవా ప్రైవేట్ వ్యక్తులు చెప్పిందే ఈ చెక్‌పోస్ట్‌లో వేదం. లారీలు, బస్సుల నుంచి వీరు ఎంతచెబితే అంత ఇవ్వాల్సిందే. వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఏసీబీ అధికారుల దాడితో వీరంతా అక్కడి నుంచి ఉడాయించారు. -
ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం గామలపాడు వద్ద గల ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడి చేశారు. లెక్కల్లో చూపని 72 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్‌తో పాటు మరో నలుగురు రవాణా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు
పెనుకొండ(అనంతపురం జిల్లా): పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎలాంటి రశీదు లేకుండా ఎక్కువగా ఉన్న రూ.27,800 నగదును గుర్తించారు. ఈ విషయమై చెక్‌పోస్టు సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. -
పలు జిల్లాల చెక్ పోస్ట్ లపై ఏసీబీ దాడి
పలమనేరు: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల చెక్ పోస్ట్ లపై ఏసీబీ అధికారులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చెక్‌పోస్టుల్లో సోదాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నరహరిపేట కమర్షియల్‌టాక్స్ చెక్‌పోస్ట్‌లో రూ.41 వేలు పలమనేరు ఆర్టీఓ ఉమ్మడి చెక్‌పోస్ట్‌లో రూ.72వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్ట్‌లో అనధికారికంగా ఉన్న రూ.27వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా తడ చెక్పోస్టులోనూ సోదాలు నిర్వహించి భారీగా డబ్బు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఉమ్మడి తనిఖీ కేంద్రంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ఉన్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.