ఏసీబీ సోదాలు(ఫైల్ ఫోటో)
పలమనేరు: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల చెక్ పోస్ట్ లపై ఏసీబీ అధికారులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చెక్పోస్టుల్లో సోదాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నరహరిపేట కమర్షియల్‌టాక్స్ చెక్‌పోస్ట్‌లో రూ.41 వేలు పలమనేరు ఆర్టీఓ ఉమ్మడి చెక్‌పోస్ట్‌లో రూ.72వేలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్ట్‌లో అనధికారికంగా ఉన్న రూ.27వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా తడ చెక్పోస్టులోనూ సోదాలు నిర్వహించి భారీగా డబ్బు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఉమ్మడి తనిఖీ కేంద్రంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ఉన్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.