ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏవో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు.
మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏవో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపాలిటీలోని కోనేరు సెంటర్‌లో దసరా సందర్భంగా ఒక కాంట్రాక్టర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మున్సిపాలిటీ నుంచి రూ.28 వేలకు బిల్లు పెట్టుకున్నారు.
ఈ మొత్తం మంజూరు చేయాలంటూ ఆ కాంట్రాక్టర్ పది రోజులుగా ఏవో ఎర్రయ్య చుట్టూ తిరుగుతున్నారు. అయితే రూ.5 వేలు ఇస్తేనే బిల్లు చేస్తానంటూ ఎర్రయ్య మెలికపెట్టాడు. దీనిపై బాధితుడు ఏసీబీకి ఉప్పందించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఎర్రయ్యను పట్టుకున్నారు.