పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సబ్ ట్రెజరీ అధికారి ముద్రగడ వెంకట శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్నుంచి రూ.6,400 స్వాధీనం చేసుకున్నారు. 16 మంది టీచర్లకు రావాల్సిన బకాయిలను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరు రూ.400 లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు సమాచారం. దాంతో టీచర్లు ఏసీబీకి సమాచారం అందించగా, శనివారం దాడులు నిర్వహించి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.