సాక్షి, కర్నూలు: సీఐడీ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు జరిపింది. శనివారం తెల్లవారుజాము నుంచి కర్నూలు, కడప, అనంతపురం, బెంగళూరులోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు మొత్తం తొమ్మిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.
గతంలో నంద్యాల డీఎస్పీగా పనిచేసిన హరినాథ్‌రెడ్డి.. ప్రస్తుతం విజయవాడ సీఐడీ డీఎస్పీగా కొనసాగుతున్నారు. ఆయన పెద్దమొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సోదాల్లో ఇప్పటివరకు రూ. 7 లక్షల నగదు, డాక్యుమెంట్లు, కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం. అనంతపురం జిల్లా డబూరువారిపల్లిలో హరినాథ్‌రెడ్డి తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంట్లో కూడా సోదాలు చేపడుతున్నారు. సోదరుడు రాజేశ్వరరెడ్డి, బావమరిది జగన్‌మోహన్‌రెడ్డితో పాటు స్నేహితులు నాగ రాజారెడ్డి, ఈశ్వరయ్య ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కర్నూలులోని తుగ్గలి మండలం, పగిడిరాయిలోని డీఎస్పీ బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment