నిందితుడిపై ‘నిర్భయ’ కేసు
Published Thu, Aug 29 2013 2:28 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్‌క్రైమ్, న్యూస్‌లైన్:ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార య త్నానికి పాల్పడిన యువకుడిని బుధవా రం అరెస్టు చేసినట్లు నగర సీఐ సైదయ్య తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. స్థానిక ఎల్లమ్మగుట్ట కు చెందిన అంజద్‌ఖాన్ మంగళవారం సాయంత్రం అదేకాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పారి పోయిన యువకున్ని బుధవారం మధ్యాహ్నం పట్టుకున్నామని, నిర్భయచట్టం కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
తండ్రిపైనా కేసు..
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పా ల్పడిన అంజద్‌ఖాన్ తండ్రి అక్బర్‌పైనా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీటీసీలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా అక్బర్ విధులు నిర్వహిస్తున్నారు. తన కొడుకుపై కేసు పెడతావా.. అంటూ ఆయన పాప తండ్రిపై దాడి చేశాడని సీఐ చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు అక్బర్‌పై కేసు నమోదు చేశారు.
మహిళా సంఘాల ఆందోళన..
అభం శుభం ఎరుగని ఆరేళ్ల పాపపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ బుధవారం ఉదయం మహిళాసంఘం నాయకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పాప బంధువులు, టీఆర్‌ఎస్ నాయకులు పా ల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని ఎస్పీ కేవీ మోహన్‌రావు పిలిపించి మాట్లాడారు. పోలీసుల అండతోనే నిందితున్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని మహిళా సంఘాలు సభ్యులు తెలిపారు. అలాగే నిందితుడి తండ్రి హెడ్ కానిస్టేబుల్ అక్బర్ పాప తండ్రి దాడిచేశాడని ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదుకు ఎస్పీ ఆదేశించారు.
Advertisement