Courageous
-
ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!!
న్యూయార్క్: యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని వెలుగులోకి తెచ్చిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. జార్జ్ ఫ్లాయిడ్ పై పోలీసుల జాత్యహంకార హత్య ఘటనను చిత్రీకరించిన డార్నెల్లా ఫ్రాజియర్(17) బెనెన్సన్ కరేజియస్ సాహసోపేత అవార్డుకు ఎంపికయ్యారు. డార్నెల్లా సాహసానికి,తెగువకుగాను ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు అమెరికాలోన ప్రముఖ సాహిత్య, మానవ హక్కుల సంస్థ పెన్ బుధవారం వెల్లడించింది. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్) ధైర్యంతో, కేవలం ఒక ఫోన్ ద్వారా డార్నెల్లా అమెరికా చరిత్రనే మార్చేసిందని పెన్ అమెరికా సీఈఓ సుజాన్ నోసెల్ వెల్లడంచారు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా.. ఎంతో ధైర్యంగా ఆమె ఈ వీడియోను తీసి ఉండకపోతే.. జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి ప్రపంచానికి ఎప్పటికీ నిజం తెలిసి ఉండేది కాదన్నారు. తద్వారా జాతివివక్ష, హింసను అంతం చేయాలని కోరుతూ సాహసోపేతమైన ఉద్యమానికి నాంది పలికారని ప్రశంసించారు. డిసెంబర్ 8న వర్చువల్ గాలా సందర్భంగా ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది మే 25న మిన్నెపొలిస్‌లో తెల్ల పోలీసు అధికారుల చేతిలో ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దాదాపు పది నిమిషాల పాటు మోకాళ్లతో జార్జ్ ఫ్లాయిడ్ మెడను అదిమి పెట్టడంతో ఊపిరాడక అతడు మరణించాడు. అయితే, ఈ దుర్మార్గాన్ని డార్నెల్లా తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా శ్వేతజాతి దురహంకారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఐ కాంట్ బ్రీత్ అంటూ రోదించిన జార్జ్‌ఫ్లాయిడ్ చివరి మాటలే నినాదంగా అమెరికన్ యువత పోరు బాట పట్టింది. అలాగే 'బ్లాక్ లైవ్స్ మేటర్' అంటూ జాతి వివక్షపై ఉద్యమం రాజుకున్న సంగతి విదితిమే. -
‘ఇంగ్లండ్ డాటర్’
ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావించే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ కొన్ని తప్పుడు మాటల్ని చిత్రంగా రూపొందించగా ఈ దేశంలో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని ఉద్రేకపడుతున్నారు. డిసెంబర్ 16, 2012. నిర్భ య రేప్. ఆరుగురు రేప్ చేసి ఆమె మర్మావయవాలను గాయం చేసి దారుణంగా చంపారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం వారికి ఉరిశిక్ష విధించిం ది. ఒక నేరస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల తర్వాత ఒక ఇం గ్లండ్ డాటర్ లెస్లీ ఉడ్విన్ అనే చిత్ర నిర్మాత- ప్రపం చంలో మహిళలకు జరిగే అన్యాయా న్ని గురించి ‘ఇండియాస్ డాటర్’ అనే డాక్యు మెంటరీని తీయడానికి పూనుకుంది. ఆ మధ్య ఇంగ్లండ్‌లో చాలా రేప్‌లు జరిగాయి. కాని ఈ ఇంగ్లండ్ డాటర్‌కి నమూనాగా ఇండియా డాటర్ రేపే కావలసి వచ్చింది. ఇండియా వచ్చి-ఈ దేశపు చట్టాలు సవ్యంగా పని చేస్తే-ఈపాటికి ఉరికంబం ఎక్కవలసిన ముఖేష్‌సింగ్ అనే మానవ మృ గాన్ని కలిసింది. ఈయన ఇంటర్వ్యూకి రెండు లక్షలు అడిగాడు. 40 వేలకి ఒప్పందం కుదిరింది. ఈ పశువు చెప్పిన విషయాలు, అతని మాటల్లోనే: ‘‘కుర్రాడి కంటే రేప్‌కి అమ్మాయికే బాధ్యత ఎక్కువ. రాత్రి 9 గం టలకి మర్యాదైన ఆడపిల్ల రోడ్డు మీద తిరగదు. ఇంటి పని, వంటపని ఆడవాళ్ల పనులు. డిస్కో లకి తిరగడం, తప్పుడు బట్టలు వేసుకోవడం కాదు. నేను రేప్ చేస్తున్నపుడు ఆమె ఎదిరించకుండా ఉండాల్సింది. నిశ్శబ్దంగా రేప్ జరగనివ్వాలి. అప్పుడు వ్యవహారం ముగిశాక ఆమెని వదిలేసేవాళ్లం-కుర్రాడిని నాలుగు తన్ని.’’ ఈ కేసు వాదిస్తున్న ప్రబుద్ధుడు డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ గారి అభిప్రాయాలు, వారి మాటల్లోనే, ‘‘ నా కూతురో, చెల్లెలో పెళ్లికాకుండా ప్రేమలో పడి అవమా నకరంగా ప్రవర్తిస్తే - ఆవిడని నా ఫార్మ్‌హౌస్‌కి తీసుకెళ్లి నా బంధువులందరి ముందూ పెట్రోలు పోసి తగ లెడతాను.’’ నాకు ఈ డాక్యుమెంటరీని చూసే అవకాశం, అదృ ష్టం కలగలేదు. కాని దీన్ని చూసి తీరాలని చాలామంది మేధావులు ఈ దేశంలో గొంతు చించుకుంటున్నారు. సమాజంలోని తప్పుడు ఆలోచనా ధోరణిని (mindset) ఎండగట్టడానికి ఇలాంటి డాక్యుమెంటరీ రావలసిందే నని ప్రముఖ కవి, రచయిత జావెద్ అఖ్తర్ పార్లమెం టులో గొంతు చించుకున్నారు. ఆయన రచనల మీదా, కవితల మీదా నాకు అపారమైన గౌరవం. ఇక్కడ ఆగు తాను. కాని ముఖేష్‌సింగ్ మాట ఈ దేశపు ఆలోచనా ధోరణికి ప్రాతినిధ్యం వహించదు. ఒక దౌర్భాగ్యుడి moral perversion, decadenceకీ మాత్రమే నిదర్శనం. ఈ ఇంగ్లండ్ డాటర్ చేసిన నేరాలు. 1. మరణశిక్ష పడిన ఖైదీని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు. 2. నిర్భయ పేరుని ప్రకటించింది. 3. ఆమె ఫొటోను ప్రకటించింది(ట). 4. పూర్తయిన డాక్యుమెంటరీని అధికారులకు చూపి వారి సమ్మతిని తీసుకోలేదు. 5. బీబీసీ దీనిని మహిళా దినోత్సవానికి ప్రసారం చేయాలని తలపెట్టి, దేశంలో అలజడి లేవగానే లోపాయికారీగా ముందుగానే ప్రసారం చేసేసింది. ఈ డాక్యుమెంటరీని ఫలానా ఉడ్విన్ డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, కెనడాలలో ప్రసారం చేయ సంక ల్పించిందట. ఇండియాలో 24X7 చానల్ మార్చి 8న ప్రసారానికి అంగీకరించింది. ఆరు దేశాలలో ‘ఇండియాస్ డాటర్’ ప్రసారం భారతదేశానికి ఏ విధంగా ఉపయోగం? ఉడ్విన్‌కి డబ్బు కలసివస్తుంది. మనకి గబ్బు కలసివస్తుంది. బ్రిటిష్ వారికి మన పట్ల ప్రేమని అలనాడు చర్చిల్ నాటి నుంచీ వింటున్నాం. మన దేశంలో- నాకు తెలుగు బాగా రాదు క్షమిం చాలి-ఇంటెలెక్చువల్ హిపోక్రసీ ఎక్కువ. హృదయ వైశాల్యం గల భారతీయ మేధావులు-ఇండియా రేప్ కథని - ఇందుమూలంగా అంతర్జాతీయంగా లేచిన దుమారాన్నీ సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడ్డ ఓ ఇం గ్లండ్ డాటర్ కళాఖండాన్ని-చట్టాలనీ మాన వీయ విలువలనీ ఆంక్షలనీ విస్మరించి- ఆరు దేశాలలో ప్రసా రం చేయడం ద్వారా ఈ దేశ ప్రజల ఆలోచనా ధోరణి మార్పుకు సహకరిస్తుందని భావిస్తున్నారు. ఓ నీచుడి తప్పుడు మాటల్ని ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావిం చే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ చిత్రంగా రూపొందించగా ఈ దేశం లో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని పత్రి కల్లో పార్లమెంటుల్లో ఉద్రేకపడుతున్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ భారతీయుడైనా-పశు ప్ర వృత్తికి ఓ ఆడపిల్ల జీవితాన్ని బలిచేసి, డబ్బు కోసం దిక్కుమాలిన, దుర్మార్గపు అభిప్రాయాలను చెప్పగా, దా న్ని సొమ్ము చేసుకుని-సమాజ హితమని దొంగ పేరు పెట్టిన ఘనమైన నిర్మాతకి సవినయంగా, స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఒకే ఒక్కమాట చెప్పాలని నరాలు పొంగు తున్నాయి: ‘‘షటప్!’’ (ఈ కాలమ్ రాశాక అమెరికా మిత్రుడు డాక్యు మెంటరీని పంపారు. దాన్ని చూశాక కూడా ఒక్క అక్షరం మార్చాలని అనిపించలేదు.) -
మగువకు రక్షణ కరువు..
నేషనల్ డెస్క్: నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు చేసినా 2014లోనూ మగువలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడలేదు. మహిళలు, విద్యార్థినులు మృగాళ్ల చెరలో చిక్కి విలవిల్లాడారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో సైతం మహిళలకు రక్షణ కరువైంది. జనవరిలో ఢిల్లీలో డెన్మార్క్ పర్యాటకురాలి(51)పై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హోట ల్కు దారి అడిగిన బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాక దారుణంగా కొట్టి నగదు అపహరించారు. ఇదే నెలలో పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఓ గిరిజన మహిళ(20)పై 12 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందని బాధితురాలికి గ్రామస్తులు రూ.50 వేలు జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఆమెపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. మే నెలలో యూపీలోని బుర్ద్వాన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు(14, 16 ఏళ్లు) చెట్టుకు ఉరివేసుకోవడం సంచలనం సృష్టించింది. వారిపై అత్యాచారానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించారని ఆరోపణలొచ్చాయి. డిసెంబర్లో ఢిల్లీలో ఉబర్ కంపెనీ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటం దేశాన్ని నివ్వెరపరిచింది. బెంగళూరు కూడా అత్యాచారాలకు నిలయంగా మారింది. పాఠశాలల్లో చిన్నారులపై వరుస అత్యాచారాలు నగరానికి మచ్చ తెచ్చాయి. -
నగర రోడ్లపై షీ-క్యాబ్స్
డ్రైవర్లూ మహిళలే... ఏపీ బాలల హక్కుల సంఘం శ్రీకారం సాక్షి,సిటీబ్యూరో: అభయ, నిర్భయలాంటి ఘటనలకు తావు లేకుండా మహిళల కోసం ప్రత్యేక క్యాబ్‌లు నగర రోడ్లపైకి రానున్నాయి. మహిళా ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే యువతులకు సు రక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ‘షీ క్యాబ్స్’ అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీ బాలల హక్కుల సంఘం ఇందుకు శ్రీకా రం చుట్టింది. బుధవారం నుంచి ఇవి రోడ్లెక్కుతాయి. పబ్లిక్‌గార్డెన్స్‌లో మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ వీటిని ప్రారంభిస్తారు. ఎలాం టి లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యతతో ఇందుకు రూపకల్పన చేసినట్టు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు. కేవలం నిర్వహణ ఖర్చులతోనే మహిళలకు సేవలందిస్తున్నామన్నారు. డ్రైవర్లుగా చే రాలనుకునే మహిళలు 98663 42424 నెంబర్లో గానీ, ప్లాట్‌నెంబర్ 205, కుబేరా టవర్స్ నారాయణగూడ చౌరస్తా, హిమాయత్నగర్రోడ్డు అడ్రస్‌లో గానీ సంప్రదించాలని కోరారు. ప్రస్తుతానికి... షీక్యాబ్ ఎండీ విజయారెడ్డి, సీఈఓ అనూరాధ పెలైట్లుగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని... ఈ తరహా క్యాబ్‌లు కేరళలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఐదు క్యాబ్‌లతో ప్రారంభించిన ఆ సంస్థ ఇప్పుడు వాటి సంఖ్యను 30కి పెంచింది. మేం ప్రారంభించిన ఈ పెలైట్ ప్రాజెక్టు విజయవంతమైతే మరిన్ని క్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. మహిళా ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే యువతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. ఇవీ ప్రత్యేకతలు... షీ-క్యాబ్‌లు నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద ఉంటాయి 24 గంటలూ అందుబాటులో ఉంటాయి ప్రత్యేక డ్రెస్ కోడ్, ఐడీ కార్డులతో కరాటే వచ్చిన మహిళలు పెలైట్ (డ్రైవర్)గా ఉంటారు. క్యాబ్ కావల్సినవారు 9393024242 నెంబర్లో సంప్రదించాలి. ప్రయాణికులు ఎక్కి, దిగిన విషయాలను ఎప్పటికప్పుడు క్యాబ్ నిర్వాహకులు స్థానిక ఠాణాకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు. -
నిందితుడిపై ‘నిర్భయ’ కేసు
నిజామాబాద్క్రైమ్, న్యూస్‌లైన్:ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార య త్నానికి పాల్పడిన యువకుడిని బుధవా రం అరెస్టు చేసినట్లు నగర సీఐ సైదయ్య తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. స్థానిక ఎల్లమ్మగుట్ట కు చెందిన అంజద్‌ఖాన్ మంగళవారం సాయంత్రం అదేకాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పారి పోయిన యువకున్ని బుధవారం మధ్యాహ్నం పట్టుకున్నామని, నిర్భయచట్టం కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. తండ్రిపైనా కేసు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పా ల్పడిన అంజద్‌ఖాన్ తండ్రి అక్బర్‌పైనా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీటీసీలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా అక్బర్ విధులు నిర్వహిస్తున్నారు. తన కొడుకుపై కేసు పెడతావా.. అంటూ ఆయన పాప తండ్రిపై దాడి చేశాడని సీఐ చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు అక్బర్‌పై కేసు నమోదు చేశారు. మహిళా సంఘాల ఆందోళన.. అభం శుభం ఎరుగని ఆరేళ్ల పాపపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ బుధవారం ఉదయం మహిళాసంఘం నాయకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పాప బంధువులు, టీఆర్ఎస్ నాయకులు పా ల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని ఎస్పీ కేవీ మోహన్‌రావు పిలిపించి మాట్లాడారు. పోలీసుల అండతోనే నిందితున్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని మహిళా సంఘాలు సభ్యులు తెలిపారు. అలాగే నిందితుడి తండ్రి హెడ్ కానిస్టేబుల్ అక్బర్ పాప తండ్రి దాడిచేశాడని ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదుకు ఎస్పీ ఆదేశించారు.