నగర రోడ్లపై షీ-క్యాబ్స్
- డ్రైవర్లూ మహిళలే...
- ఏపీ బాలల హక్కుల సంఘం శ్రీకారం
సాక్షి,సిటీబ్యూరో: అభయ, నిర్భయలాంటి ఘటనలకు తావు లేకుండా మహిళల కోసం ప్రత్యేక క్యాబ్‌లు నగర రోడ్లపైకి రానున్నాయి. మహిళా ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే యువతులకు సు రక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ‘షీ క్యాబ్స్’ అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీ బాలల హక్కుల సంఘం ఇందుకు శ్రీకా రం చుట్టింది. బుధవారం నుంచి ఇవి రోడ్లెక్కుతాయి. పబ్లిక్‌గార్డెన్స్‌లో మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ వీటిని ప్రారంభిస్తారు.
ఎలాం టి లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యతతో ఇందుకు రూపకల్పన చేసినట్టు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు. కేవలం నిర్వహణ ఖర్చులతోనే మహిళలకు సేవలందిస్తున్నామన్నారు. డ్రైవర్లుగా చే రాలనుకునే మహిళలు 98663 42424 నెంబర్లో గానీ, ప్లాట్‌నెంబర్ 205, కుబేరా టవర్స్ నారాయణగూడ చౌరస్తా, హిమాయత్‌నగర్‌రోడ్డు అడ్రస్‌లో గానీ సంప్రదించాలని కోరారు. ప్రస్తుతానికి... షీక్యాబ్ ఎండీ విజయారెడ్డి, సీఈఓ అనూరాధ పెలైట్‌లుగా వ్యవహరిస్తున్నారు.
భవిష్యత్తులో మరిన్ని...
ఈ తరహా క్యాబ్‌లు కేరళలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఐదు క్యాబ్‌లతో ప్రారంభించిన ఆ సంస్థ ఇప్పుడు వాటి సంఖ్యను 30కి పెంచింది. మేం ప్రారంభించిన ఈ పెలైట్ ప్రాజెక్టు విజయవంతమైతే మరిన్ని క్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. మహిళా ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే యువతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి.
ఇవీ ప్రత్యేకతలు...
షీ-క్యాబ్‌లు నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద ఉంటాయి
24 గంటలూ అందుబాటులో ఉంటాయి
ప్రత్యేక డ్రెస్ కోడ్, ఐడీ కార్డులతో కరాటే వచ్చిన మహిళలు పెలైట్ (డ్రైవర్)గా ఉంటారు.
క్యాబ్ కావల్సినవారు 9393024242 నెంబర్‌లో సంప్రదించాలి.
ప్రయాణికులు ఎక్కి, దిగిన విషయాలను ఎప్పటికప్పుడు క్యాబ్ నిర్వాహకులు స్థానిక ఠాణాకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు.