హైదరాబాద్: చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్లో ఓ నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. పలు ఛీటింగ్ కేసులులలో నిందితుడైన సత్యనారాయణ(55)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని రక్షక్ వాహనంలో పోలీస్ స్టేషన్కు తీసుకువస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే బంధువులు మాత్రం పోలీసుల చిత్రహింసల వల్లే అతను చనిపోయినట్లు చెబుతున్నారు. తమను బెదిరించి కేసును తప్పు దారిపట్టిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. సత్యనారాయణను నిన్ననే పోలీసులు తీసుకువెళ్లారని వారు చెప్పారు.
చాదర్‌ఘాట్ పోలీసుల చిత్రహింసలతో నిందితుడు మృతి?
Published Tue, Dec 3 2013 3:01 PM | Last Updated on Thu, Oct 4 2018 8:31 PM
Advertisement
Advertisement