
పవన్ పార్టీ పెడితే ఆలోచిస్తా: ఆలీ
గుంటూరు: సినీ హీరో పవన్‌కళ్యాణ్ పార్టీపెడితే రాజకీయ ప్రవేశం, పోటీ చేసే అంశాల గురించి ఆలోచిస్తానని సినీ నటుడు ఆలీ చెప్పారు. గుంటూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ పవన్ పార్టీ పెట్టకుండా రాజకీయాల గురించి మాట్లాడనన్నారు.
రాజమండ్రి నుంచి పవన్ పార్టీ తరపున పోటీచేయనున్నారని ప్రచారం జరుగుతున్నట్లు విలేకరుల అడుగ్గా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గానీ ఆలీ పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.