కర్నూలు రాజధాని: న్యాయవాదుల సంబరాలు | Advocates And Kurnool People Praises CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

కర్నూలు రాజధాని: న్యాయవాదుల సంబరాలు

Published Mon, Jan 20 2020 3:16 PM | Last Updated on Mon, Jan 20 2020 6:02 PM

Advocates And Kurnool People Praises CM YS Jagan Mohan Reddy  - Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలు జూడిషియల్‌ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అమోదం తెలపడంతో కర్నూలు వాసుల, న్యాయవాదులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కోర్టులో మిఠాయిలు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు కెబినెట్‌ అమోదం‍ తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆత్మకూరు: పట్టణంలోని గౌడ్‌ సెంటర్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులకు తెలిపిన కెబినెట్‌ అమోదానికి మద్ధతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బణాసంచాలు పేల్చి హర్షం వ్యక్తం చేశారు.  

పశ్చిమ గోదావరి: మూడు రాజధానుల బిల్లుపై ఆమోదముద్ర వేసిన సందర్బంగా జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేరి కామేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొర్లపాటి కోటబాబులు కూడా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement