11 మందితో ఆగమ సలహా మండలి ఏర్పాటు | Agama 11 -member Council | Sakshi

11 మందితో ఆగమ సలహా మండలి ఏర్పాటు

Dec 8 2015 4:48 PM | Updated on Sep 3 2017 1:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ యజుర్వేదం చిర్రవూరి శ్రీరామ శర్మ ఆగమ సలహా మండలికి చైర్మన్‌గా నియమించారు.

ఆయనతో పాటు విశ్వనాధ గోపాలకృష్ణ (రాజమండ్రి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్), నల్లూరి రామచంద్ర భట్టాచార్య (మంగళగిరి లక్ష్మీ నర్సింహస్వామి ఉప ప్రధాన అర్చకులు), మోర్త సీతారామాచార్యులు (సింహాచలం వరహలక్ష్మి దేవాలయం రిటైర్డ్ అర్చకులు), ఎస్‌ఎంకె సదాశివ (కాళహస్తీశ్వర స్వామి ఆలయ రిటైర్డ్ అర్చకులు), రేవణ్ణ సిద్ధాంతి (కర్నూలు), జగన్నాధ శాస్త్రి (పశ్చిమ గోదావరి, వైదిక శాస్త్ర పరిషత్), చిలకపాటి తిరుమలాచారి (రిటైర్డ్ లెక్చరర్, తిరుపతి), రాజా ఎస్ గిరి ఆచార్య (మంత్రాలయం, కర్నూలు), రాఘవయ్య (అల్లూరు పోలేరమ్మ ఆలయ ఆర్చకులు), ఎల్.సుబ్రహ్మణ్య సిద్ధాంతి (కంచి కామకోటి పీఠం) లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ సలహా మండలి ఐదేళ్లపాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement