ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం | Agency temperatures down | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

Published Sat, Oct 25 2014 1:11 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం - Sakshi

ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

  •  దట్టంగా పొగమంచు
  •  రాత్రి వేళల్లో చలిగాలులు
  • పాడేరు : ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మినుములూరు కాఫీబోర్డు వద్ద కొన్ని రోజులుగా 20 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 20వ తేదీన 16 డిగ్రీలు, 21న 16, 22న 16, 23న 15, 24న 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచు తీవ్రత కూడా అధికంగా ఉంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకు వాహనచోదకులు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వస్తోంది.

    సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, పాడేరు, లంబసింగి, చింతపల్లి, సప్పర్ల, దారకొండ ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఉంది. నవంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితి ఉందని కాఫీబోర్డు అధికారులు పేర్కొంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement