హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసులపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతోందని బాధితులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆస్తులు అమ్మినా బాధితులకు న్యాయం జరగలేదని తెలిపారు. అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థలు, డైరెక్టర్ల వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.
ఆ సంస్థకు చెందిన 14 చోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి ...ఆ మొత్తాన్ని బాధితులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ న్యాయం జరగకపోతే ...మిగతా ఆస్తులను అమ్మి...బాధితులకు చెల్లించాలని సూచించింది. కోర్టు ఆధీనంలోనే బాధితులకు డబ్బులు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.