ఏం.. తమాషా చేస్తున్నారా | Agriculture Department Officer Fired on Women Officers | Sakshi
Sakshi News home page

ఏం.. తమాషా చేస్తున్నారా

Published Tue, Feb 26 2019 10:06 AM | Last Updated on Tue, Feb 26 2019 10:06 AM

Agriculture Department Officer Fired on Women Officers - Sakshi

వ్యవసాయ శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జె.డి చంద్రనాయిక్‌

విజయనగరం  ,కొమరాడ: ఉద్యోగం చేస్తారా..? మానేస్తారా..? అంటూ వ్యవసాయాధికారులపై ఆ శాఖ జేడీ  చంద్రనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో లేకపోతే ఇంటికెళ్లిపోవాలని ఘాటుగా హెచ్చరించారు.

ఎట్టి పరిస్థతుల్లోనూ  రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఎన్నికల విధులు మీకే కాదు.. మాకూ ఉన్నాయి... ఆ విధులతో పాటు శాఖపరమైన పనులు కూడా చేయాలని ఆదేశించారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్‌ స మ్మాన్‌ నిధిపై రైతులకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి విజయభారతి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement