chandra naik
-
కూలికి రాలేదని ట్రాక్టర్‌తో తొక్కించాడు
-
కూలీకి రానందుకు ట్రాక్టర్‌తో తొక్కించాడు
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కృష్ణాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కూలీకి రానందుకు ట్రాక్టర్ యజమాని డ్రైవర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అడ్డుకోబోయిన డ్రైవర్ బంధువును కూడా ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ ఘటనలో డ్రైవర్ హరి ప్రసాద్‌తో పాటు ఆయనకు మద్ధతుగా వచ్చిన నాగభూషణం కూడా మరణించారు. ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ ఘటన జరిగిన వెంటనే పరారయ్యారు. అనారోగ్యంతో హరిప్రసాద్, ఆయన సోదరుడు నాగభూషణం కూలీకి వెళ్లనట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటన అనంతరం చంద్రా నాయక్ ఇంటిపై బాధితుల కుటుంబసభ్యులు దాడికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఇలాంటి గొడవలు ఊరిలో మంచిది కాదని వారించడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి శవాలను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏం.. తమాషా చేస్తున్నారా
విజయనగరం ,కొమరాడ: ఉద్యోగం చేస్తారా..? మానేస్తారా..? అంటూ వ్యవసాయాధికారులపై ఆ శాఖ జేడీ చంద్రనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో లేకపోతే ఇంటికెళ్లిపోవాలని ఘాటుగా హెచ్చరించారు. ఎట్టి పరిస్థతుల్లోనూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఎన్నికల విధులు మీకే కాదు.. మాకూ ఉన్నాయి... ఆ విధులతో పాటు శాఖపరమైన పనులు కూడా చేయాలని ఆదేశించారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ స మ్మాన్ నిధిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి విజయభారతి, తదితరులు పాల్గొన్నారు. -
తాత్కాలిక జేడీఏగా చంద్రానాయక్
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి వెన్నునొప్పి, రక్తపోటుతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో భూసార సంరక్షణ విభాగం డీడీఏ చంద్రానాయక్‌కు తాత్కాలిక జేడీఏ బాధ్యతలు అప్పగించారు. శనివారం కూడా శ్రీరామమూర్తికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఆయన మరో రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండే అవకాశముంది. శనివారం కొన్ని ఫైళ్లపై ఆస్పత్రిలోనే సంతకాలు చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో అప్పటివరకు తాత్కాలిక బాధ్యతలు చంద్రానాయక్‌కు అప్పగించారు. కాగా.. జేడీఏ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆ శాఖ అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పరామర్శకు వచ్చారు. ఇతర శాఖల అధికారులు ఫోన్లో పరామర్శించారు.