ప్రత్తిపాటి భూదందాపై టీడీపీ పరార్
ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌ను స్వీకరించని అధికార పక్షం
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంపై శుక్రవారం శాసనసభలో చర్చించే ధైర్యం లేక అధికార పక్షం తోక ముడిచింది. అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు సభలో ఆధారాలతో సహా నిరూపిస్తానని, తనకు 20 నిమి షాల సమయం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కోరారు. అయితే సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తన వద్దను న్న ఆధారాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెడతానని జగన్ అన్నారు.టీడీపీ వైఖరిని నిరసిస్తూ ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
జగన్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తారా? లేదా?
శాసనసభలో శుక్రవారం సవాళ్ల పర్వం కొనసాగింది. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా పడిన శాసనసభ.. మధ్యాహ్నం 12.08 గంటలకు తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై 344 నిబంధన కింద స్పీకర్ చర్చను చేపట్టారు. ఈ అంశంపై చర్చను ప్రారంభించాలని టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని కోరారు. ఇదే సమ యంలో మంత్రి ప్రత్తిపాటి పాయింట్ ఆఫ్ ఆర్డ ర్ లేవనెత్తుతూ.. తాను విసిరిన సవాల్‌ను జగన్ స్వీకరి స్తున్నారో లేదో చెప్పిన తర్వాతే చర్చను చేపట్టాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు.
సవాళ్లు, ప్రతిసవాళ్లకు తావు లేదని, ఒకవేళ ఉంటే రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఓటుకు కోట్లు కేసు లోని ఆడియో టేపుల్లో మాట్లాడిన మాటలు సీఎం చంద్రబాబువేనా? కాదా? తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఎన్నికలు నిర్వహించాలి, వాటిని రెఫరెండంగా స్వీకరిస్తారా? అంటూ జగన్ విసిరిన సవాల్‌ను బాబు స్వీకరిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని పట్టుబట్టారు. రూ.43 వేల కోట్లు ఆస్తులున్నాయంటూ తనపై టీడీపీ చేసిన ఆరోపణలపై జగన్ స్పందిస్తూ... అందులో 10 శాతం ఇస్తే ఆ ఆస్తులన్నీ రాసిస్తానంటూ తాను విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదో చెప్పాలన్నారు.
ఇక్కడ సమయం ఇవ్వలేం..
మధ్యాహ్నం 2.32కు సభ మళ్లీ ప్రారంభమైంది. స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదో సూటిగా చెప్పా లని జగన్‌ను కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘20 నిమిషాలు సమయం ఇస్తే ప్రత్తిపాటి భూముల వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో సహా సభలో నిరూపిస్తా’’ అని సవాల్ విసిరారు.దీనిపై స్పీకర్ మాట్లాడుతూ.. ‘‘అక్రమాలను విచారణ కమిటీలో నిరూపించండి. ఇక్కడ సమయం ఇవ్వలేం. మంత్రి సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదో సింపుల్‌గా సమాధానం చెప్పండి’’ అని అన్నారు. సభలో మాట్లాడే అవకాశం దొరక్కపోవడంతో జగన్‌తోపాటు ప్రతిపక్ష సభ్యులు వాకౌ ట్ చేశారు. అనంతరం జగన్ తీరును ఖండిస్తూ అసెంబ్లీలో మంత్రి యనమల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగీవ్రంగా ఆమోదించాలని కోరారు. ఈ తీర్మానంపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు.
ప్రతిపక్ష సభ్యుల నిరసన
ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌ను స్వీకరించడానికి సీఎం చంద్రబాబు ససేమిరా అన్నారు. పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే మంత్రి కె. అచ్చెన్నాయుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై జ్యుడీషియల్ విచా రణ వేస్తామని, మంత్రి పత్తిపాటి పుల్లారావు విసిరిన సవాల్‌ను వైఎస్ జగన్ స్వీకరిస్తున్నారో లేదో తేల్చి చెప్పాలని పేర్కొన్నారు. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విపక్ష నేత విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదో ముందు సీఎం చంద్రబాబు చెప్పా లని డిమాండ్ చేశారు. దీనికి సీఎం అంగీకరించలేదు. చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామ కృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, మాణిక్యాలరావు, పీతల సుజాత, చీఫ్ విప్ కాలు వ శ్రీనివాసులు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు మంత్రి అచ్చెన్నాయుడు వాదనను బలపరుస్తూ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ప్రతి పక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు.