గుండెపోటుతో అగ్రిగోల్డ్ బాధితుడి మృతి
హిందూపురం అర్బన్ : అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన ‘అగ్రిగోల్డ్’ బాధితుడు ఖాదర్‌బాషా (66) శుక్రవారం తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఖాదర్‌బాషా కుమార్తె పెళ్లి కోసం 2012 నుంచి అగ్రిగోల్డ్ సంస్థలో సుమారు రూ.60 వేలు డిపాజిట్ చేశాడు. డబ్బు చేతికొచ్చే సమయానికి ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో మానసికంగా కుంగిపోయాడు.
గురువారం అసెంబ్లీలో ‘అగ్రిగోల్డ్’పై చర్చను టీవీలో వీక్షించాడు. ఈ క్రమంలోనే ఆ సంస్థ చేసిన మోసాన్ని తలచుకోవడంతో బీపీ పెరిగి ఫిట్స్ వచ్చాయి. గుండెపోటు కూడా రావడంతో చనిపోయాడు.