బాకారం (మొయినాబాద్), న్యూస్‌లైన్: గ్రామీణుల ఆరోగ్యమే ధ్యేయమని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గవర్నర్ మర్రి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బాకారంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
అందుకు గ్రామానికి చెందిన తొండుపల్లి రాజు రూ.25వేలు, మాల మహేం దర్ రూ.10వేలు సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్‌యాదవ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు హరికిషన్, ఉపాధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి, సెంట్రల్ అధ్యక్షుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి సధానందం, యువజన కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎలిగేపల్లి శ్రీనివాస్‌యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వడ్డెరాజు, మాజీ సర్పంచ్ శ్రీరాంరెడ్డి, వార్డు సభ్యులు సధానందం, కే.మహేందర్, ఏ.దుర్గమ్మ, శాంతమ్మ, సాతమ్మ, తిరుపతిరెడ్డి, బాల్‌రాజ్, నాయకులు మహేందర్‌ముదిరాజ్, సుభాష్‌రెడ్డి, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు.
గ్రామీణుల ఆరోగ్యమే ధ్యేయం
Published Fri, Jan 24 2014 11:34 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement