భూగర్భ జలాల పెంపే లక్ష్యం
శ్రీకాళహస్తి : భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్థాని క ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక శివం కల్యాణ వుండపం లో నీటి సంరక్షణ-నీటి యుజవూన్యం అనే అంశంపై శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని 11వుండలాల ఎంపీడీవోలతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మా ట్లాడుతూ వర్షపు నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అందులో భాగంగానే ఇంకుడుగుంతల కార్యక్రవూన్ని చేపట్టామని తెలిపారు. గతేడాది రూ.110 కోట్లతో జిల్లాలో 247 కిలోమీట ర్ల మేర సిమెంట్ రోడ్లు వేశామని చెప్పా రు. వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు, పలువురు టీడీపీ నేతలు, జెడ్పీసీఈవో పెంచల కిషోర్, డ్వావూ పీడీ వేణుగోపాల్‌రెడ్డి, పంచాయతీరాజ్ డీపీఎం ప్రభాకర్‌రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ రావుకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారి వేణు పాల్గొన్నారు.