మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : ఎక్సైజ్ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వెరసి హైవేలపై ఉండే దాబాల్లో మద్యం వ్యాపారం 3 పెగ్గులు 6 గ్లాసులుగా విరాజిల్లుతోంది. దాబాల్లో మద్యం విక్రయాలు, సిట్టింగులకు అనుమతులు లేకపోయినా అధికారుల సమన్వయంతో వ్యాపారాలు కొనసాగుతున్నాయన్న విమర్శలున్నాయి. సోమవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెదక్‌లోని ఓ దాబాపై ఆకస్మికంగా దాడులు చేసి అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం స్థానిక అధికారుల డొల్లతనం బయటపడింది.
జిల్లాలో సంగారెడ్డి, మెదక్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో 147 వైన్స్ షాపులున్నా యి. మరికొన్నింటికి దుకాణాలకు ఇటీవలే నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇదిలా ఉండగా.. జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, తుప్రాన్, సిద్దిపేట, పటాన్‌చెరు, రామాయంపేట, గజ్వేల్ పరిధిలోని దాదాపు 90 శాతం దాబాల్లో మద్యం విక్రయాలు, అక్రమ సిట్టింగులు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఇదేమని ఆరా తీయగా.. తమకు అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నారు. వాస్తవానికి దాబాల్లో మద్యం విక్రయాలు, సిట్టింగులకు అనుమతులు ఉండవు. అయితే మద్యం వ్యాపారుల నుంచి అధికారులు భారీ మెత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే వ్యాపారులను కార్యాలయాలకు పిలిపించి మందలించడం లేకపోతే చిన్న పాటి కేసు నమోదు చేయటం అధికారులకు అనవాయితీగా మారుతోంది.
హైవేలపై‘పెగ్’ సిస్టం : జిల్లాలోని ప్రధా న హైవేలపై ఉన్న జహీరాబాద్, సంగారెడ్డి, తూప్రాన్, జోగిపేట, ఆర్సీ పురం, రామాయంపేట లాంటి ప్రాంతాల్లో హైవేకు అనుకుని ఉన్న దాబాల్లో కొత్త గా ‘పెగ్’ సిస్టంను అమలు పరుస్తున్నా రు. మందుబాబులు వచ్చిన రెండు నిమిషాల్లో పెగ్ మందు చేతికందుతుంది. వెంటనే మందు కొట్టేసి అక్కడి నుంచి వెళుతున్నారు. సోమవారం ఎక్సై జ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెదక్ పట్టణ సమీపంలోని రాజ్ దాబాపై దాడులు నిర్వహించి కేసు నమోదు చేసినా.. మరుసటి రోజు యథావిధిగా మద్యం సిట్టింగ్‌లు నిర్వహించడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దాబాల్లో.. దాగుడుమూతలు
Published Thu, Feb 6 2014 2:56 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement