![Alcohol Sales Hikes on New Year Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/3/alcohol.jpg.webp?itok=TUQP5ncF)
విజయనగరం రూరల్: కొత్త సంవత్సర వేడుకల్లో మందుబాబుల హడావిడి కొనసాగింది. అయితే గతేడాది మద్యం అమ్మకాలపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడంతో తగ్గిన మద్యం అమ్మకాలు.. ఈ ఏడాది మద్యం అమ్మకాలపై ఆంక్షలు తొలగించడంతో ఎక్సైజ్‌శాఖకు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. గతేడాది కొత్త సంవత్సర వేడుకల పేరుతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ హెచ్చరికలు... దుకాణాలు నిర్ణీత సమయానికే మూసేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆంక్షలు ఎత్తేయడంతో మద్యం అమ్మకాల జోరు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment