
సాక్షి, హైదరాబాద్: రాత్రి కర్ఫ్యూ ఎత్తేసిన నేపథ్యం లో రాష్ట్రంలో మద్యం విక్రయ వేళలను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వైన్ షాపులకు లైసెన్స్ ఇచ్చే సమయంలో అనుమతించిన వేళల వరకు ఏ4 షాపుల ద్వారా మద్యం అమ్మేందు కు అనుమతినిస్తూ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మ ద్ సోమవారం ఉత్తర్వులు జా రీ చేశారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలకు వెసులుబా టు లభించింది. గత 4 నెలలుగా కరోనా నిబంధన ల కారణంగా కుదించిన మద్యం విక్రయ వేళలపై ఈ ఉత్తర్వులతో ఆంక్షలు పూర్తిగా తొలిగాయి.