సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జిల్లాప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అదే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమవుతాయని భావిస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై అపారమైన ప్రేమాభిమానాలున్న జిల్లా కావడంతో ఇక్కడ వైఎస్సార్ సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
{పాదేశిక ఎన్నికలకు ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ఉంటే..ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోకు జిల్లా ప్రజలు ఆకర్షితులయ్యారని..దీంతో జిల్లాలో వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో లేని ఉత్సాహాన్ని తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీకి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు డీలా పడేలా చేస్తాయని అంటున్నారు.
ఉత్కంఠ!
పలువురు రాజకీయ నేతలు ఎగ్జిట్‌పోల్ నిర్వహించి..అందులో వచ్చిన ఫలితాలు కాకుండా..తమ బెట్టింగ్‌లకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేస్తున్నారని..దీని ద్వారా పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్, ఆయన సోదరి షర్మిల జిల్లా పర్యటనల్లో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా లేకపోతే..అంతమంది ప్రజలు జగన్ కోసం ఎందుకు వస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు అభ్యర్థుల స్థానిక ప్రభావంపై ఓటింగ్ ఆధారపడి ఉంటుందని, దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్న ప్రజలు తమ ఆకాంక్షను ఓట్ల రూపంలో తెలియజేశారని, దానికి అనుగుణంగానే వైఎస్సార్ సీపీకి పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం హవా ఉండటంతో తగ్గిన బెట్టింగ్‌ల జోరు..ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన మెరుగైన ఫలితాలతో మళ్లీ పెరిగింది. జగన్ ముఖ్యమంత్రి అవుతారని..జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని బెట్టింగ్‌లు కడుతున్నారు. రూ. లక్ష నుంచి కోటి వరకు ఈ బెట్టింగ్‌లు సాగుతున్నాయి.
క్షణం క్షణం ఉత్కంఠ!
Published Thu, May 15 2014 3:18 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement