Results of the general elections
-
‘సార్వత్రిక’ ఫలితాలపై నేటి నుంచి రాజమండ్రిలో జగన్ సమీక్ష
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడానికి బుధవారం నుంచి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నేతలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. 2014 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న సంగతి తెలిసిందే. తొలి విడతగా రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో నేటి నుంచి మూడు రోజుల పాటు (6 వరకు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభ య గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాలల్లో పరిస్థితిపై సమీక్షిస్తారు. తర్వాత 9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఒంగోలులో సమీక్షలు ఉంటాయి. 11, 12 తేదీల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. -
ఉత్కంఠగా ఫలితాల సరళి
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి జిల్లాలో సర్వత్రా ఆసక్తిని కలిగించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఉదయం 8 గంటల నుంచి తుది రౌండ్ వరకు ఉత్కంఠతో ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బిగ్‌స్క్రీన్ వద్ద అభ్యర్థుల వెంట వచ్చిన వారు, రాజకీయ నాయకులు, ఆసక్తికల వర్గాలు ప్రతి రౌండ్ ఫలితాలు ఉత్కంఠతో చూశారు. ప్రతిరౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కనిపించింది. పలు నియోజకవర్గాల్లో ఆయా రౌండ్లలో ఒక్కొక్కరు చొప్పున ముందంజ వేస్తూ ఫలితం ఆసక్తికరంగా మార్చింది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి ఏడు రౌండ ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కె.శ్రీహరిరావు ఆధిక్యం కనిపించింది. తర్వాతి రౌండ్ నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇదే ఆధిక్యాన్ని చివరి రౌండ్ వరకు ఆయన కొనసాగించారు. చివరి రౌండ్లో, పోస్టల్ బ్యాలెట్లో కె.శ్రీహరిరావు ఆధిక్యాన్ని సాధించినప్పటికీ విజయం బీఎస్పీ అభ్యర్థినే వరించింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వరరెడ్డి ఏ రౌండ్లోనూ మిగతా ఇద్దరు అభ్యర్థుల కంటే ఆధిక్యాన్ని కనపర్చలేదు. ఆసిఫాబాద్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కంటే టీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి ప్రతి రౌండ్లోనూ ముందంజలో ఉండి విజయం సాధించారు. బోథ్ నియోజకవర్గంలో ఆరో రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు ఆధిక్యంలో ఉన్నారు. ఏడో రౌండ్, పదో రౌండ్, పదకొండో రౌండ్లో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అయితే పన్నెండొ రౌండ్‌తోపాటు చివరి రౌండ్ అయిన 16వ, పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు ముందంజలో ఉండి విజయం సాధించారు. సిర్పూర్ నియోజకవర్గంలో మొదటి, రెండో రౌండ్లలో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప ముందంజలో ఉన్నారు. మూడో రౌండ్ నుంచి ఏడో రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య ఆధిక్యంలో నిలిచారు. ఏడో రౌండ్ నుంచి 16వ రౌండ్ వరకు కోనప్ప ఆధిక్యంలో నిలవగా చివరి రౌండ్, పోస్టల్ బ్యాలెట్లో కావేటి సమ్మయ్య ముందంజలో నిలిచారు. తుది ఫలితాల్లో కోనప్ప విజయం సాధించారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు మొదటి నుంచి చివరిదైన 19వ రౌండ్‌తోపాటు పోస్టల్ బ్యాలెట్లలోనూ ఆధిక్యం కనపరిచి విజయం సాధించారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్ మొదటి నుంచి చివరిదైన 16వ రౌండ్ వరకు సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై రితేష్ రాథోడ్‌పై ఆధిక్యం కనపరిచి గెలుపొందారు. ముథోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వేణుగోపాలాచారిపై ఆధిక్యం కనపరిచారు. రెండో, మూడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి, నాలుగో, ఐదో, ఆరో రౌండ్లో విఠల్‌రెడ్డి, ఏడో, ఎనిమిదో రౌండ్లో చారి, తొమ్మిదో రౌండ్ నుంచి చివరిదైన 17వ రౌండ్ వరకు విఠల్‌రెడ్డి ముందంజలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్లో చారి ముందంజలో నిలిచినా విఠల్‌రెడ్డి విజయం సాధించారు. చెన్నూర్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో ప్రతి రౌండ్‌తోపాటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ ఆధిక్యాన్ని సాధించి టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్‌పై గెలుపొందారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై 18 రౌండ్లతోపాటు పోస్టల్‌ఓట్ల సాధనలో ముందు నిలిచారు. ఒక్క 11 రౌండ్లోనే కాంగ్రెస్ అభ్యర్థి భార్గవ్ దేశ్‌పాండే టీఆర్ఎస్ అభ్యర్థి కంటే ముందంజలో నిలిచారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్‌పై అన్ని రౌండ్లతోపాటు పోస్టల్ బ్యాలెట్ల సాధనలోనూ ముందు నిలిచి విజయం సాధించారు. -
తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొన్ని గంటల్లో శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల జయాపజయాలను తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ద్వారా మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడికానున్నాయి. మొదటి మూడునాలుగు రౌండ్లలోనే అభ్యర్థికి వచ్చే ఓట్ల మెజార్టీ ఆధారంగా ఫలితం తేలనుంది. మరోవైపు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏ పార్టీకి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయంపై లెక్కలేయడంలో బిజీగా మారారు. ఎన్నికల ముందు, తర్వాత రాజకీయ మార్పులు, సమీకరణాలను విశ్లేషించుకుంటూ.. పార్టీ భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో బేరీజు వేసుకుంటూ, ఎక్కడెక్కడ ఏ సామాజికవర్గం నుంచి ఏ మేరకు ఓట్లు దక్కాయని కూడికలేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కాస్తంత బలం చాటుకున్నప్పటికీ.. ప్రాదేశికాల్లో బోర్లాపడటంతో ప్రజానాడి తేలిపోయింది. అర్బన్ప్రాంతాల్లో బొటాబొటి మెజార్టీ తెచ్చుకున్నా.. గ్రామీణ ప్రాంత ప్రజలు టీడీపీకి పట్టం కట్టకపోవడంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇవే ఫలితాలు రేపటి సార్వత్రిక ఎన్నికల లెక్కింపులోనూ కనిపించనున్నాయా..? అనే ఆందోళన వారిలో నెలకొంది. ప్రధానంగా దర్శి, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు, యర్రగొండపాలెం, పర్చూరు, మార్కాపురం ప్రాదేశికాల్లో టీడీపీ ఘోరంగా విఫలమవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం కీలక నేతలంతా సమావేశమై.. జెడ్పీటీసీలు దక్కించుకోలేకపోవడానికి కారణాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాత్మకంగా ఉన్నప్పటీకీ.. ఎన్నికల వ్యూహాన్ని నడిపించలేకపోవడమే ఓటమికి దారితీసిన అంశంగా తేల్చుకున్నారు. ఇవే అంశాలతో కూడిన నివేదికను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం పంపినట్లు సమాచారం. సార్వత్రిక ఫలితాల్లో కూడా టీడీపీ వాటా రెండు స్థానాలకే పరిమితం కానున్నట్లు ఆ పార్టీ కీలక నేతలు అంచనావేసి.. అధిష్టానానికి తెలియజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చరిత్ర తిరగరాయనున్న ‘ఫ్యాన్’గాలి... జిల్లాలో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ రికార్డు సృష్టించనున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఆ పార్టీపై పెట్టుకున్న అభిమానం స్థానిక ఫలితాల ద్వారా ఉవ్వెత్తున ఎగిసిపడినట్లు తెలుస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాల సరళిని గమనించిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వైఎస్ఆర్ సీపీకే రానున్నట్టు వివరిస్తున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత సీమాంధ్రలో చోటుచేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో పలు సామాజికవర్గాలు ఫ్యాన్ గుర్తుకే మొగ్గుచూపినట్టు.. టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో మైనార్టీలు ఆ రెండు పార్టీలకు దూరమైనట్లు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా పొత్తు కుదుర్చుకున్నట్లు బహిరంగంగా ప్రకటించి కూడా సంతనూతలపాడు నియోజకవర్గం విషయంలో బీజేపీకి వెన్నుపోటు పొడవడం టీడీపీకి పెద్ద మైనస్‌గా నిలిచిందంటున్నారు. బహుజన సామాజికవర్గాలతో పాటు గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలంతా జగన్మోహన్రెడ్డి అభిమానులుగా ఉంటూ వైఎస్ఆర్ సీపీకే ఓట్లేశారని పరిశీలకులు చెబుతున్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించనున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
క్షణం క్షణం ఉత్కంఠ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జిల్లాప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అదే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమవుతాయని భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై అపారమైన ప్రేమాభిమానాలున్న జిల్లా కావడంతో ఇక్కడ వైఎస్సార్ సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. {పాదేశిక ఎన్నికలకు ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ఉంటే..ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోకు జిల్లా ప్రజలు ఆకర్షితులయ్యారని..దీంతో జిల్లాలో వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో లేని ఉత్సాహాన్ని తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీకి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు డీలా పడేలా చేస్తాయని అంటున్నారు. ఉత్కంఠ! పలువురు రాజకీయ నేతలు ఎగ్జిట్‌పోల్ నిర్వహించి..అందులో వచ్చిన ఫలితాలు కాకుండా..తమ బెట్టింగ్‌లకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేస్తున్నారని..దీని ద్వారా పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్, ఆయన సోదరి షర్మిల జిల్లా పర్యటనల్లో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా లేకపోతే..అంతమంది ప్రజలు జగన్ కోసం ఎందుకు వస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు అభ్యర్థుల స్థానిక ప్రభావంపై ఓటింగ్ ఆధారపడి ఉంటుందని, దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్న ప్రజలు తమ ఆకాంక్షను ఓట్ల రూపంలో తెలియజేశారని, దానికి అనుగుణంగానే వైఎస్సార్ సీపీకి పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం హవా ఉండటంతో తగ్గిన బెట్టింగ్‌ల జోరు..ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన మెరుగైన ఫలితాలతో మళ్లీ పెరిగింది. జగన్ ముఖ్యమంత్రి అవుతారని..జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని బెట్టింగ్‌లు కడుతున్నారు. రూ. లక్ష నుంచి కోటి వరకు ఈ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. -
మేయర్, చైర్మన్ పదవులు ఎవరికో!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరు అధిష్టించనున్నారు? కీలకంగా మారిన ఎంఐఎం ఎవరి పంచన చేరుతుంది? ఇతర పార్టీల మద్దతుతో ఎంఐఎం మేయర్ కుర్చీ ఎక్కనుందా? లేక మేయర్ పదవి కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్, టీ ఆర్ఎస్లలో ఏ పార్టీకైనా మద్దతిస్తుందా? నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ఏర్పాటుపై జరుగుతున్న చర్చ ఇది. 12న జరిగిన మున్సిపల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్, ఎంఐఎంలకు 16 చొప్పున కార్పొరేటర్ స్థానాలు దక్కగా, టీఆర్ఎస్ పది డివిజన్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు పార్టీలూ ‘మేయర్’ పీ ఠంపై దృష్టి సారించాయి. జో రుగా తర్జనభర్జనలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఎంఐ ఎం నేతలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరితో జత కలవాలో మజ్లిస్ తేల్చుకోలేక పోతోందని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలు మాత్రం ‘స్టేట్పాలసీ’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నా రు. 16న జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విషయంలో స్పష్టత వస్తుందంటున్నారు. బోధన్ మున్సిపాలిటీలో కూడా ఎంఐఎం పాత్ర కీలకం కానుంది. ఆర్మూరు, బోధన్ బల్దియా పీఠాల పీట ముడి కూడా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాతే వీడనుంది. ‘హంగ్’తో ఖంగుతిన్న పార్టీలు నిజామాబాద్ నగరపాలక సంస్థలో వచ్చిన ‘హంగ్’ ఫలితాలు పార్టీలను ఖంగు తినిపించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తమ తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. గత ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన ఎంఐఎం. ఈసారి 16 డివిజన్లను కైవ సం చేసుకొని మేయర్ పీఠం దక్కించుకోవాలని తహతహలాడుతుండటం సంచలనం కలిగిస్తోంది. కాంగ్రె స్, టీఆర్ఎస్, మజ్లిస్లలో ఏ రెండు పార్టీలు కలిసినా మేయర్ పీఠం దక్కే అవకాశం ఉండగా, ఆయా పా ర్టీల అగ్రనేతలు రాజీ కోసం రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి శ్రీనివాస్, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఎంఐఎం, టీఆర్ఎస్లతో విడివిడిగా చ ర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. టీ ఆర్ఎస్ నాయకురాలు కవితతోపాటు, మజ్లిస్ నేతల తో వారు సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే, ఎంఐఎం నేతలు మేయర్ పీఠం తమకే కా వాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ విషయమై మాజీ డిప్యూటీ మేయర్, నిజామాబాద్ అర్బన్ ఎం ఐఎం అభ్యర్థి మీర్ మజాజ్ అలీతో పాటు పలువురు నేతలు ఆ పార్టీ అగ్రనేతలతో పలుమార్లు చర్చించిన ట్లు తెలిసింది. బోధన్, ఆర్మూర్‌లో ఇతరుల మద్దతుతోగానీ, ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లతో గట్టెక్కే స్థితి ఉంది. క్యాంపునకు బయలుదేరిన కాంగ్రెస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సూ చనల మేరకు మేయర్ అభ్యర్థి కాపర్తి సుజాత దంపతులు 12 మంది కార్పొరేటర్ దంపతులను క్యాంపునకు తరలించారు. మరో ఇద్దరు స్వతంత్ర, నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం రెండు రోజులలో క్యాంపులో చేరనున్నట్లు తెలిసింది. ఎంఐఎం, టీఆర్ఎస్ సైతం నేడో రేపో తమ కార్పొరేటర్లను శిబిరాల కు తరలించే ఏర్పాట్లలో ఉన్నట్లు తెలిసింది. బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలలో కూడా క్యాంపు రాజకీయాలకు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను సైతం క్యాంపునకు తర లించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జూన్ రెండో వారంలోనే ఇదిలా వుండగా, రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి ప్రకటన ప్రకారం 16న ఎమ్మెల్యే, ఎంపీల ఫలితా లు వెలువడితే, జూన్ రెండు తర్వాతే వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో జూన్ రెండో వా రం వరకు మేయర్, చైర్మన్ల ఎన్నిక జరిగే అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడితేగానీ కాంగ్రెస్, టీఆర్ ఎస్, ఎంఐఎంలలో ఏ పార్టీతో ఏ పార్టీకి సయోధ్య కుదురుతుందో తేలే అవకాశం లేదు.