సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరు అధిష్టించనున్నారు? కీలకంగా మారిన ఎంఐఎం ఎవరి పంచన చేరుతుంది? ఇతర పార్టీల మద్దతుతో ఎంఐఎం మేయర్ కుర్చీ ఎక్కనుందా? లేక మేయర్ పదవి కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్, టీ ఆర్‌ఎస్‌లలో ఏ పార్టీకైనా మద్దతిస్తుందా? నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ఏర్పాటుపై జరుగుతున్న చర్చ ఇది. 12న జరిగిన మున్సిపల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్, ఎంఐఎంలకు 16 చొప్పున కార్పొరేటర్ స్థానాలు దక్కగా, టీఆర్‌ఎస్ పది డివిజన్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు పార్టీలూ ‘మేయర్’ పీ ఠంపై దృష్టి సారించాయి. జో రుగా తర్జనభర్జనలు కొనసాగిస్తున్నాయి.
ఇప్పటికే ఎంఐ ఎం నేతలతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరితో జత కలవాలో మజ్లిస్ తేల్చుకోలేక పోతోందని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలు మాత్రం ‘స్టేట్‌పాలసీ’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నా రు. 16న జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విషయంలో స్పష్టత వస్తుందంటున్నారు. బోధన్ మున్సిపాలిటీలో కూడా ఎంఐఎం పాత్ర కీలకం కానుంది. ఆర్మూరు, బోధన్ బల్దియా పీఠాల పీట ముడి కూడా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాతే వీడనుంది.
‘హంగ్’తో ఖంగుతిన్న పార్టీలు
నిజామాబాద్ నగరపాలక సంస్థలో వచ్చిన ‘హంగ్’ ఫలితాలు పార్టీలను ఖంగు తినిపించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తమ తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. గత ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన ఎంఐఎం. ఈసారి 16 డివిజన్లను కైవ సం చేసుకొని మేయర్ పీఠం దక్కించుకోవాలని తహతహలాడుతుండటం సంచలనం కలిగిస్తోంది. కాంగ్రె స్, టీఆర్‌ఎస్, మజ్లిస్‌లలో ఏ రెండు పార్టీలు కలిసినా మేయర్ పీఠం దక్కే అవకాశం ఉండగా, ఆయా పా ర్టీల అగ్రనేతలు రాజీ కోసం రంగంలోకి దిగారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి శ్రీనివాస్, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లతో విడివిడిగా చ ర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. టీ ఆర్‌ఎస్ నాయకురాలు కవితతోపాటు, మజ్లిస్ నేతల తో వారు సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే, ఎంఐఎం నేతలు మేయర్ పీఠం తమకే కా వాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ విషయమై మాజీ డిప్యూటీ మేయర్, నిజామాబాద్ అర్బన్ ఎం ఐఎం అభ్యర్థి మీర్ మజాజ్ అలీతో పాటు పలువురు నేతలు ఆ పార్టీ అగ్రనేతలతో పలుమార్లు చర్చించిన ట్లు తెలిసింది. బోధన్, ఆర్మూర్‌లో ఇతరుల మద్దతుతోగానీ, ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లతో గట్టెక్కే స్థితి ఉంది.
క్యాంపునకు బయలుదేరిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సూ చనల మేరకు మేయర్ అభ్యర్థి కాపర్తి సుజాత దంపతులు 12 మంది కార్పొరేటర్ దంపతులను క్యాంపునకు తరలించారు. మరో ఇద్దరు స్వతంత్ర, నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం రెండు రోజులలో క్యాంపులో చేరనున్నట్లు తెలిసింది. ఎంఐఎం, టీఆర్‌ఎస్ సైతం నేడో రేపో తమ కార్పొరేటర్లను శిబిరాల కు తరలించే ఏర్పాట్లలో ఉన్నట్లు తెలిసింది. బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలలో కూడా క్యాంపు రాజకీయాలకు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను సైతం క్యాంపునకు తర లించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
జూన్ రెండో వారంలోనే
ఇదిలా వుండగా, రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి ప్రకటన ప్రకారం 16న ఎమ్మెల్యే, ఎంపీల ఫలితా లు వెలువడితే, జూన్ రెండు తర్వాతే వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో జూన్ రెండో వా రం వరకు మేయర్, చైర్మన్‌ల ఎన్నిక జరిగే అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడితేగానీ కాంగ్రెస్, టీఆర్ ఎస్, ఎంఐఎంలలో ఏ పార్టీతో ఏ పార్టీకి సయోధ్య కుదురుతుందో తేలే అవకాశం లేదు.
మేయర్, చైర్మన్ పదవులు ఎవరికో!
Published Thu, May 15 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement