ముంబై ఘటనపై జనాగ్రహం | all peoples fire on mumbai rape issue | Sakshi
Sakshi News home page

ముంబై ఘటనపై జనాగ్రహం

Published Sun, Aug 25 2013 6:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

all peoples fire on mumbai rape issue

 జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ముంబైలో మహిళ ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను ప్ర జా, కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శనివారం జిల్లావ్యాప్తంగా అత్యాచార ఘ టనను ఖండిస్తూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలపై జ రుగుతున్న అత్యాచారాలు హేయమైనచర్యగా పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని స్త్రీ, శిశు రక్షణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా లో అత్యాచార నిందితుల దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ గంగన్న మాట్లాడుతూ దేశంలో మహిళలకు ర క్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ని ర్భయ సంఘటనతో దేశంలో అత్యాచారాలు ఆ గకపోగా, మరింత పెరగడం విచారకరమన్నా రు.
 
 ఆత్మకూర్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో రా స్తారోకో నిర్వహించి  జర్నలిస్టుపై లైంగిక దా డికి పాల్పడిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చి, చర్యలు చే పట్టాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌ఆర్ మన్యం కోరారు. మహిళలపై అత్యాచారాలను నిరోధించాలని ధన్వాడ మండలంలోని మరికల్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల వి ద్యార్థులు ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, నిరసన తెలిపారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దా డులను నిరోధించడంలో  ప్రభుత్వం  పూర్తిగా విఫలమైందని ఏబీవీపీ జిల్లా సాందీపాని కన్వీనర్ వెంకటేశ్ విమర్శించారు. వీటితో పాటు జ డ్చర్ల, కల్వకుర్తి, షాద్‌నగర్, కొల్లాపూర్, గద్వాల, దేవరకద్ర నియోజవర్గాల్లో నిరసనలు తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement