శక్తిమిల్స్ గ్యాంగ్ రేప్: నలుగురికి జీవితఖైదు | Four get life sentence in Shakti Mills gang-rape | Sakshi
Sakshi News home page

శక్తిమిల్స్ గ్యాంగ్ రేప్: నలుగురికి జీవితఖైదు

Published Fri, Mar 21 2014 3:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని శక్తిమిల్స్ ప్రాంగణంలో 19 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని శక్తిమిల్స్ ప్రాంగణంలో 19 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఈ సంఘటన 2013 జూలై 31న జరిగింది. దోషులు సహజంగా మరణించేవరకు ఈ శిక్ష అమలవుతుంది. దోషులు విజయ్ జాదవ్ (18), ఖాసిం హఫీజ్ షేక్ అలియాస్ ఖాసిం బెంగాలీ (20), సలీం అన్సారీ (27), మహ్మద్ ఆష్ఫక్ షేక్ (26)లతో పాటు మరో మైనర్ కూడా ఈ కేసులో ఉన్నాడు.

బాధితురాలు సిద్దివినాయకుని గుడికి తన స్నేహితుడితో కలిసి వెళ్తూ, దగ్గర దారి అవుతుందని శక్తి మిల్స్ మీదుగా వెళ్తుండగా ఈ ఐదుగురు ఆమెపై దాడిచేశారు. మొదట్లో ధైర్యం లేక పోలీసులకు చెప్పకపోయినా.. తర్వాత ఆగస్టు 22న అక్కడే మరో జర్నలిస్టుపై కూడా అలాగే జరగడంతో తర్వాత బయటపెట్టింది. ఈ రెండు కేసుల్లోనూ జాదవ్, బెంగాలీ, అన్సారీ దోషులని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలినీ ఫన్సాల్కర్ జోషి తీర్పునిచ్చారు. ఈ రెండు కేసుల్లో వేర్వేరుగా దోషులైన ఇద్దరు మైనర్లను ముంబై బాల నేరస్థుల బోర్డు ప్రత్యేకంగా విచారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement