వినోదం.. కారాదు విషాదం! | Ambedkar University Students Should Need Awareness Programme On Anti Ragging In Srikakulam | Sakshi
Sakshi News home page

వినోదం.. కారాదు విషాదం!

Published Sat, Jul 20 2019 11:48 AM | Last Updated on Sat, Jul 20 2019 11:49 AM

Ambedkar University Students Should Need Awareness Programme On Anti Ragging In Srikakulam - Sakshi

అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ర్యాగింగ్‌ నిరోధక ఫ్లెక్సీ

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌: ర్యాగింగ్‌.. సీనియర్లకు వినోదం, జూని యర్లకు ప్రాణసంకటం. మొదట సరదాగానే ఉన్నా పరిస్థితి చేయిదాటి ఒక్కోసారి విషాదంగా మారుతోంది. ఈ పరిస్థితి రాకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సీనియర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ర్యాగింగ్‌ వల్ల కలిగే అనర్ధాలను, శిక్షలను వివరించడంతో పాటు జూనియర్లతో స్నేహభావం కొనసాగించే విధానంపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

కోటి ఆశలతో కొత్త విద్యార్థులు..
పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరాక విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. డిగ్రీ వరకు పరిస్థితి ఎలా ఉన్నా పీజీ స్థాయిలో విద్యార్థుల్లో స్నేహ సంబంధాలు కీలకం. జూనియర్, సీనియర్‌ అభ్యర్థుల మధ్య స్నేహం అవసరం. ర్యాగింగ్‌ వంటి చర్యలకు దూరంగా ఉండాలి. జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మొదటి ఏడాది ప్రవేశాలు పూర్తి కావడం, వసతి గృహంలో సీట్లు కేటాయింపు కూడా పూర్తవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా చేరారు. వీరంతా కొంచెం బిడియంతో ఉంటారు. ఈ సమయంలో ర్యాగింగ్‌ జరిగే ఆస్కారం ఉంటుంది.  

శ్రుతిమించితే కష్టమే..
అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ర్యాగింగ్‌ నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా, గతంలో తరగతి గదులు, వసతి గృహాల్లో ర్యాగింగ్‌ జరిగిన సంఘటనలు ఉన్నా యి. జూనియర్ల బయోడేటాలు అడగటం, భోజనం సమయంలో ప్లేట్లు తీసుకువెళ్లడం వంటివి జరిగేవి. ఇవన్నీ సరదాగా సాగితే ఏ సమస్యా ఉండదు. పరిచయ కార్యక్రమం కాస్త శ్రుతిమించితేనే ఇబ్బందులు తప్పవు. కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ పేరిట వికృత శ్రేష్టలు, నేరాలకు పాల్ప డితే సమస్యలు ఎదుర్కోక తప్పదు.

కఠిన చర్యలు తప్పవు..
ఏపీలో ర్యాగింగ్‌ నియంత్రణ చట్టం–1997 ప్రకారం.. విద్యా సంస్థ లోపల, బయట ఎక్కడ ర్యాగింగ్‌ చేయకూడదు. భయపెట్టే చర్యలకు పాల్పడటం, అవమానించటం, వేధించటం, గాయపర్చటం వంటి చర్యలకు పాల్పడితే ఆరు నెలలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల అపరాధ రుసుం విధిస్తారు. క్రిమినల్‌ చర్యలకు పాల్పడితే సంవత్సరం శిక్ష, రెండు వేల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుంది. క్రిమినల్‌ ఫోర్స్‌ వంటి నేరానికి పాల్పడితే రెండేళ్ల శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తారు. కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడితే రూ.10 వేలు అపరాధ రుసుం, ఐదేళ్ల శిక్ష వర్తిస్తుంది. ర్యాగింగ్‌ కేసు నమోదైతే సదరు విద్యార్థిని కళాశాల నుంచి పంపించేస్తారు. ఇతర కళాశాలల్లో సైతం చేర్పించుకోరు. విద్యార్థిపై ఒక్కసారి ర్యాగింగ్‌ కేసు నమోదైతే విలువైన జీవితం ముగుస్తుంది. 

విద్యాసంస్థదే బాధ్యత..
సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో విద్యాసంస్థలు ర్యాగింగ్‌ నియంత్రణకు పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థా యి నియంత్రణలో విద్యాసంస్థదే బాధ్యత. ర్యాగింగ్‌ వ్యతిరేక కమిటీలు వేయాలి. వీటిలో సీనియర్, జూనియర్‌ విద్యార్థులను భాగస్వాములను చేయాలి.  విద్యార్థులు, అధ్యాపకులు, బోధన సిబ్బంది కమిటీలో సభ్యులు గా ఉండాలి. ఐదుగురు నుంచి ఆరుగురితో కమిటీలు పక్కాగా నిర్వహించాలి. ప్రచార ఫ్లెక్సీలు ప్రదర్శించి అధికారుల ఫోన్‌ నంబర్లు పొందుపరిచాలి. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. 

ధ్రువీకరణ తీసుకుంటున్నాం
ర్యాగింగ్‌కు పాల్పడబో మని ప్రవేశ సమయంలో నే విద్యార్థుల ధ్రువీకరణ తీసకుంటున్నాం. వర్సిటీలో ర్యాగింగ్‌కు ఆస్కార మే లేదు. ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వసతి గృహాల్లో నిరంతరం నిఘా పెట్టాం. అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, బోధన సిబ్బందితో ర్యాగింగ్‌ నియంత్రణ కమిటీలు నియమిస్తున్నాం. ప్రిన్సిపాళ్లను అప్రమత్తం చేస్తున్నాం.
–ప్రొఫెసర్‌ కూన రామ్‌జీ, వైస్‌ చాన్సలర్, బీఆర్‌ఏయూ

అవగాహన కల్పిస్తున్నాం
విద్యార్థులకు భవిష్యత్‌పై అవగాహన కల్పిస్తున్నాం. భవిష్యత్తు, జీవితం విలు వ తెలిసిన వారు ర్యాగింగ్‌కు పాల్పడరు. తరగతి గదులు, వసతి గృహంలో ర్యాగింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ప్రశాం తంగా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. విద్యార్థులు వర్సిటీలోకి లక్ష్యాలతో అడుగు పెడతారు. వాటిని చేరుకోవాలంటే పట్టుదలతో చదవడం ఒక్కటే మార్గం. 
– ప్రొఫెసర్‌ కె,రఘుబాబు, రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement