Dr. BR Ambedkar University
-
నాలుగేళ్లలోనే డిగ్రీ+బీఈడీ
సాక్షి, అమరావతి: సైన్సు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇప్పుడు బోధన రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీ కోర్సులను దేశంలో 42 ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు ప్రారంభించాయి. మనరాష్ట్రంలో శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గత నెలలో నిర్వహించిన జాతీయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–(ఎన్సెట్)–2023కు 16,004 మంది దరఖాస్తు చేసుకోగా 10,136 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించి, ఈ నెలలో ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం.. ఫౌండేషన్(1 నుంచి 2 తరగతులు), ప్రిపరేటరీ (3–5), మిడిల్ స్టేజ్ (6–8), సెకండరీ స్టేజ్ (9–12 తరగతులు)కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను అందిస్తున్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెకండరీ స్టేజ్ (9 నుంచి 12వ తరగతి)కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీతో ఉన్నత అవకాశాలు ఎన్టీఏ నిర్వహించిన ఎన్సెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు మూడేళ్ల తర్వాత నాలుగో ఏడాది చదవడం ఇష్టం లేకపోతే కోర్సు నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మూడేళ్ల డిగ్రీ పట్టాను అందిస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే పీజీ కోర్సులు చదువుకోవచ్చు. బోధన రంగాన్ని ఎంచుకునేవారికి మంచి అవకాశాలు.. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. బీఎస్సీ–బీఈడీకి 1,988 మంది, బీఏ–బీఈడీకి 1,020 మంది దరఖాస్తు చేసుకున్నారు. బోధనకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేసింది. నైపుణ్యం గల టీచింగ్ ఫ్యాకల్టీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఉపాధి కోర్సుగా మాత్రమే ఉన్న బీఈడీ కోర్సు బోధన రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తుంది. – ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ -
ఎన్ఈపీ అమలులో అగ్రస్థానంలో ఏపీ
విశాఖ విద్య: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలులో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ టీవీ కట్టిమని అన్నారు. విశాఖపట్నంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం) వీసీ నిమ్మ వెంకటరావు, జేఎన్టీయూ(విజయనగరం) వీసీ బి.వెంకట సుబ్బయ్య, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ డైరెక్టర్ శాలివాహన్, ఐఐఎం ప్రతినిధి ఆచార్య షమీమ్ జావేద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో పాలసీలు తీసుకువచ్చేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ.. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని విజయవంతంగా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోందన్నారు.జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులు తమ అభిరుచి మేరకు కోర్సులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభించిందన్నారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా చదువులు సాగుతున్నాయని వివరించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించడం, విద్యాలయాలను పరిశ్రమలకు అనుసంధానం చేయడం వంటి చర్యలు విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యకు పాఠశాల స్థాయిలోనే పటిష్ట పునాది వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా బోధన సాగుతోందన్నారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 561 ఎకరాల భూమి కేటాయించిందని.. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసిన అనంతరం నూతన క్యాంపస్‌కు వెళ్తామని వీసీ కట్టిమని తెలిపారు. అనంతరం జాతీయ విద్యావిధానం ప్రయోజనాలపై గిరిజన వర్సిటీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
వినోదం.. కారాదు విషాదం!
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ర్యాగింగ్.. సీనియర్లకు వినోదం, జూని యర్లకు ప్రాణసంకటం. మొదట సరదాగానే ఉన్నా పరిస్థితి చేయిదాటి ఒక్కోసారి విషాదంగా మారుతోంది. ఈ పరిస్థితి రాకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సీనియర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ర్యాగింగ్ వల్ల కలిగే అనర్ధాలను, శిక్షలను వివరించడంతో పాటు జూనియర్లతో స్నేహభావం కొనసాగించే విధానంపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. కోటి ఆశలతో కొత్త విద్యార్థులు.. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరాక విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. డిగ్రీ వరకు పరిస్థితి ఎలా ఉన్నా పీజీ స్థాయిలో విద్యార్థుల్లో స్నేహ సంబంధాలు కీలకం. జూనియర్, సీనియర్ అభ్యర్థుల మధ్య స్నేహం అవసరం. ర్యాగింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలి. జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొదటి ఏడాది ప్రవేశాలు పూర్తి కావడం, వసతి గృహంలో సీట్లు కేటాయింపు కూడా పూర్తవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా చేరారు. వీరంతా కొంచెం బిడియంతో ఉంటారు. ఈ సమయంలో ర్యాగింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. శ్రుతిమించితే కష్టమే.. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ర్యాగింగ్ నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా, గతంలో తరగతి గదులు, వసతి గృహాల్లో ర్యాగింగ్ జరిగిన సంఘటనలు ఉన్నా యి. జూనియర్ల బయోడేటాలు అడగటం, భోజనం సమయంలో ప్లేట్లు తీసుకువెళ్లడం వంటివి జరిగేవి. ఇవన్నీ సరదాగా సాగితే ఏ సమస్యా ఉండదు. పరిచయ కార్యక్రమం కాస్త శ్రుతిమించితేనే ఇబ్బందులు తప్పవు. కొందరు సీనియర్లు ర్యాగింగ్ పేరిట వికృత శ్రేష్టలు, నేరాలకు పాల్ప డితే సమస్యలు ఎదుర్కోక తప్పదు. కఠిన చర్యలు తప్పవు.. ఏపీలో ర్యాగింగ్ నియంత్రణ చట్టం–1997 ప్రకారం.. విద్యా సంస్థ లోపల, బయట ఎక్కడ ర్యాగింగ్ చేయకూడదు. భయపెట్టే చర్యలకు పాల్పడటం, అవమానించటం, వేధించటం, గాయపర్చటం వంటి చర్యలకు పాల్పడితే ఆరు నెలలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల అపరాధ రుసుం విధిస్తారు. క్రిమినల్ చర్యలకు పాల్పడితే సంవత్సరం శిక్ష, రెండు వేల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుంది. క్రిమినల్ ఫోర్స్ వంటి నేరానికి పాల్పడితే రెండేళ్ల శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తారు. కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడితే రూ.10 వేలు అపరాధ రుసుం, ఐదేళ్ల శిక్ష వర్తిస్తుంది. ర్యాగింగ్ కేసు నమోదైతే సదరు విద్యార్థిని కళాశాల నుంచి పంపించేస్తారు. ఇతర కళాశాలల్లో సైతం చేర్పించుకోరు. విద్యార్థిపై ఒక్కసారి ర్యాగింగ్ కేసు నమోదైతే విలువైన జీవితం ముగుస్తుంది. విద్యాసంస్థదే బాధ్యత.. సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో విద్యాసంస్థలు ర్యాగింగ్ నియంత్రణకు పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థా యి నియంత్రణలో విద్యాసంస్థదే బాధ్యత. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు వేయాలి. వీటిలో సీనియర్, జూనియర్ విద్యార్థులను భాగస్వాములను చేయాలి. విద్యార్థులు, అధ్యాపకులు, బోధన సిబ్బంది కమిటీలో సభ్యులు గా ఉండాలి. ఐదుగురు నుంచి ఆరుగురితో కమిటీలు పక్కాగా నిర్వహించాలి. ప్రచార ఫ్లెక్సీలు ప్రదర్శించి అధికారుల ఫోన్ నంబర్లు పొందుపరిచాలి. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ధ్రువీకరణ తీసుకుంటున్నాం ర్యాగింగ్‌కు పాల్పడబో మని ప్రవేశ సమయంలో నే విద్యార్థుల ధ్రువీకరణ తీసకుంటున్నాం. వర్సిటీలో ర్యాగింగ్‌కు ఆస్కార మే లేదు. ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వసతి గృహాల్లో నిరంతరం నిఘా పెట్టాం. అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, బోధన సిబ్బందితో ర్యాగింగ్ నియంత్రణ కమిటీలు నియమిస్తున్నాం. ప్రిన్సిపాళ్లను అప్రమత్తం చేస్తున్నాం. –ప్రొఫెసర్ కూన రామ్‌జీ, వైస్ చాన్సలర్, బీఆర్‌ఏయూ అవగాహన కల్పిస్తున్నాం విద్యార్థులకు భవిష్యత్‌పై అవగాహన కల్పిస్తున్నాం. భవిష్యత్తు, జీవితం విలు వ తెలిసిన వారు ర్యాగింగ్‌కు పాల్పడరు. తరగతి గదులు, వసతి గృహంలో ర్యాగింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ప్రశాం తంగా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. విద్యార్థులు వర్సిటీలోకి లక్ష్యాలతో అడుగు పెడతారు. వాటిని చేరుకోవాలంటే పట్టుదలతో చదవడం ఒక్కటే మార్గం. – ప్రొఫెసర్ కె,రఘుబాబు, రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ -
ఆసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఆసెట్–2017 గురువారం ప్రారంభమైంది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన చేశారు. సహాయ కేంద్రాన్ని ఇన్చార్జ్ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య ప్రారంభించారు. తొలిరోజు 1000 ర్యాంకులోపు ఫిజికల్ సైన్స్, 2000 ర్యాంకు లోపు కెమిస్ట్రీ , 547 ర్యాంకులోపు ఇంగ్లిష్ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొత్తం 67 మంది హాజరయ్యారు. శుక్రవారం వర్సిటీ సహాయ కేంద్రంలో 1534 ర్యాంకు లోçపు ఫిజిక్స్, 4489లోపు కెమికల్ సైన్సెస్, హ్యుమానిటీస్, సొషల్ సైన్స్‌కు సంబంధించి 1500లోపు విద్యార్థులు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ పె ద్దకోట చిరంజీవిలు పరిశీలించారు. -
ఫలితాల కోసం ఎదురుచూపు..!
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ తృతీయ ఏడాది ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది. ఫలితాల కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడంలేదు. ఇప్పటికే ఏయూ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ మాత్రం ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. జిల్లా నుంచి డి గ్రీ తృతీయ ఏడాది 14,550 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మార్చి 4 నుంచి 17 వరకు పరీక్షలు జరిగాయి. ఎడ్‌సెట్, ఐసెట్, ఆసెట్, ఇతర యూనివర్సిటీల పీజీ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ఫలితాలు విడుదలైతే రెట్టింపు ఉత్సాహంగా చదివేందుకు ఆస్కారం ఉన్నా విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. ఇదే విషయాన్ని వర్సిటీ పరీక్షణ నిర్వహణాధికారి ప్రొఫసర్ తమ్మినేని కామరాజు వద్ద ప్రస్తావించగా మరో పది రోజుల్లో ఫలితాలు ప్రకటించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
మాస్ కాపీయింగ్‌పై అప్రమత్తం
ఎచ్చెర్ల : డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీరుుంగ్ పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిశీ లకులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు సూచించారు. వర్శిటీ పరీక్షల నిర్వహణ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17తో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు పూర్తవుతాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి రెండో ఏడాది, మొదటి ఏడాది బ్యాక్లాగ్ విద్యార్థుల పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. రెండో ఏడాది పరీక్షలకు 12,965 మంది హాజరు కానున్నారని, మొదటి సెమిస్టర్ ఇయర్ ఎండ్ బ్యాక్లాగ్ విద్యార్థులు 8437 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆరోపణలు ఉన్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ప్రత్యేక స్క్వాడ్ బృందాలు సైతం పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. -
వృత్తి విద్యా కోర్సులకు ఏదీ గుర్తింపు!?
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే వృత్తి విద్యా కోర్సులకు సంబంధిత అధీకృత యూనివర్సిటీల నుంచి గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ కళాశాలలు కూడా గుర్తింపు లేకుండా కొన్ని కోర్సులను నిర్వహిస్తున్నారు. కోర్సులు నిర్వహిస్తున్నది ప్రభుత్వ కళాశాలలే కావడం వల్ల విద్యార్థులకు కూడా ఎటువంటి అనుమానాలు రావడం లేదు. వాస్తవానికి గుర్తింపు తీసుకు వచ్చేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎచ్చెర్ల: వృత్తి విద్యా కోర్సులు నిర్వహించాలంటే సంబంధిత అధీకృత సంస్థల గుర్తింపు అవసరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ గుర్తింపులు ప్రస్తుతం కొన్ని కోర్సులకు సమస్యలుగా మారుతున్నాయి. కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. అధీకృత సంస్థలు నిబంధనల ప్రకారం గుర్తింపు రావాలంటే ఆ మేరకు వసతులు, బోధకులు, ల్యాబ్స్, లైబ్రరీలు అవసరం. అప్పుడే కోర్సులు బలోపేతం అవుతాయి. మరో పక్క అధీకృత సంస్థల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎల్ఎల్బీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు. అయితే ప్రభుత్వ సంస్థ కావడంలో కోర్సును కొనసాగిస్తున్నారు. వర్సిటీ ఏర్పడిన తరువాత బీసీఐ బృందం వచ్చినా ఇక్కడ అమలు చేస్తున్న నిబంధనలు నేపథ్యంలో గుర్తింపు ఇవ్వలేదు. 60 సీట్లు ఉన్న ఈ కోర్సు బలోపేతం చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవ లసి ఉంది. ఎల్ఎల్బీ కోర్సును పక్కాగా నిర్వహిస్తేనే బీసీఐ గుర్తింపు ఇస్తుంది. ప్రత్యేక కళాశాల, తరగతి గదులు, మూట్ కోర్టు, గ్రంథాలయం, అర్హతగల బోధకులు ప్రిన్సిపాల్ ఇలా అనేక వసతులు ఉండాలి. వర్సిటీ ఏర్పడక ముందు నుంచి ఏయూ పీజీ సెంటర్‌గా ఉన్నప్పటి నుంచే బీసీఐ గుర్తింపు లేదు. ప్రస్తుతం ఈ గుర్తింపు కోసం వర్సిటీ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీఐ బృందం త్వరలో వర్సిటీకి రానుంది. ఈ సారి గుర్తింపు వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే... ఎంఎడ్: ఎంఎడ్ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ గుర్తింపు ఇవ్వాలి. ఈ కోర్సుకు గుర్తింపు ఉంది. పక్కాగా భవనాలు, బోధకులు, ప్రత్యేక గ్రంథాలయం ఉంది. బృందం సభ్యులు వచ్చినపుడు కామన్ లైబ్రరీ, ల్యాబ్స్ చూపిస్తున్నారు తప్ప, ఎన్సీటీఈ సంస్థ నిబంధనల మేరకు కోర్సు నిర్వహణకు డిజైన్ మాత్రం చేయడం లేదు. బీఎడ్ (మెంటల్లీ రిటార్డెడ్): ఈ కోర్సుకు గత ఏడాది మౌలిక వసతుల కొరత, అర్హులైన బోధకులు లేకపోవడం వల్ల రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్మిషన్లు రద్దు చేసింది. 2009లో ప్రారంభమైన కోర్సును 2015లో నిర్వహించలేదు. ఇటీవల మళ్లీ ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త భవనాలతో పాటు కొత్తగా అవసరమైన మానసిక శాస్త్రవేత్తలతో పాటు ఇతర పోస్టులను అవసరం మేరకు నియమించారు. గతంలో ఈ కోర్సును ముగ్గురు బోధకులతో నెట్టుకువచ్చేవారు. కోర్సు రద్దయిన నేపథ్యంలో బోధకునిగా కొన సాగుతున్న విశ్రాంత ఉద్యోగి డాక్టర్ యండ్ల రవికుమార్‌ను తొలగించారు. మరో ఇద్దరు సూ ర్యకళ, లలిత కుమారిలను మాత్రం కొనసాగించారు. ప్రస్తుతం ఈ కమిటీ సభ్యులు అనుమతి ఇస్తేనే ఈ ఏడాది రెండేళ్ల కోర్సు మళ్లీ పునర్‌ప్రారంభం అవుతుంది. మరో పక్క బీసీఐ, ఆర్సీఐ రెండూ ఢిల్లీకి చెందిన సంస్థలు కావడంతో పక్కాగా నిబంధనలు పరిశీలిస్తున్నారు. దక్షణాది సంస్థలు మాత్రం ప్రభుత్వ యూనివర్సిటీలు కావడంతో అంతగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం గుర్తుంపులకు ప్రధాన సమస్య రెగ్యులర్ బోధకులు లేక పోవడంగా నిష్ణాతులు చెబుతున్నారు. అర్హులైన బోధకులు కావాలంటే రెగ్యులర్ నియామకాలు కీలకం అన్నది చాలా మంది అభిప్రాయం. ఎల్ఎల్బీ కోర్సు గుర్తింపునకు కృషి ప్రస్తుతం ఎల్ఎల్బీ కోర్సుకు గుర్తింపు కోసం కృషిచేస్తున్నాం. బీసీఐ నిబంధనల మేరకు మౌలిక వసతు లు సమకూర్చడం, బోధకుల నియామకాన్ని అధికారులు చేపట్టారు. ప్రభుత్వ యూనివర్సిటీ కావడం వల్ల చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉండదు. త్వర లో బీసీఐ బృందం పర్యవేక్షణ చేయనుంది. - డాక్టర్ కె.కృష్ణమూర్తి, సమన్వయకర్త, ఎల్ఎల్బీ కోర్సుల బలోపేతానికి గుర్తింపు అవసరం వర్సిటీలో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధిత అధీకృత సంస్థల నుంచి రావలసిన గుర్తింపుల కోసం కృషిచేస్తున్నాం. కోర్సులు బలోపేతం కావాలంటే గుర్తింపులు అవసరం. ప్రస్తుతం పక్కా భవనాలు నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో వసతి కొరత ఉండదు. మరో పక్క రెగ్యులర్ బోధకుల నియామకం జరిగితే శాశ్వితంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. - ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, రిజిస్ట్రార్ కోర్సు : గుర్తింపు ఇవ్వవలసిన సంస్థ ఎల్ఎల్బీ : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంఎడ్ : నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ బీఎడ్ : రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (మెంటల్లీ రిటార్డెడ్) -
స్పెషల్ బీఈడీకి మంగళం
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పెషల్ బీఎడ్ (మెంటల్లీ రిటార్డ్)కోర్సుకు ఈ ఏడాది అడ్మిషన్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఢిల్లీకి చెందిన రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కోర్సు గుర్తింపును 2015-16 ఏదాదికి రద్దు చేసింది. ఇప్పటి వరకు ఎడ్‌సెట్ ద్వారా ఈ కోర్సుకు ప్రవేశాలు కల్పించేవారు. 25 సీట్లతో 2009లో ఈ కోర్సు ప్రారంభమైంది. తొలినాళ్లలో నేరుగా ప్రవేశాలు కల్పించగా, 2013 నుంచి ఏపీ ఎడ్‌సెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. బీఎడ్ కోర్సు రెండేళ్లు కాగా, దీన్ని కూడా రెండేళ్లుగా మార్పు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్ సీఐ బృందం ఇటీవల వర్సిటీలో వసతులు పరిశీలించి... నిబంధనల మేరకు వసతి లేదన్న కారణంతో కోర్సు నిలిపి వేసింది. ఈ మేరకు ఈ ఏడాది కళాశాలల జాబితాలో వీటి ప్రవేశాలు మినహాయించారు. ఉపాధినిచ్చే కోర్సు... స్పెషల్ బీఈడీలో ఇప్పటి వరకు ఐదు బ్యాచ్‌లు రిలీవ్ కాగా, ప్రస్తుతం ఆరో బ్యాచ్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. అంటే ఆరు బ్యాచ్‌లు పూర్తయినట్లు లెక్క. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తూ వచ్చాయి. మండల రిసోర్స్ కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలు కోసం నియమించే ఉపాధ్యాయులుగా ఉపాధి అవకా శాలు లభిస్తున్నాయి. ఈ కోర్సు నిలిచిపోవటంతో విద్యార్థులకు ఒక ఉపాధినిచ్చే కోర్సు దూరమైనట్టేయింది. చివరి దశలో భవన నిర్మాణాలు ప్రస్తుతం వర్సిటీలో నిర్మాణంలో ఉన్న కొత్త అకడమిక్ భవనం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ భవనాన్ని అధికారులు విస్తరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వచ్చేఏడాది ఈ కోర్సు అందు బాటులోకి వచ్చే అవకా శాలున్నాయి. అయితే అధీకృత సంస్థ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది ఈ కోర్సుకు మళ్లీ అవకాశముటుందో లేదో వేచి చూడాల్సిందే! వచ్చే విద్యా సంవత్సరానికి మళ్లీ ప్రారంభిస్తాం వచ్చేఏడాదినాటికి రిహేబిలిటేషన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు తరగతి గదులు ఇతర వసతులు సమకూర్చుతాం. తద్వారా విద్యార్థులకు మళ్లీ ఈ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. - ప్రొఫెసర్ గుంట తులసీరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ -
డిగ్రీ రెండో ఏడాది ఫిజిక్స్ పరీక్ష రద్దు
ఎచ్చెర్ల : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సంవత్సరం ఫిజిక్స్(భౌతిక శాస్త్రం) పరీక్షను వర్సిటీ అధికారులు రద్దు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరగాల్సిన ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు రావడంతో, వాటిని పరిశీలించి పరీక్షను రద్దు చేసినట్లు వ ర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ప్రకటించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లీక్ అయినట్లు ప్రచారంలో ఉన్న ప్రశ్నలు, తాము రూపొందించిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు ఇంచుమించు ఒకేలా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే పూర్తి ప్రశ్నపత్రం లీక్ అయిందనడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవని, విద్యార్థుల ఆందోళన, వారి విజ్ఞప్తి మేరకు పరీక్ష రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. గురువారం రాత్రి నుంచి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న ప్రచారం జరగడంతో అర్ధరాత్రి వేళ జల్లా ఎస్పీ ఏఎస్ఖాన్కు ఫోన్లో ఫిర్యాదు చేశామని, తిరిగి శుక్రవార ం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని వివరించారు. పూర్తి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందా.. లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలుతుందన్నారు. తిరిగి ఈ పరీక్షను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తామని వీసీ చెప్పారు. కాగా జిల్లాలోని 43 కేంద్రాల్లో 6032 మంది విద్యార్థులు ఫిజిక్స్ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్ష రద్దయిన విషయం తెలియక శుక్రవారం మధ్యాహ్నం వారందరూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. రద్దు విషయం తెలుసుకుని ఉసూరుమంటూ వెనుదిరిగాారు. పోలీసుల రంగ ప్రవేశం వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి డిగ్రీ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వర్సిటీ అధికారులు 14 బృందాలతో నిఘా పెట్టారు. రాత్రివేళల్లో సైతం స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా పెట్టారు. అయినా రెండు రోజుల క్రితం గణిత ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, ఇందులోని ప్రశ్నల జాబితాలు కాశీబుగ్గలోని జిరాక్సు కేంద్రంలో లభించాయన్న ప్రచారం జరిగింది. అలాగే గురువారం రాత్రి ఫిజిక్స్ ప్రశ్నలు వాట్సాప్, ఎస్సెమ్మెస్‌లలో హల్చల్ చేశాయి. శుక్రవారం జరగాల్సిన ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 11 ప్రశ్నలు గురువారం రాత్రి బయటకు వచ్చాయి. డిజై న్ చేసిన పేపర్లోని ప్రశ్నలతో వీటిని సరిచూసుకున్న వర్సిటీ అధికారులు చివరికి పరీక్ష రద్దు చేశారు. కాగా వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తునకు శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు ఆధ్వర్యంలో ఓ బృందాన్ని జిల్లా ఎస్పీ నియమించారు. ప్రశ్నలు బయటకొచ్చినట్లు ఎక్కువ ప్రచారం జరిగిన శ్రీకాకుళం పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీసులు లీకేజీకి అవకాశం ఉన్న మార్గాల విషయంలో స్పష్టత కోసం వర్సిటీ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రం డిజైనింగ్ నుంచి స్ట్రాంగ్ రూముల కు తరలించే లోపు, అలాగే స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చాక లీక్ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో పరీక్షలు సక్రమంగా జరగాలంటే లీకేజీ అంశంపై స్పష్టత రావాలని, నిజంగా జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రిజస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిరాశతో వెనుదిరిగిన విద్యార్థులు పలాస: బీఎస్సీ ద్వితీయ సంవత్సం ఫిజిక్స్ పరీక్ష పేపర్ లీకయినట్టు జరిగిన ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఏయూ అధికారులు పరీక్షను రద్దు చేయడంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో పలు కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా అధికారులు కేటాయించారు. అయితే బీఎస్సీ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పరీక్షను యూనివర్సిటీ అధికారులు రద్దు చేస్తున్నట్లు ఆయా కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్లకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఫోన్లో సమాచారం అందింది. దీంతో పరీక్ష నిర్వాహకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పరీక్ష రద్దు చేస్తున్నట్లు అధికారుల నుంచి సమాచారం అందినట్లు పరీక్షా నిర్వాహకులు చెప్పారు. అన్ని కేంద్రాల వద్ద పరీక్ష రద్దు చేస్తున్నట్లు నోటీసును బోర్డులకు అతికించారు. వీటిని చూసిన విద్యార్థులు నిరాశతో తిరుగుముఖం పట్టారు. -
సమర్థతే గీటురాయి..!
ఎచ్చెర్ల : వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు అనేది కీలకమైంది. రిజిస్ట్రార్లకు నితంతరం వత్తిళ్లు...పని భారం ఉంటుంది. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి సమర్థత,నైపుణ్యం, సానుకూల ధృక్పథం, సమయానుకూల ఆలోచనా ధోరణి అవసరం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణ మోహన్, తనదైన శైలిలో పని చేస్తూ సమర్థతే గీటురాయిగా మందుకు సాగుతూ గుర్తింపు పొందారు. రిజిస్ట్రార్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో ఏట అడుగుపెట్టారు కృష్ణ మోహన్.నలుగురు వైస్ ఛాన్సలర్లు దగ్గర పనిచేసిన ఘనత వర్సిటీలో 2008 జూన్ 25న ఏర్పడ గా, ఇప్పటి వరకు ఇక్కడ నలుగురు వీసీలు పని చేశారు. ఇందులో ఇద్దరు ఇన్‌ఛార్జి వీసీలు, మరో ఇద్దరు రెగ్యులర్ వీసీలు. రిజిస్ట్రార్‌ను ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ అభివృద్ధి మండలి అనుమతితో వైస్ ఛాన్సలర్ నియమిస్తారు.వర్సిటీ ఏర్పడ్డాక మొదటి రిజస్ట్రార్‌గా మొదటి వీసీ ఎస్వీ సుధాకర్ ఏయూ సీనియర్ జువాలజీ ప్రొఫెసర్ జి.జ్ఞానమణిని 2008 ఆగస్టు 25న నియమించారు. 2009 ఆగస్టు 25కి ఏడాది ముగిసిన తరువాత మరో సారి ఆయనను కొనసాగించకపోవడంతో రిలీవ్ అయ్యారు.అనంతరం అప్పటి ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యకు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా అవకాశం ఇచ్చారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈయన ఇన్ఛార్జిగా కొనసాగారు.అనంతరం 2 009 సెప్టెంబర్ 16న ఆంధ్రాయూనివర్సిటీలోని కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను రిజిస్ట్రార్‌గా అప్పటి వీసీ ఎస్వీ సుధాకర్ సిఫారసుతో ప్రభుత్వ నియమించింది. అప్పటి నుంచి ఈయన కొన సాగుతున్నారు. ఎస్వీ సుధాకర్ తరువాత ఇన్‌ఛార్జి వీసీలు వై.సత్యనారాయణ, ఆర్జీబీ భగవత్ కుమార్ సైతం ఈయననే కొనసాగించారు.ఒక దశలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌గా వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుత వీసీ హెచ్.లజపతిరాయ్ కృష్ణమోహన్ సమర్థతను గుర్తించి ప్రోత్సహించడంతో ఐదేళ్లు రిజిస్ట్రార్‌గా పూర్తి చేసుకుని ఘనత వహించారు. అడ్డంకులను,రాజకీయ వత్తిళ్లను అధిగమించి కృష్ణమోహన్ రిజిస్ట్రార్‌గా మంచి పనితీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. 2011 సెప్టెంబర్ 16న పదవీకాలం మూడేళ్లు పూర్తి కావడంతో ఇక్కడి నుంచి రిజిస్ట్రార్‌ను సాగ నంపాలని, స్థానికులకు అవకాశం ఇవ్వాలని కొందరు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.అయినా అప్పటి ఇన్‌ఛార్జి వీసీ వై.సత్యనారాయణ రిజస్ట్రార్‌గా కృష్ణ మోహన్‌ను తాత్కాలిక ఉత్తర్వులతో కొనసాగించారు. 2012 ఆగస్టు 29న మాకుమ్మడిగా స్థానికులు రిజస్ట్రార్‌ను మార్పు చేయాలని అప్పటి ఇన్‌ఛార్జి వీసీ భగవత్ కుమార్‌కు వినతి పత్రం ఇచ్చినా ఇన్‌ఛార్జి హోదాలో మార్పు చేయనని స్పష్టం చేశారు. 2011లో ఉత్తమ అధ్యాపక అవార్డు వర్సిటీ విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తరుఫున 2011లో ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి కూడా కృష్ణమోహన్ కావటం గమనార్హం. 2012లో జి.తులసీరావు, 2013లో ఎం.చంద్రయ్య, 2014లో పి.చిరంజీవులు ఈ అవార్డులు స్వీకరించారు. ఆనందంగా ఉంది వర్సిటీ అభివృద్ధిలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. వర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఇప్పటికే ప్రభుత్వం కావల్సినంత స్థలం కేటాయించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూ.18 కోట్ల భవనాలు నిర్మాణం పూర్తయితే వసతి కొరత పూర్తిగా తీరిపోతుంది.కొత్త కోర్సులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. వన్ జీబీ ఇంటర్నెట్ వంటి సౌకర్యాం అందుబాటులోకి వచ్చింది. వర్సిటీలోని అన్ని విభాగాలను బలోపేతం చేయటమే లక్ష్యం. - ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్,రిజిస్ట్రార్ -
ఎవరి పునర్నిర్మాణానికి ఈ వసూళ్లు!
స్వచ్ఛందం గా ఇచ్చేదాన్నే విరాళం అంటారు.. అలాకాకుండా పెద్దలే నిర్ణయించి.. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 రోజుల వేతనం ఇచ్చేయమంటే.. దాన్ని కడుపు కొట్టడం అంటారు తప్ప విరాళం అనరు. ప్రస్తుతం ఎచ్చెర్ల అంబేద్కర్ వర్సిటీలో ఈ తరహా విరాళాల వసూలు సాగుతోంది. దీనికి వారు పెట్టిన ముద్దుపేరు.. ‘రాజధాని పునర్నిర్మాణం, వర్సిటీ అభివృద్ధి నిధి’..యథారాజా.. తథా ప్రజా.. అన్నట్లు రాజధాని పునర్మాణ నిధుల కోసం పాలకులు ఏకంగా సచివాలయంలోనే హుండీలు పెట్టగా లేనిది.. మేం స్థానికంగా డిబ్బీలు పెడితే తప్పేమిటన్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలా వసూలు చేసిన సొమ్ముతో బాబుగారి వద్దకు వెళ్లి సొంత ఇమేజ్ పెంచుకోవడం.. మరో టెర్మ్ పొడిగించుకోవడం వీలైతే ఇంకా పెద్ద పోస్టు కొట్టేయడమే.. ఈ తతంగం వెనుక అసలు ఎజెండా అని సమాచారం. కోటరీ తీర్మానం తరగతులు జరగని మే నెల వేతనాలకు సంబంధించి ఉన్నతాధికారి కోటరీ ఒక తీర్మానం చేసిందట. దాన్ని అప్పట్లోనే కొందరు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. ఈ కమిటీ చేసిన తీర్మానం సారాంశం ఏమిటంటే.. ‘మే నెలకు వర్సిటీ జీతం మంజూరు చేస్తుంది. అందులో 15 రోజుల మొత్తం అధికారులకు తిరిగి ఇవ్వాలి. ఆ మొత్తాన్ని రాజధాని పునర్నిర్మాణ నిధి, వర్సిటీ అభివృద్ధి నిధికి జమ చేస్తారు’. అసలు వేతనమే రాని కాలానికి ఇస్తున్నాం కనుక.. అందులో సగం విరాళంగా ఇవ్వాలని చెప్పి బలవంతంగా ఒప్పించారు. ఎచ్చెర్ల క్యాంపస్: సొంత ఎదుగుదల కోసం.. పెద్దల ప్రాపకం కోసం వేతన జీవుల పొట్ట కొట్టే పనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ ఉన్నతాధికారి పాల్పడుతున్నారు. రాజధాని పునర్నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి పిలుపును తనకు అనుకూలంగా మలచుకున్నారు. విరాళాల పేరుతో కాంట్రాక్టు బోధకుల(టీఏలు) జీవితాలతో అడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా 15 రోజుల వేతనాన్ని విరాళం కింద తీసుకోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. సగం నెల జీతం తీసేసుకుంటే తమ కుటుంబాలు నెలంతా ఎలా గడుస్తాయని ఆవేదన చెందుతున్నారు. అయితే బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. కాంట్రాక్టు బోధకుల నుంచి 15 రోజుల వేతనం తీసుకున్న ఉన్నతాధికారి.. రెగ్యులర్ బోధకుల విషయంలో మాత్రం మెతకగా వ్యవహరిస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. అసలే తక్కువ వేతనాలు విశ్వవిద్యాలయాల్లో సాధారణంగా ఏడాదిలో 10 నెలలే తరగతులు జరుగుతాయి. కాంట్రాక్టు బోధకులకు ఈ పది నెలలకే జీతాలు చెల్లిస్తారు. తరగతులు జరగని కాలానికి ఎంత జీతం ఇవ్వాలన్నది ఆయా విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారుల విచక్షణాధికారంపై ఆధారపడి ఉం టుంది. కొన్ని యూని వర్సిటీల్లో 45 రోజుల జీతం ఇస్తుండగా, మరికొన్నింటిలో 30 రోజుల జీతమే ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఇక్కడి కొందరు టీఏలు వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి గతంలో తీసుకువెళ్లగా.. సెలవు రోజులకు వేతనం ఇవ్వాలంటే విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, అభివృద్ధి మండలి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అందువల్ల అది సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. గత ఏడాది కూడా కాంట్రాక్టు బోధకులకు పది నెలల వేతనమే ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకించి మే నెల వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లే నిర్ణయించి.. అందులో సగం విరాళం పేరుతో కోత వేశారు. రెగ్యులర్ బోధకుల విముఖత వర్సిటీలో ప్రస్తుతం 62 మంది టీచింగ్ అసోసియేట్లు పని చేస్తున్నారు. వీరిలో పీహెచ్డీ చేసిన వారికి రూ.21,500, ఎంఫిల్ చేసిన వారికి రూ.20 వేలు, పీజీ చేసిన వారికి రూ. 18 వేలు నెల జీతంగా చెల్లిస్తున్నారు. ఇందులో 15 రోజుల వేతనం అంటే రూ.9వేల నుంచి రూ.11 వేల వరకు పోతుందన్నమాట. ఇలా సుమారు రూ. 7 లక్షలు వసూలు చేశారు. స్వచ్ఛందంగా ఇచ్చినట్లు అందరి వద్దా సంతకాలు తీసేసుకున్నారు. ఉన్నతాధికారి కోటరీ సభ్యులే దగ్గరుండి ఈ తతంగమంతా నడిపించారు. దీంతో కాంట్రాక్టు బోధకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా వర్సిటీలో ఉన్న 12 మంది రెగ్యులర్ బోధకులు మాత్రం ఈ నిర్ణయంపై విముఖత చూపుతున్నారు. ఒక్కరోజు జీతం ఇచ్చేందుకే వారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంట్రాక్టు బోధకుల నుంచి ఇప్పటికే బలవంతంగా సంతకాలు సేకరించిన కోటరీ వీరి విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. అసలు లక్ష్యం ఏమిటంటే.. ఈ వసూళ్ల వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. విరాళాల పేరుతో వసూలు చేసిన భారీ మొత్తాన్ని వర్సిటీ ఉన్నతాధికారి చెక్కు రూపంలో తీసుకెళ్లి స్వయంగా ముఖ్యమంత్రికి అందజేస్తారట. సీఎం వద్దకు తీసుకెళ్లడంతోపాటు వర్సిటీలో అమలు చేస్తున్న 20 ఆర్థిక ప్రగతి సూత్రాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తానని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనగారికి హామీ ఇచ్చారని తెలిసింది. భారీ మొత్తానికి చెక్కు అందజేయడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం వద్ద మార్కులు కొట్టేయాలన్నది వర్సిటీ ఉన్నతాధికారి ఆలోచన. తద్వారా ఇక్కడ తన పదవీకాలం పూర్తి కాగానే మరో టర్మ్ పొడిగించుకోవడం.. వీలుంటే దీని కంటే పెద్ద పోస్టు కొట్టేయడం ఆయన అసలు లక్ష్యమని తెలిసింది. ఇందుకు తన కోటరీలో ఉన్న టీఏలను భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అవకాశం కల్పిస్తానని ఆశ చూపి.. వారి ద్వారా కాంట్రాక్ట్ బోధకులను బలి చేస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అందరి ఏకాభిప్రాయంతోనేనట.. టీఏల అందరి ఏకాభిప్రాయంతోనే 15 రోజుల జీతాన్ని రాజధాని పునర్నిర్మాణ నిధి, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్ కోసం వసూలు చేసినట్లు వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుంట తులసీరావు చెప్పారు. ఎవరినీ బలవంతం చేయలేదన్నారు. నిర్బంధ వసూళ్లన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కాగా రెగ్యులర్ బోధకుల నుంచి ఎంత వసూలు చేయాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పడం విశేషం.