ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పెషల్ బీఎడ్ (మెంటల్లీ రిటార్డ్)కోర్సుకు ఈ ఏడాది అడ్మిషన్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఢిల్లీకి చెందిన రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కోర్సు గుర్తింపును 2015-16 ఏదాదికి రద్దు చేసింది. ఇప్పటి వరకు ఎడ్‌సెట్ ద్వారా ఈ కోర్సుకు ప్రవేశాలు కల్పించేవారు. 25 సీట్లతో 2009లో ఈ కోర్సు ప్రారంభమైంది. తొలినాళ్లలో నేరుగా ప్రవేశాలు కల్పించగా, 2013 నుంచి ఏపీ ఎడ్‌సెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. బీఎడ్ కోర్సు రెండేళ్లు కాగా, దీన్ని కూడా రెండేళ్లుగా మార్పు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్ సీఐ బృందం ఇటీవల వర్సిటీలో వసతులు పరిశీలించి... నిబంధనల మేరకు వసతి లేదన్న కారణంతో కోర్సు నిలిపి వేసింది. ఈ మేరకు ఈ ఏడాది కళాశాలల జాబితాలో వీటి ప్రవేశాలు మినహాయించారు.
ఉపాధినిచ్చే కోర్సు...
స్పెషల్ బీఈడీలో ఇప్పటి వరకు ఐదు బ్యాచ్‌లు రిలీవ్ కాగా, ప్రస్తుతం ఆరో బ్యాచ్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. అంటే ఆరు బ్యాచ్‌లు పూర్తయినట్లు లెక్క. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తూ వచ్చాయి. మండల రిసోర్స్ కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలు కోసం నియమించే ఉపాధ్యాయులుగా ఉపాధి అవకా శాలు లభిస్తున్నాయి. ఈ కోర్సు నిలిచిపోవటంతో విద్యార్థులకు ఒక ఉపాధినిచ్చే కోర్సు దూరమైనట్టేయింది.
చివరి దశలో భవన నిర్మాణాలు
ప్రస్తుతం వర్సిటీలో నిర్మాణంలో ఉన్న కొత్త అకడమిక్ భవనం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ భవనాన్ని అధికారులు విస్తరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వచ్చేఏడాది ఈ కోర్సు అందు బాటులోకి వచ్చే అవకా
శాలున్నాయి. అయితే అధీకృత సంస్థ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది ఈ కోర్సుకు మళ్లీ అవకాశముటుందో లేదో వేచి చూడాల్సిందే!
వచ్చే విద్యా సంవత్సరానికి మళ్లీ ప్రారంభిస్తాం
వచ్చేఏడాదినాటికి రిహేబిలిటేషన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు తరగతి గదులు ఇతర వసతులు సమకూర్చుతాం. తద్వారా విద్యార్థులకు మళ్లీ ఈ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.
- ప్రొఫెసర్ గుంట తులసీరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
స్పెషల్ బీఈడీకి మంగళం
Published Sun, Sep 6 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement