వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ఐదు రోజుల క్రితం హన్మకొండ పోలీసులు నకిలీ డాక్టర్ పేరుతో అదుపులోకి తీసుకున్న ఎండకానలజిస్ట్ హసన్‌భూపతి వ్యవహారంపై హన్మకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కాకాజీకాలనీలోని శ్రీసాయి ఆస్పత్రిపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాను అసలు డాక్టర్‌నేనని, తన ఒరిజినల్ సర్టిఫికెట్‌లు తన స్వస్థలమైన తమిళనాడులో ఉన్నాయని చెప్పడంతో ఒక వ్యక్తి పూచికత్తు మేరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల కొరకు హసన్‌భూపతిని పంపినట్లు హన్మకొండ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సద రు నకిలీ డాక్టర్ పరారైనట్లు మీడియాలో విసృ్తతంగా ప్రచా రం జరిగింది. ఈ విషయమై సీఐ వివరణ ఇస్తూ ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం మాత్రమే పంపించామని, అవి నకిలీవని తే లితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.