హైదరాబాద్ శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆదివారం వీరంగం సృష్టించారు. ప్రభుత్వ వాహనంలో వచ్చిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఇద్దరు వ్యాపారులపై మారణాయుధాలతో దాడి చేసి కిడ్నాప్నకు యత్నించారు.దాంతో సదరు వ్యాపారులు బంధువులు వెంటనే అప్రమత్తమై ఇద్దరు కానిస్టేబుళ్లను బంధించి,శంషాబాద్ పోలీసులను ఫిర్యాదు చేశారు.శంషాబాద్ పోలీసులు హుటాహుటిన వ్యాపారుల ఇళ్లకు చేరుకుని కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను శంషాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే తమ ఎస్పీకి రూ.2.5 లక్షలు మేర ఇద్దరు వ్యాపారులు బాకీ ఉన్నారని, వాటిని వసూల్ చేసేందుకు వచ్చామని కానిస్టేబుళ్లు శంషాబాద్ పోలీసులకు తెలిపారు. ఆ ఘటనపై శంషాబాద్ పోలీసులు ఆ శాఖ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు.
శంషాబాద్లో అనంత కానిస్టేబుళ్లు వీరంగం
Published Sun, Mar 23 2014 9:36 AM | Last Updated on Tue, Mar 19 2019 6:03 PM
Advertisement
Advertisement