బాబు కళ్లకి రాయలసీమ కనిపించడం లేదా ? | Anantha Venkatarami Reddy takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు కళ్లకి రాయలసీమ కనిపించడం లేదా ?

Published Fri, Jul 18 2014 1:16 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

బాబు కళ్లకి రాయలసీమ కనిపించడం లేదా ? - Sakshi

బాబు కళ్లకి రాయలసీమ కనిపించడం లేదా ?

రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని నాయకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలు బొమ్మగా మారారని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నెలదాటిన ఇప్పటి వరకు రాజధాని ఎక్కడో చెప్పకుండా తత్సారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబుపై అనుసరిస్తున్న వ్యవహారశైలిపై అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం నిప్పులు చెరిగారు.

 

రాజధాని ఎక్కడో నిర్ణయించక ముందే ప్రభుత్వ కార్యాలయాలన్ని విజయవాడలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే ఎయిమ్స్, ఐఐటీ వంటి సంస్థలను విజయవాడ - గుంటూరు నగరాల మధ్యే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో నిత్యం కరవు, కాటకాలు ఉంటాయని... అలాంటి ప్రాంతాలు చంద్రబాబు కళ్లకు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement