రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం రాజమండ్రిలో సమావేశమైంది. గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం వారం రోజులుగా నగరంలో మకాం వేసిన చంద్రబాబు కీలక కార్యక్రమాలను సైతం ఇక్కడ నుంచే నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ముందుగా రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయినవారికి సంతాపం తెలిపారు.
అనంతరం ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్, ఆగస్టు 15 వేడుకలు, భూసేకరణ చట్టంపై కేబినెట్ చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే మైనింగ్‌పాలసీ, రాజమండ్రి తొక్కిలాస ఘటన, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పుష్కరాల ముగింపు కార్యాక్రమాన్ని ఈ నెల 25న భారీగా నిర్వహించాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. దీనిపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే సీడ్ క్యాపిటల్పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
రాజమండ్రిలో ఏపీ కేబినెట్ సమావేశం
Published Wed, Jul 22 2015 10:39 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement
Advertisement