
సర్వీస్ ప్రొవైడర్లను విచారించనున్న ఏపీ సీఐడీ
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ..
విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని 12మంది సెల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణలో తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి దేవినేని ఉమ ఇందుకు సంబంధించి భవనీపురం పీఎస్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్వీస్ ప్రొవైడర్లను నోటీసులు జారీ చేశారు. 12మంది సర్వీస్ ప్రొవైడర్లను ఏపీ సీఐడీ విచారించనుంది.