అవయవదానానికి ముందుకొచ్చిన ఆరోగ్యశాఖా మంత్రి
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ అవయవదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ అవయవదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలందరూ అవయవదానానికి ముందుకు రావాలి అని విజ్క్షప్తి చేశారు. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.
కేర్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలో అవయవదానంపై అవగాహన తక్కువగా ఉందన్నారు. దేశంలో అవయవాలు లభించక ఏటా ఐదు లక్షల మంది చనిపోతున్నారన్నారు. అవయవదానం చేయడం వలన మరో వ్యక్తి పునర్జన్మను ఇచ్చినవారవుతారని కామినేని అన్నారు.