మహంతి పదవీ కాలం పొడిగింపుపై తీర్పు వాయిదా | Andhra Pradesh high court adjourn hearing prasanna kumar mohanty post extension | Sakshi
Sakshi News home page

మహంతి పదవీ కాలం పొడిగింపుపై తీర్పు వాయిదా

Published Wed, Mar 26 2014 8:36 PM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

మహంతి పదవీ కాలం పొడిగింపుపై తీర్పు వాయిదా

మహంతి పదవీ కాలం పొడిగింపుపై తీర్పు వాయిదా

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి పదవీ కాలం పొడిగింపు వ్యవహారంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తీర్పును వాయిదా వేస్తున్న హైకోర్టు బుధవారం ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొన్నటి వరకు సాగిన వాదనలను ఇటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం, మహంతి రెండు పేజీలకు మించకుండా వేర్వేరుగా రాతపూర్వకంగా బుధవారం ధర్మాసనం ముందుంచారు.

వీటిని పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ప్రసన్నకుమార్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎం.చంద్రమౌళీశ్వరరావు, విజయవాడ, పటమటకు చెందిన కన్జ్యూమర్స్ గెడైన్స్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ సి.హెచ్.దివాకర్‌బాబు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement